P RavindraNath Reddy
-
బూడిద పంచాయతీ కూడా సీఎంవోలో చర్చించే దుస్థితి: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు,ఏడు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయకుండా చవట ప్రభుత్వంలా మారిందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్ రెడ్డి. ఈ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సోషల్ మీడియా, వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వంలో బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పంచాయితీ చేయాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. సీఎం స్ధాయిలో సీఎంవోలో బూడిద పంచాయితీలు చేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు.వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీ బూడిదను కూడా కూటమి నాయకులు దోచుకుంటున్నారని, దీని పంచాయితీని సీఎం చంద్రబాబు సెటిల్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఐదారు రోజులుగా బూడిద పంచాయతీ కోసం పోలీసులంతా ఆర్టీపీపీ వద్ద కాపలా కాస్తున్నారని.. వేరే జిల్లా నుంచి దండయాత్రకు వస్తుంటే లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆరోపించారు. స్థానిక నాయకులను కూడా అదుపు చేయలేకపోతున్నారని అన్నారు.ఇదే కాదు మట్టి, ఇసుక, లిక్కర్ ఇలా ప్రతీది దోచుకోవడమే, దోచుకోవడంలో పోటీ లేకుండా ఉండేందుకు సెటిల్మెంట్లు చేస్తున్నారు, జిల్లాలోని పోలీస్ యంత్రాంగం అంతా బూడిద కాపలాకు వినియోగిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఇలా వీటిపై దృష్టిపెట్టడం ఎంతవరకు సమంజసం?. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒక్క పనీ జరగడం లేదు. ఇంత దారుణమైన పాలన ఉంటుందని ఏ ఒక్కరూ అనుకుని ఉండరు. పాలన మొత్తం నిర్వీర్యమైంది. అసలు రాష్ట్రంలో పాలన వ్యవస్థ అనేది ఉందా.రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విత్తనాలు, ఎరువులు లేక అవస్ధలు పడుతున్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని అంతా దిగువకు వదిలేస్తున్నారు. 215 టీఎంసీలకు గాను శ్రీశైలంలో 124 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. రబీకి అవసరమైన నీటిని నిల్వ చేస్తున్నారా అంటే అదీ లేదు. రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి.కేఆర్ఎంబీ వారు గుర్తించి చెబితే కానీ ఏపీ ప్రభుత్వానికి చలనం లేదు. ఏపీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానకురిసిన చందంగా మారింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోంది. దీనిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది చేతగాని ప్రభుత్వంగా మారింది, ప్రజలే బుద్దిచెప్పే రోజు త్వరలో వస్తుంది’ అని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. -
హామీలు తప్పించుకునేందుకే ‘కూటమి’ డైవర్ట్ పాలిటిక్స్: రవీంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులపై చంద్రబాబు సర్కార్ బురదచల్లడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ ఏడు నెలల కాలాన్ని గడిపేశారు. పరిపాలనలో అప్పులు తప్ప ఏమీ లేదని దుయ్యబట్టారు.‘‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలొ తొక్కారు. వీటన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. నెలకో అభూత కల్పనలు తీసుకొచ్చి అభాండాలు వేస్తున్నారు. తిరుమల లడ్డూ నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల వరకూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇంట్లో కలహాల గురించి కొన్ని రోజులు తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అదానీ ఒప్పందాలు అంటూ కొత్త కథలు అల్లుతున్నారు.విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ కృషి చేశారు. చంద్రబాబు 13 వేల కోట్లు ఇస్తే.. జగన్ 40 వేల కోట్లు డిస్కాంలకు ఇచ్చారు. చంద్రబాబు అన్నీ తాత్కాలికమైన పనులు చేస్తే.. జగన్ దూరదృష్టితో పని చేసారు. అన్నీ అమ్మేయడమా? ప్రైవేటీకరణ చేయడమా అనే రీతిలో చంద్రబాబు పని చేస్తాడు. చెప్పింది మర్చిపోవడం తప్ప చంద్రబాబుకు ఏ విజన్ లేదు. సెకీతో ఒప్పందం చేసుకుని తక్కువకే సోలార్ పవర్ తెస్తే అదానీ పేరు చెప్తున్నారు. 2021 జనవరిలో కేంద్రం ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలు రద్దు చేసింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీ తో ఒప్పందం చేసుకున్నారు.చంద్రబాబు తన హయాంలో సోలార్ పవర్ 5.50 పైసలతో 20 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నాడు. జగన్ ప్రభుత్వంలో 2.30 పైసలతో సెకీతో ఒప్పందం చేసుకున్నాం. ఎవరు ఎక్కువ ఖర్చుతో కొనుగోలు చేసారో ప్రజలు గమనించాలి. వాస్తవాలను దాచి ఆ పత్రికలు చంద్రబాబును మోసే పనిలో పడ్డారు. ప్రజలు చంద్రబాబు డ్రామాలు గమనిస్తూనే ఉన్నారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. -
చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, ఇసుక, మద్యంలో దోచేసుకుంటున్నారని మండిపడ్డారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్న ఇసుక డంప్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఖాళీ చేసిందని ఆరోపించారు. మద్యంలో టీడీపీ సిండికేట్ల వల్ల తెలంగాణా కంటే తక్కువ ఆదాయం వచ్చిందని, 90 శాతం టీడీపీఐ వారికే వచ్చాయని, మిగిలిన 10శాతం షాపులు వారిని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అక్రమాలను, అబద్ధపు హామీలను ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విజయవాడ వరదల్లో వచ్చిన విరాళాలు కూడా జేబులో వేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో, ఏమైపోతుందోననే ఆందోళన కలుగుతోందన్నారు. ప్రభుత్వ దురాగతాలు మితిమీరి పోతున్నాయని విమర్శించారు. వీళ్ళ అకృత్యాలు ప్రజలకు తెలియకుండా మీడియా గొంతు నొక్కుతున్నారని, టీవీ9, సాక్షి, ఎన్టీవీలతో పాటు మరి కొన్ని ఛానళ్లను ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.‘స్కిల్ కేసులో చంద్రబాబును ఆనాడు అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. అన్యాయంగా అరెస్టు చేశారంటూ బార్యా, పిల్లలు, దత్త పుత్రుడు అంతా గోల చేశారు. ఆనాడు ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టు జరిగింది. ఇప్పుడు ఈడీ వారి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇప్పుడు స్కిల్ అక్రమాలు చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని తేలింది. పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసేందుకు చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశాడు. షెల్ కంపెనీలతో 370 కోట్లు కొట్టేసి నిరుద్యోగులకు అన్యాయం చేశారు. సీమెన్స్ సంస్థ పేరు చెప్పుకుని.. డిజైన్ టెక్ అనే షెల్ కంపెనీ ద్వారా నిధులు కొట్టేశారు. ఆ ఫైల్ డ్రాఫ్ట్ పై అన్నీ చోట్ల చంద్రబాబు సంతకం ఉంది. జరిగిన అక్రమాలన్నీ నిజమే కాబట్టే ఈడి ఆస్తులు అటాచ్ చేసింది.’ అని పేర్కొన్నారు. -
‘కడప, రాయలసీమపై చంద్రబాబు కక్ష సాధింపు’
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారని కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపు చంద్రబాబు నైజానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి సేజ్‌కు కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపుపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆయన మాట్లాడారు.‘‘ఇది సీమ యువత అవకాశాలను దెబ్బ తీయడమే. ప్రభుత్వం జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. దానికి కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపే నిదర్శనం’’ అని అన్నారు.కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్‌ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా నిలదీశారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను తీసుకెళ్ళిపోతున్నారు. పులివెందుల మెడికల్ సీట్లు వెనక్కి పంపారు. రాయలసీమ వాడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.కేంద్రం ఇక్కడి యువతకు ఇచ్చిన టెక్నాలజీ సెంటర్‌ను తరలించడానికి చంద్రబాబు ఎవరని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర ప్రశ్నించారు. ‘‘ ఇది క్షమించరాని నేరం. ఇలాంటి చర్యలు యువత అవకాశాలను దెబ్బ తీస్తాయి. ఈ అంశంపై అఖిలపక్షంగా పోరాడతాం’ అని అన్నారు.ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను తరలించడం అంటే సీమకు అన్యాయం చేయడమేనని కడప జిల్లా సీపీఎం కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ‘‘ ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం దారుణం. నైపుణ్యాలను రాయలసీమ యువతకు అందించాల్సిన అవసరం లేదా?. ప్రభుత్వం మారగానే ఇలా చేయడం సరికాదు’ అని అన్నారు.రౌండ్ టెబుల్ సమావేశానికి కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు. -
క్లోరిన్ సరఫరాతో నాకు సంబంధం లేదు
సాక్షి, వైఎస్సార్ కడప: సోషల్ మీడియాలో టీడీపీ ఐటీ వింగ్ తనపై చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ నాయకులు ఇంగిత జ్ఞానం లేకుండా ఆరోపణలు చేయడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో క్లోరిన్ సరఫరా, ఇతర కాంట్రాక్టులతో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఏలూరు సంఘటనలో నాసిరకం క్లోరిన్ సరఫరా అంటూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్పచారం చేయడం దారుణమన్నారు. దీనిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వారికి ఫిర్యాదు చేశానని, జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ వారిక ఫిర్యాదు చేశాన్నారు. ముఖ్యమంత్రి మేనమామ కావడం వల్లే తనను టార్గెట్ చేశారన్నారు. ఎందుకంటే ఇలా అయినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెడ్డపేరు తీసుకురావలని కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్పా ఇలాంటి నీజమైన రాజకీయాఉల ఎప్పుడ చేయలేదన్నారు. దోషులపై 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
‘చంద్రబాబును చూసి ఊసరవెల్లే సిగ్గు పడుతోంది’
కమలాపురం : ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి కూడా సిగ్గు పడేవిధంగా మాటలు మారుస్తున్నారని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి సొమ్ముతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొని పార్టీలో చేర్చుకుని మరీ తెలంగాణాలో పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గపు నాయకుడు ప్రపంచంలో ఎక్కడా లేరని వ్యాక్యానించారు. గత ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలందరినీ మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యాక అందరినీ మోసం చేశాడని విమర్శించారు. కమీషన్లు ఎక్కువ వచ్చిన చోటే పనులు మాత్రమే చేశారని ధ్వజమెత్తారు. కొన్ని పేపర్లు అడ్డం పెట్టుకుని వాటి ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు చెబుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. -
సీఎం బినామీలకు జైలు తప్పదు
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బినామీలు కటకటాలపాలుగాక తప్పదని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని వైఎస్ జగన్‌కు ముడిపెట్టి మాట్లాడటం టీడీపీ వారికి ఫ్యాషనైపోయిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని ప్రచారం చేశారని, ఇప్పుడు ఐటీ దాడులు జరుగుతుంటే జగన్ కుట్ర ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రికి బినామీలు చాలా మంది ఉన్నారని, వారందరిపై ఐటీ దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1988–87 మధ్య కాలంలో సీఎం రమేష్ అబ్బ సారాయి కొట్టు నడుపుతూ హత్య కేసులో ఇరుక్కొని జలగం వెంగల్రావ్ ద్వారా బయటపడ్డారన్నారు. అనేక మందితో వ్యాపార భాగస్వామ్యం నడిపి అందరినీ మోసం చేశారన్నారు. కానుగచెట్టు నుంచి నూనె తీస్తామని, పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నామని పబ్లిక్ ఇష్యూ చేసి ప్రజల దగ్గర వందలకోట్లు వసూలు చేశారన్నారు. 2014కు ముందు రూ.50కోట్ల పనులు మాత్రమే చేసే రిత్విక్ కంపెనీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నరేళ్లలో రూ.3,550కోట్ల పనులు చేయడం ఆశ్చర్యకరమన్నారు. అత్యవసరం కింద 61సీ జీఓ తెచ్చి ప్రాజెక్టుల పనులన్నీ అంచనాలు పెంచి నామినేషన్‌పై చేశారన్నారు. జిల్లాలో గండికోట, అవుకు టన్నెల్, జీఎన్ఎస్ఎస్, ఆర్టీపీపీలో పనులన్నీ రిత్విక్ సంస్థే చేస్తోందన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి చేస్తున్న పనుల్లో ముఖ్యమంత్రికి 25 శాతం వాటా ఉందని ఆరోపించారు. సుజనా చౌదరి వేలకోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఎగ్గొట్టారని గుర్తు చేశారు. ఇన్ని అక్రమాలు చేసి ప్రభుత్వానికి ఆదాయపన్ను ఎగ్గొట్టిన వీరంతా ఏనాటికైనా కటకటలపాలు కాక తప్పదని హెచ్చరించారు. ఉక్కు దీక్ష చేసినందుకే తనపై ఐటీ దాడులు చేశారని సీఎం రమేష్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన చేసింది ఉక్కు దీక్ష కాదని, అది వంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు సంబంధమే లేదని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారని, 15వ ఆర్థిక సంఘం ఛైర్మెన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. దీన్నిబట్టి బీజేపీ, టీడీపీ హోదా ఇవ్వడం ఇష్టం లేకే డ్రామాలాడాయని ధ్వజమెత్తారు. బీజేపీతో వైఎస్ఆర్సీపీ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని, అలా అయింటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. బీజేపీపై మొదటిసారి అవిశ్వాస తీర్మాణం పెట్టి, ఎంపీలతో రాజీనామాలు చేయించి బయటికి వచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీదేననివారు తెలిపారు. బీజేపీతో టీడీపీ లోపాయికారీ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతోందని, అందుకే టీడీపీ వారు ఎన్ని అక్రమాలు చేస్తున్నా ఏమీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఐటీ దాడులతో ఏం సాధిస్తారో వేచిచూడాలని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్, యానాదయ్య, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, ఖదీర్ పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై ఐటీ దాడులు చేయాలి కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి కడప కార్పొరేషన్: లక్షల కోట్లు దిగమింగిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై ఐటీ దాడులు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత తొమ్మిదేళ్ల పాలన తర్వాత దేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు అగ్రస్థానంలో ఉన్నారని తెహల్కా డాట్ కామ్ తెలిపిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగి, మంత్రి పదవులను పంచుకున్న టీడీపీ ఇప్పుడు ఐటీ దాడులు జరిగేసరికి ఇతరులపై బురద జల్లడం సరికాదన్నారు. సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ దాడులు చేస్తే వైఎస్ జగన్‌పై బురదజల్లడం సరికాదన్నారు. బీజేపీతో తమకు అంత సాన్నిహిత్యమే ఉంటే జగన్‌పై ఉన్న ఈడీ కేసులను ఉపసంహరించేవారు కదా అని ప్రశ్నించారు. సీఎం బినామీలపై ఐటీ దాడులు చేస్తుంటే దాన్ని రాష్ట్రంపైన దాడిగా అభివర్ణించడం దారుణమన్నారు. సుజనా చౌదరి ఎన్ని వేల కోట్లు అప్పులు తీసుకొని ఎన్ని బ్యాంకులను మోసం చేశారో జగమెరిగిన సత్యమేనన్నారు. -
టీడీపీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం
కమలాపురం అర్బన్ : సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని.. ఈ పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనా«థ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి ప్రజలను మోసం చేశారన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా టీడీపీ నాయకులు ప్రజల చెంతకు చేరడానికి ప్రయత్నిస్తున్నారే తప్పా ప్రజల నుండి స్పందన లేదన్నారు. పోలీసుల వలయంలో గ్రామదర్శిని కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. సీఎం చంద్రబాబు కమీషన్ల పనులకు మాత్రం ప్రాధాన్యత ఇస్తారని ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలకు మాత్రం సున్న చుడుతారన్నారు. సీఎంకు రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. అర్హులకు పింఛన్లు ఇవ్వడంలో కూడా సీఎంమోసం చేశారన్నారు. రాష్ట్రంలో 108 సేవలను నిర్వీర్యం చేశారన్నారు. 104 వాహనాలు కూడా నామ మాత్రంగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బి.సి, సబ్ ప్లాన్లకు నిధులు కేటాయించడంలో కూడా మోసం చేశారన్నారు. గ్రామాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కేంద్ర నిధులతో పాటు ఎంపీ నిధులు ఉన్నాయన్నారు. ఎల్లో మీడియా ద్వారా అసత్యపు రాతలు, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్పా సీఎం ప్రజలకు చేసింది శూన్యమన్నారు. బాబు పాలన అంతా అవినీతిమయం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సీ.ఎస్.నారాయణరెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సుమీత్రా రాజశేఖర్‌రెడ్డి, ఎన్.సి.పుల్లారెడ్డి, మారుజొళ్ళ శ్రీనివాసరెడ్డి, మునిరెడ్డి, ఆర్‌వీఎన్‌ఆర్, మహేశ్వర్‌రెడ్డి, సుదా కొండారెడ్డి, జెట్టి నగేష్, కరిముల్లా, రవిశంకర్, రాయుడు, సుబ్బారెడ్డి, ప్రబాకర్‌రెడ్డి తదితరులు పాల్గోన్నారు. -
విలీనమే పరిష్కారం
కడప కార్పొరేషన్: వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను అత్యంత శక్తివంతంగా తయారు చేయాలని యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలోని అపూర్వ కల్యాణమండపంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. రాజారెడ్డి అధ్యక్షతన 3వ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యానికి తెలియకుండానే వేలకోట్లు విలువజేసే ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఆర్టీసీకి ఐదువేలకోట్ల అప్పు ఉందని, దానికి వడ్డీ చెల్లించలేని స్థితిలో సంస్థ నడుస్తోందని తెలిపారు. నష్టాల పేరుతో రూట్లు రద్దు చేయడం వల్ల ప్రజలు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. డ్యూటీకి వెళ్లిన కార్మికుడు ఇంటికి వచ్చేలోపు ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో అన్న సందేహం నెలకొందన్నారు. కార్మికుల సంఖ్య పూర్తిగా తగ్గించారని, ఉన్న వారిపై పనిభారం ఎక్కువైందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు, బస్టాండ్లు పెరగడం లేదన్నారు.మూడున్నర సంవత్సరాలుగా కండక్టర్లు, డ్రైవర్ల రిక్రూట్మెంట్ చేయలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ హామీని నెరవేర్చగల సత్తా ఒక్క వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్‌కు తప్ప మరే యూనియ న్కు లేదని స్పష్టం చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీకి వెన్నెముకలాంటి కండక్టర్లను ప్రభుత్వం లేకుండా చేస్తోందన్నారు. ప్రయివేటు, హైర్ బస్సులకు ఆర్టీసీని ధారాదత్తం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని ముఖ్యమంత్రిని కోరితే నష్టాల్లో ఉన్న సంస్థను విలీనం చేయాలా...అని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. అంతకుముందు వారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మహాసభలో డీసీటీఎం కిషోర్, చిత్తూరు జిల్లా నాయకుడు జయరామిరెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాసులరెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డి, బండి చెన్నయ్య, రీజనల్ ఉపాధ్యక్షులు పులి సునీల్‌కుమార్, బి. నిత్యానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేత షఫీ పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలను మెరుగుపరుస్తాం : ఎమ్మెల్యే రాచమల్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల జీవితాలను మెరుగు పరుస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై పనిభారం మోపుతూ వారి శ్రమను దోచుకుంటోందని మండిపడ్డారు. బస్సులు కండీషన్లో లేవని, బస్టాండ్లలో సరైన సౌకర్యాలు కరువయ్యాయన్నారు. కార్మికులు చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేస్తున్నారని, ఇది న్యాయం కాదని అన్నారు. భవిష్యత్ వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్‌దే : ఎమ్మెల్యే అంజద్‌బాషా భవిష్యత్తు వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌దేనని కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్‌బాషా అన్నారు. 2004కు ముందు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా దివాళా తీయించిందని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి జవసత్వాలు నింపారని తెలిపారు. నేటి ప్రభుత్వం కార్మికుల సంఖ్యను తగ్గించి, వారితో 16 గంటలు పనిచేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. కార్మికుల సమస్యలను సంఘటితంగా ఎదుర్కొవాలని, అందుకు మీతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. -
కలెక్టర్ గైర్హాజరు: నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
కడప: వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వ్యాఖ్యాలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన మంగళవారం కడప జడ్పీ సమావేశంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో జడ్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరుకాలేదు. దీంతో జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు... కలెక్టర్ కె.వి.రమణ ఎందుకు ఈ సమావేశానికి హజరుకాలేదంటూ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులను నిలదీశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉండి కలెక్టర్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం సరైనది కాదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. పోలీసులు, అధికారులు జిల్లాకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అడుగడుగునా అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఆర్ఎఫ్ నిధుల విషయంలో కలెక్టర్ సమాధానం చెప్పాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలు కడప రావాలంటే భయపడుతున్నారని జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ అంశం కడప జిల్లా వాసుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు. -
నాకు సంబంధం ఉందని నిరూపించు!
జూబ్లీహిల్స్‌లో భవనంపై బాబుకు పి.రవీంద్రనాథ్‌రెడ్డి సవాల్ ఆరోపణలు చేస్తున్న నీరజారావుకు త్వరలో టీడీపీ టికెట్! కడప, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 2లో జీహెచ్ఎంసీ కూల్చిన భవనానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని కడప మాజీ మేయర్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తనకు సంబంధముందని మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. దీనిపై ఏ వేదికపై అయినా సరే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తనది తప్పయితే చంద్రబాబు కాళ్లు పట్టుకుంటానని, లేదంటే ఆయన తన కాళ్లు పట్టుకోవాలని సవాల్ విసిరారు. మంగళవారం వైఎస్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురం రైలు ప్రమాదంలో 26 మంది చనిపోయి అనేకమంది గాయాల పాలైతే పరామర్శించడానికి సమయం లేని చంద్రబాబుకు 420 గజాల స్థల వివాదంపై పరిశీలనకు వెళ్లడానికి మాత్రం టైమ్ ఉందా అంటూ ఎద్దేవా చేశారు. అందుకే నీరజారావు ఆరోపణలు.. కొన్ని పత్రికలు, చానెళ్లతో కుమ్మక్కై చంద్రబాబు డ్రామా ఆడిస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. భూమి విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న నీరజారావు ఎవరా అని విచారిస్తే ఆమె టీవీ9 చానల్లో మహారాష్ట్ర వింగ్ చూస్తున్నారని, గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేశారని తెలిసిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఆమెకు టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదచల్లడానికి తనను పావుగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన హయాంలో జరిగిన కుంభకోణాలు, ఆయన ఆస్తుల వివరాలను బయట పెట్టాలన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో 1600 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ అని ట్రిబ్యునల్ తీర్పునిస్తే చంద్రబాబుకు అది ఎందుకు కనిపించదని ప్రశ్నించారు.