కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్‌ మీడియాలో సంబరాలు! | Assistant Professor Unique way to Job Announcement | Sakshi
Sakshi News home page

కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్‌ మీడియాలో సంబరాలు!

Published Wed, Oct 4 2023 1:45 PM | Last Updated on Wed, Oct 4 2023 1:45 PM

Assistant Professor Unique way to Job Announcement - Sakshi

ఇటీవల సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిని చూసిన యూజర్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రొఫెసర్ తన కొత్త ఉద్యోగం గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు. దీనిని చూసినవారు తొలుత  ఆశ్చర్యపోయారు. తేరుకున్నాక  కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. 

ఈ పోస్ట్‌ను చూసిన యూజర్లు వివరీతంగా ఎంజాయ్ చేస్తూ, రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు యూజర్స్‌ తమకు కొత్త ఉద్యోగం రాగానే ఇలాంటి పోస్ట్‌లు పెడతామని చెబుతున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో @akaPrateekshit అనే ఖాతా ద్వారా పోస్ట్‌ చేశారు. దీనిలోని వివరాల ప్రకారం ప్రతీక్షిత్ కాను పాండే అనే యువకునికి కాలిఫోర్నియా  విశ్వవిద్యాలయంలోని కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. అతను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరనున్నారు.
 

వైరల్‌గా మారుతున్న ఈ పోస్టులో ప్రతీక్షిత్‌ ఓ నాయకుని మాదిరిగా పూలదండలు వేసుకుని కనిపిస్తున్నారు. అలాగే భారీ ఓట్ల మెజారీతో గెలిచినట్లు విజయ సంకేతం చూపిస్తున్నారు. పోస్ట్‌లోని వివరాల ప్రకారం కాను పాండే జనవరి 2024లో  కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరనున్నారు. ఒక యూజర్‌ ‘నేను చదువు పూర్తిచేసి, ఉద్యోగం సంపాదించినప్పుడు ఈ విధంగా అందరికీ తెలిసేలా ప్రకటిస్తాననని’ పేర్కొన్నారు. మరొక యూజర్‌ ‘నా జీవితంలో ఎప్పుడూ నేను ఇలాంటి వృత్తిపరమైన ప్రకటనను చూడలేదు’ అని పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: ఐ డ్రాప్స్‌ స్థానంలో జిగురు.. యువతి విలవిల!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement