
త్వరలో కొత్త రూ. 100 నోట్లు
ముంబై: త్వరలోనే కొత్త రూ. 100 నోట్లను చలామణీలోకి తేనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకంతో విడుదల చేసే ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్ – 2005 తరహాలోనే ఉంటాయని, రెండు నంబర్ ప్యానెల్స్‌లో ఇన్‌సెట్ లెటర్ ‘ఖ’ ఉంటుందని పేర్కొంది. కొత్త వంద నోటు వెనుకవైపున ముద్రణ సంవత్సరం ’2017’ ఉంటుంది. పాత రూ. 100 నోట్లు ఇకపై కూడా చలామణీలోనే ఉంటాయని ఆర్‌బీఐ వివరించింది.