తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసింది. ఆ ప్రకృతి విలయం ఇరుదేశాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. దీంతో ఎటూ చూసిన పేకమేడల్లా కూలిని భవనాల కింద చితికిన బతుకులే కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్ని అక్కడ ప్రజలకు అంత తేలికగా మర్చిపోలేని ఘోర విషాదాన్ని మిగిల్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులో సిరియాలోని జెండెరిస్ పట్టణంలో శిథిలా కింద ఓ ఆడ శిశువు జన్మించడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఇలాంటి విషాద సమయంలో జన్మించిన ఆ శిశువు జననం ఒక కొత్త ఆశను రేకెత్తించింది.
సోమవారం సంభవించిన భూకంపం తదనంతరం భద్రతా బలగాలు రెస్క్యూ చర్యలు చేపడుతుండగా..సిరియాలో శిథిలాల కింద ఓ తల్లి ఒక ఆడబిడ్డకి జన్మినిచ్చిన సంగతి తెలిసింది. ఆ శిశువు తల్లి బొడ్డు తాడుకు జత చేయబడి ఉండటంతో సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఐతే ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్లు అందరూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆ శిథిలాల కింద గజగజలాడే చలిలో ఓ చిన్నారి ఏడుపును గమనించి రెస్క్యూ టీం అప్రమత్తమై రక్షించారు.
The moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake.
— Talha Ch (@Talhaofficial01) February 6, 2023
May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW
ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడటంతో పాపను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో ఓ వైద్యుడి భార్య ఆ చిన్నారికి పాలందించింది. ప్రస్తుతం ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. ఐతే ఆ చిన్నారి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి తీసుకువెళ్తానని ఆమె మేనమామ చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో పుట్టడం విశేషం అంటూ.. ఆ చిన్నారికి అయా అని పేరు పెట్టారు. 'అయా' అనగా అరబిక్‌లో 'అద్భుతం' అని అర్థం. ఆమె జననం ఓ అద్భుతం అంటూ అక్కడ ప్రజలు ఆ శిశువుకి ఈ పేరు పెట్టారు.
(చదవండి: 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ బిల్‌గేట్స్)
Comments
Please login to add a commentAdd a comment