సాక్షి, వైఎస్సార్: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి నేతలు వరుస షాక్‌లిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే వరకు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో ఈపరిణామం పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి పుట్టిన రోజునే ఆయన ముఖ్య అనుచరులు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కడప జిల్లాలో మరికొంత మంది టీడీపీ సీనియర్ నాయకులు పార్టీని వీడారు. వేంపల్లి మెదటి వార్డు మెంబర్ కొరివి రామ సుబ్బారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైస్సార్‌సీపీలో చేరారు. సతీష్ అనుచరులు జేరిపిటి సుధాకర్‌తో సహా 30 కుటుంబాలు టీడీపీని వీడారు. వైఎస్సార్‌సీపీ మాజీఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. ఆయన రాక సందర్భంగా అభిమానులు పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు.
టీడీపీ సీనియర్ నేత రాజీనామా..
మరోవైపు నెల్లూరులో వైఎస్సార్‌సీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీ సీనియర్ నాయకుడు కండ్లగుంట మధుబాబు నాయుడు టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ నేతల తీరుతో మనస్తాపం చెందిన మధుబాబు టీడీపీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు 26వ వార్డు కౌన్సిలర్ గంగినేని పద్మావతి కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment