బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా | Bumper bonanza for BSNL customers! | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా

Published Thu, Sep 29 2016 3:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా

న్యూఢిల్లీ:  ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం  బీఎస్ఎన్ఎల్  మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.  రిలయన్స్ జియో పోటీని తట్టుకొనే  క్రమంలో తమ కొత్త కస్టమర్లకోసం మరో నూతన పథకాన్ని గురువారం ప్రకటించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)   కొత్త వినియోగదారులను ఆకట్టుకునే యోచనలో 'ఎక్స్పీరియన్స్  అన్లిమిటెడ్ బీబీ249' గా చెబుతున్న ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా  కేవలం రూ 249 చెల్లించి  అపరిమిత బ్రాడ్ బ్యాండ్ డేటాను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మొదటి ఆరునెలలు నెలల వరకూ రూ.249 ల చార్జ్ తో అపరిమిత డాటా డౌన్ లోడ్ అనుభవాన్ని అందించనుంది. సెప్టెంబర్ 9వతేదీనుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు వివరించింది.

ఎ) అయితే ఇది ఆఫర్   కొత్త బ్రాడ్ బ్యాండ్  వినియోగదారులకు మాత్రమే
బి) ఇదే టారిఫ్ తో ఎఫ్టీటీహెచ్ అందుబాటులో ఉంటుంది.
సి)  ప్రమోషన్ పీరియడ్ లో ఎలాంటి ఇన్ స్టలేషన్ చార్జీలు  ఉండవు.
డి) మిగతా అన్ని చార్జీలు ప్రస్తుతం అమలుచేస్తున్న టారిఫ్ ప్రకారమే ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది చార్ట్ ను పరిశీలించండి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement