ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : క్యాబ్ డ్రైవర్ పేరిట మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతగాడు విస్తు పోయే విషయాలను వెల్లడించాడు. అసలు అతగాడు డ్రైవర్‌నే కాదంట. వేరొకరి స్థానంలో వెళ్లి అఘాయిత్యాలపై పాల్పడుతున్నట్లు తేలింది.
డిప్యూటీ కమిషనర్ అస్లాం ఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం... ‘సంజీవ్ అలియాస్ సంజు హరియాణాకు చెందిన వ్యక్తి. అతను ఉబెర్‌లో ఉద్యోగి కాదు.. పైగా అతనికి లైసెన్స్ కూడా లేదు. కానీ, ఉబెర్ డ్రైవర్ అయిన తన స్నేహితుడి సహకారంతో మహిళలపై దాడులకు పాల్పడుతూ వస్తున్నాడు. ముందుగా తన స్నేహితుడికొచ్చే బుకింగ్‌లను తాను రిసీవ్ చేసుకునే సంజీవ్.. ఆపై వారిని కారులో నిర్మానుష్యప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించటం చేస్తుంటాడు. అయితే ఇంతవరకు సంజీవ్‌పై ఫిర్యాదు చేయకపోవటంతో ఇంతకాలం ఈ వ్యవహారం బయటపడలేదు.
తాజాగా 24 ఏళ్ల ఓ వివాహితను కుండ్లి(హరియాణా)లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయటంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజీవ్‌ను అతని స్నేహితుడిని అరెస్ట్ చేసిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉబెర్ స్పందిస్తూ... సదరు ఉబెర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నట్లు.. అతని కాంట్రాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment