
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో కొన్నింటిని రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా పరిగణిస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనయినా పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకు మించి అభ్యర్థులపై ›క్రిమినల్ కేసులు ఉంటే ఆ నియోజకవర్గాన్ని రెడ్ అలర్ట్ నియోజకవర్గంగా గుర్తిస్తారు.పోలింగు సమయంలో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు.ఆరో దశ కింద మే 12న పోలింగు జరిగే 59 నియోజకవర్గాల్లో 34 నియోజకవర్గాలు రెడ్ అలర్డ్ నియోజకవర్గాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) పేర్కొంది.
కాగా, ఆరో దశలో పోటీ చేస్తున్న మొత్తం 967 మందిలో 20శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్ధుల్లో 48శాతం, కాంగ్రెస్ అభ్యర్ధుల్లో 44శాతం నేర చరితులున్నారు. ఆరో దశలో బీజేపీ తరఫున మొత్తం 54 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 26 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అలాగే, కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న 46 మందిలో 20 మందిపై కేసులున్నాయి.బీఎస్పీ అభ్యర్థులు 49 మందిలో 19 మంది,307 ఇండిపెండెంట్లలో 34 మందిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి.
మొత్తం 967 మందిలో 146 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో నలుగురిని కోర్టు దోషులుగా ప్రకటించింది. ఆరుగురిపై హత్య కేసులున్నాయి.25 మందిపై హత్యాయత్నం కేసులు పెండింగులో ఉన్నాయి.21 మందిపై మహిళలపై అకృత్యాల కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment