సాక్షి, వైఎస్సార్ కడప: సోషల్ మీడియాలో టీడీపీ ఐటీ వింగ్ తనపై చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ నాయకులు ఇంగిత జ్ఞానం లేకుండా ఆరోపణలు చేయడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో క్లోరిన్ సరఫరా, ఇతర కాంట్రాక్టులతో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఏలూరు సంఘటనలో నాసిరకం క్లోరిన్ సరఫరా అంటూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్పచారం చేయడం దారుణమన్నారు.
దీనిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వారికి ఫిర్యాదు చేశానని, జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ వారిక ఫిర్యాదు చేశాన్నారు. ముఖ్యమంత్రి మేనమామ కావడం వల్లే తనను టార్గెట్ చేశారన్నారు. ఎందుకంటే ఇలా అయినా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెడ్డపేరు తీసుకురావలని కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్పా ఇలాంటి నీజమైన రాజకీయాఉల ఎప్పుడ చేయలేదన్నారు. దోషులపై 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment