దేశరాజధాని ఢిల్లీలో త్వరలో ఉబెర్ బస్సులు తిరగనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఒక వినూత్న పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కింద ఆగస్టు నుండి ఢిల్లీవాసులు ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఏర్పడనుంది.
గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసిన ‘ఢిల్లీ మోటార్ వెహికల్ లైసెన్సింగ్ అగ్రిగేటర్ (ప్రీమియం బస్సులు) పథకం’ కింద లగ్జరీ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. నగరంలో ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని అరికట్టడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో రెండు అగ్రిగేటర్లు.. ఉబెర్, అవేగ్ బస్సులను నడపడానికి లైసెన్స్‌లను మంజూరు చేసింది. ఈ బస్సులు ఏఏ మార్గాల్లో సేవలను ప్రారంభించాలనేది ఖరారు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు.
త్వరలో డిల్లీ రోడ్లపై తిరిగే ఈ ప్రీమియం బస్సులు తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. ఈ బస్సులలో వైఫై సదుపాయం ఉంటుంది. అలాగే జీపీఎస్, సీసీటీవీ కూడా ఉంటుంది. ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలోగా ఈ బస్సులు ఢిల్లీ రోడ్లపై తిరగనున్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment