కౌన్ బనేహై కరోడ్ పతి?
పార్టీలు ఏవైనా ఈసారి మాత్రం మన రాష్ట్రంలో పోటీ చేస్తున్న రాజకీయ అభ్యర్ధుల ఆస్తులు మాత్రం 5 రెట్లు పెరిగాయి. ఒకరు కారు, ఇద్దరు కారు.... ఏకంగా 74 మంది కోటీశ్వర్లు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ జారీ చేసిన వివరాల ప్రకారం మన రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న మొత్తం 265 మంది రాజకీయ నాయకుల్లో 74 మంది నాయకులు కోటీశ్వరులు. అంతేకాదు, రాజకీయ నాయకుల సంపద ఏ ఏడాదికాఏడాది భారీగా పెరుగుతోంది. కోటీశ్వరులైన రాజకీయ నాయకుల సంఖ్య 2009 తో పోలిస్తే 20 శాతం నుంచి 28శాతంకు పెరిగింది. 2009లో కోటీశ్వరులుగా ఉన్న రాజకీయ నాయకులు సగటు ఆస్తులు 2.50 కోట్లుగా ఉంటే ఇపుడు అవి 8.49 కోట్లకు పెరిగాయని ఏడీఆర్ తెలిపింది.
రాష్ట్రంలో ఎక్కువ మంది కోటీశ్వరులు టిడిపి లోనే ఉన్నారు. టీడీపీలో పోటీ చేస్తున్న 89 శాతం మంది కోటీశ్వరులే . ఇక రెండో స్ధానంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులున్నారు. టీఆర్ ఎస్ తరఫున పోటీ దారుల్లో 82 శాతం మంది కోటీశ్వరులే . ఆ తరువాత స్ధానంలో 81శాతం కోటీశ్వరులు కాంగ్రెస్ లో ఉన్నారు. చివరకు కామన్ మ్యాన్ పోటీ చేస్తారని చెపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ లోనూ 50 శాతం మంది పోటీదారులు కోటికి మించి ఆదాయం ఉన్నవారే కావడం విశేషం.
ఇక క్యాండెట్ల వారిగా పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొండావిశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలోక్ సభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ 528 కోట్లు. రెండో స్థానంలో టిడిపికి చెందిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 338 కోట్లు . ఇక మూడో రిచెస్ట్ అభ్యర్ధి కాంగ్రెస్ కి చెందిన జి వివేక్. ఆయన పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ 266కోట్లు.
వివిధ పార్టీలకు చెందిన దాదాపుగా ఆరుగురు అభ్యర్ధుల ఆస్తుల విలువ వందేసి కోట్లు.
తక్కువ ఆస్తులు ఉన్న పార్టీలలో 13 మంది వైఎస్సార్ సిపికి చెందిన వారు. వారి సరాసరి ఆస్తుల విలువ 4.29 కోట్లు. కాగా ఎనిమిది మంది బిజెపి అభ్యర్ధుల విలువ సరాసరిన 29.73 కోట్లు. ఇక ఆఫిడవిట్ సమర్పించిన వారిలో ఆన్‌కంటాక్స్ వివరాలు ప్రకటించని వారిశాతం 51కాగా 23శాతం మంది ప్యాన్ కార్డ్ వివరాలు అందించలేదు.