ఎన్నికలెప్పుడొచ్చినా విజయం మనదే | new joinings ysrcp | Sakshi
Sakshi News home page

ఎన్నికలెప్పుడొచ్చినా విజయం మనదే

Published Fri, Mar 17 2017 11:27 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

ఎన్నికలెప్పుడొచ్చినా విజయం మనదే - Sakshi

ఎన్నికలెప్పుడొచ్చినా విజయం మనదే

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
జిల్లా యాదవ సంఘ నాయకులు పార్టీ చేరిక 
పెద్దాపురం/సామర్లకోట : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి విజయం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీ జిల్లా అ«ధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. అఖిల భారతీయ యాదవ మహాసభ జిల్లా యువజన అధ్యక్షులు కొల్లుబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ ఆయన అనుచరులు సుమారు 500 మంది పార్టీ చేరిక సందర్భంగా శుక్రవారం పెద్దాపురం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నబాబు మాట్లాడుతూ శ్రీనివాస్‌యాదవ్‌ చేరికతో పెద్దాపురం నియోజకవర్గంలో ఉత్సాహకరమైన వాతావరణం ఏర్పడిందన్నారు.

కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ యాదవ సంఘ నాయకులు పార్టీలో చేరుతున్న సందర్భంగా విజయోత్సవ సభలా ఉందన్నారు. నాటి రాజశేఖరరెడ్డి పాలన జగన్‌తోనే సాధ్య పడుతుందని మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ టీడీపీని నిలదీసినా, ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మండపేట, రాజమండ్రి, జగ్గంపేట, కాకినాడ టౌన్‌ కో ఆర్డినేటర్లు లీలాకృష్ణ, ఆకుల వీర్రాజు,  ముత్యాల శ్రీనివాస్, ముత్తా శశిధర్‌ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయమని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, సభాధ్యక్షులు తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకులు నియోజకవర్గంలో దండుకుంటున్నారన్నారు.

  రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారావు మిడుగుదింటి మోహన్, రాష్ట ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంతబాబు, రాష్ట్ర కార్యదర్శి కర్రి వీర్రెడ్డి, రాజమండ్రి ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి ప్రసంగించారు. అనంతరం కొల్లుబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ అరుణ దంపతులతో పాటు సుమారు 500 మంది యాదవ సోదరులకు పార్టీ కండువాలు కప్పి కన్నబాబు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి తోట సత్య, రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర్రాఘవరావు. జిగిని వీరభద్రరావు. కౌన్సిల్‌ ప్రతిపక్ష నేతలు, ఆయా వార్డుల కౌన్సిలర్లు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement