రూ.1.25 కోట్ల వేతనంతో ఉద్యోగం పట్టాడు
ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి రూ.1.25 కోట్ల వేతనంతో ఉబెర్‌లో ఉద్యోగం సంపాదించాడు. అమెరికాకు చెందిన ఉబెర్ టెక్నాలజీస్‌లో వారం రోజుల పాటు ఇంటర్నెషిప్ చేసిన సిద్దార్ధ్ ఆ వెంటనే ఉబెర్ నిర్వహించిన ఓ ఇంటర్వూకు హాజరయ్యాడు. ఇంటర్వూలో వివిధ రకాల అంశాలపై క్లిష్టతరమైన ప్రశ్నలు ఎదురైనట్లు చెప్పాడు. ఢిల్లీకి చెందిన సిద్దార్ధ్ చిన్నతనంలో విద్యాభ్యాసం మొత్తం అక్కడే సాగించాడు.
సిద్దార్ధ్ తండ్రి ఓ ప్లానింగ్ కన్సల్టెంట్, తల్లి ఓ ఫ్రీ లాన్స్ ట్రాన్స్‌లేటర్. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉద్యోగానికి రావాలని తనకు ఆఫర్ అందిందని సిద్దార్ధ్ చెప్పాడు. శాలరీతో ప్రపంచమంతా చుట్టేయాలని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా, ఓ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో వేతన ఆఫర్ రావడం ఇది రెండోసారి. 2015లో ఓ ఢిల్లీ స్టూడెంట్‌కు రూ.1.27 కోట్లు వేతనంతో ఉద్యోగం పొందాడు.