
ఎయిర్ ఏషియా మరో ప్రమోషనల్ ఆఫర్
న్యూఢిల్లీ : బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా ఇండియా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.తన కొత్త ప్రమోషనల్ స్కీంలో భాగంగా తగ్గింపు ధరల ఆఫర్ కింద విమాన టిక్కెట్లను రూ.899లకే ( అన్నీ కలుపుకొని) అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 23తో ముగియనున్న ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లు 2017 మార్చి 31 మధ్య ప్రయాణాలకు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. రూ. 899 ధరలు గౌహతి-ఇంఫాల్ మధ్య ప్రయాణానికి వర్తించనున్నట్టు తెలిపింది.
అలాగే ఈ ఆఫర్ కింద కొచ్చి- బెంగుళూరు టిక్కెట్టు ధర రూ.999ల నుంచి ప్రారంభమవుతాయి. కొచ్చి-హైదరాబాద్ 2,699గా, గోవా- రూ.3199గా, జైపూర్ - పుణే రూ. 2399 గా ఉండనున్నాయి.
మరిన్ని వివరాలు ఎయిర్ ఏషియా వెబ్ సైట్ లో..