ADR
-
Association of Democratic Reforms: ఈ వ్యత్యాసాలు ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఎందుకుందో చెప్పాలని భారత ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) గురువారం డిమాండ్ చేసింది. ఓట్లలో వ్యత్యాసానికి కారణాలను వివరించాలని కోరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని ఏడీఆర్ సోమవారం తమ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించారని తెలిపింది. మరో 176 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకంటే 35,093 ఓట్లను అదనంగా లెక్కించారని పేర్కొంది. ఏడీఆర్ సోమవారం నివేదిక వెలువరించినప్పటికీ ఈసీ ఇప్పటిదాకా ఓట్లలో వ్యత్యాసంపై స్పందించలేదు. ఏపీలోనే అత్యధికం పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉంది. ఏపీలో 21 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం పోలైన ఓట్ల కంటే 85,777 ఓట్లను తక్కువగా లెక్కించారు. అలాగే మరో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 3,722 ఓట్లను అధికంగా లెక్కించారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఓట్లలో తేడా ఎలా వచి్చందో చెప్పాలని.. ఏడీఆర్ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధూలకు లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ వ్యత్యాసాలపై ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రజా విశ్వాసం సడలకుండా చూడాలని కోరింది. -
ఎన్నికల సంఘానికి ఊరట.. అలా ఆదేశించలేమన్న సుప్రీం
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఊరట లభించింది. ఓటర్ ఓటింగ్ డేటా విడుదల విషయంలో దాఖలైన పిటిషన్ల విచారణను ఎన్నికలు ముగిసేవరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఐదు దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది.అయితే.. పిటిషన్‌ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అలా ప్రచురించేందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ అంశంపై సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.ప్రతి దశలో పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా బూత్‌ల వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కోరుతూ ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’(అఈఖ) సుప్రీం కోర్టులో ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. అయి దీనిపై 2019లోనే ఓ పిటిషన్‌ను దాఖలు అయ్యింది. అయితే తాజాగా వేసిన మధ్యంతర పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం.. వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని మే 17నే ఈసీని ఆదేశించింది.అయితే.. పిటిషన్‌దారు చేసిన డిమాండును వ్యతిరేకించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అలా సమాచారం ప్రచురిస్తే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని, యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని వివరణ ఇచ్చింది. మరోవైపు ఇదే అంశంపై 2019లోనూ టీఎంసీ నేత మహువా మోయిత్రా వేసిన పిటిషన్‌ను ఏడీఆర్ పిటిషన్‌తో జతపర్చి విచారణ జరపనుంది సర్వోన్నత న్యాయస్థానం. I was original petitioner in Supreme Court in 2019 itself via WPC 1389/2019 asking EC to publish within 48 hrs of polling all voter data of Form 17C. Case is listed on May 24 for hearing.@AITCofficial @MamataOfficial pic.twitter.com/F1aqS9nK4R— Mahua Moitra (@MahuaMoitra) May 20, 2024 -
ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ, సాక్షి: ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం ఆ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని, వీపీప్యాట్ స్లిప్‌లను ఓటర్లకు అందించాలని, ఆ తరవాత వాటిని 100శాతం లెక్కించాలంటూ పలువురు పిటిషన్లు వేశారు. అయితే ఈ విజ్ఞప్తితో పాటుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్(ADR) పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లను అన్నింటిని కలిపి మూడు రోజులపాటు విచారణ జరిపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్. చివరకు.. పిటిషన్లు కొట్టేస్తూ ఏకాభిప్రాయంతో కూడిన తీర్పు ఇచ్చింది. ‘‘వీవీప్యాట్లు వందశాతం సరిపోల్చాలని వచ్చిన పిటిషన్లు సరికాదు.వ్యవస్థలో సమతుల్య దృక్పథం ముఖ్యమే. కానీ, ఆ వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సంశయవాదాన్ని పెంపొందిస్తుంది. అందుకే.. అర్థవంతమైన విమర్శలు అవసరం. అది న్యాయవ్యవస్థ అయినాసరే చట్ట సభలు అయినాసరే. ప్రజాస్వామ్యం అంటేనే అన్నింటా సామరస్యం పాటిస్తూ నమ్మకాన్ని కొనసాగించడం. విశ్వాసం, పరస్సర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చు. అనుమానాలతో ఈవిఎంలను గుడ్డిగా వ్యతిరేకించొద్దు’’ అని జస్టిస్ దత్తా తీర్పు ద్వారా వెల్లడించారు.ఈ సందర్భంగా ఈసీకి రెండు కీలక సూచనలు చేసింది సుప్రీంకోర్టు 1. సింబల్ లోడింగ్ యూనిట్ ను సీల్ చేయాలి . అభ్యర్థులు వారి ప్రతినిధులు సంతకాలు దానిపై చేయాలి . ఈ యూనిట్ ను ఫలితాలు వెలువడిన 45 రోజుల వరకు భద్రంగా ఉంచాలి2. ఫలితాలు వెలువడిన ఏడు రోజుల్లో రెండు మూడో స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తే ఈవీఎంల వెరిఫికేషన్‌కు అవకాశం ఇవ్వాలి. ఇంజనీర్ల ద్వారా ఐదు శాతం ఈవీఎంలను తనిఖీ చేయాలి. దీనికోసం అయ్యే ఖర్చును అభ్యర్థి భరించాలి. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని తేలితే ఖర్చు వెనక్కి ఇవ్వాలి. వెరిఫికేషన్ సమయంలో పోటీ చేసిన అభ్యర్థులందరూ చూసే అవకాశం ఇవ్వాలి.వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్‌ను ఏర్పాటుచేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది. రెండ్రోజుల వాదనలు ఇలా.. ఏడీఆర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలి. లేదంటే వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్ల చేతికి ఇవ్వాలి. అదీ కుదరకుంటే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్ బ్యాక్సుల్లో వేసేలా రూపొందించాలి అని వాదించారాయన.అయితే.. రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని పిటిషనర్‌కు సూచించింది. జర్మనీలాంటి దేశాల్లో పశ్చిమ బెంగాల్ కన్నా తక్కువ జనాభా ఉందని, మన దేశంలో వంద కోట్ల మంది ఓటర్లున్నారని, అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మీరు(పిటిషనర్) కోరుతున్నారని, బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇక ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని, అయితే మానవతప్పిదాలను మాత్రం తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పును ఏప్రిల్ 24వ తేదీ నాటికి సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. అయితే..తీర్పు ఇవ్వకుండా ట్విస్ట్అయితే ఏప్రిల్ 24వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించలేదు. ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టత కోరింది. ఈక్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది. కంట్రోలింగ్ యూనిట్‌లోనా లేదా వీవీప్యాట్‌లోనా? అని ప్రశ్నించింది. మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా, కాదా? అన్నది నిర్ధారించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. మీ (పిటిషనర్ల) ఆలోచనా ధోరణిని మేం మార్చలేం. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేం. ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ. దాని పనితీరును మేం నిర్దేశించలేం. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం’’ అని స్పష్టం చేసింది.ఈ విచారణ సందర్భంగా ఈవీఎమ్ సోర్స్ కోడ్‌కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరారు. దీన్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘సోర్స్ కోడ్‌ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది’’ అని వ్యాఖ్యానించింది. ఇక ఈ ఉదయం(ఏప్రిల్ 26) అన్ని పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.వీవీప్యాట్ ఎందుకు?ఓటర్ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) తీసుకొచ్చింది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ తర్వాత దఫ దఫాలుగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తూ వచ్చింది. -
వీవీప్యాట్ల తీర్పు ముందర ట్విస్ట్
న్యూఢిల్లీ, సాక్షి: ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్(Voter-Verifiable Paper Audit Trail) స్లిప్‌లతో సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే తీర్పు ముందర ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి నాలుగు ప్రశ్నలు సంధించిన ద్విసభ్య ధర్మాసనం.. వాటికి సమాధానాలతో రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై రెండ్రోజులపాటు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో ఎక్కువ భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం వాదనల వైపే బెంచ్ తన అభిప్రాయాల ద్వారా మొగ్గుచూపించినట్లు అనిపించింది. అయితే ఇవాళ తీర్పు వెల్లడించడానికి కొన్ని గంటల ముందు ఈసీకి ప్రశ్నలు సంధించింది.మైక్రోకంట్రోలర్‌ను వీవీప్యాట్‌లో లేదంటే కంట్రోలింగ్ యూనిట్లో ఇన్స్టాల్ చేశారా?మైక్రోకంట్రోలర్ ఒక్కసారి మాత్రమే పని చేస్తుందా?సింబల్ లోడింగ్ యూనిట్లు.. ఎన్నికల సంఘం వద్ద ఎన్ని అందుబాటులో ఉన్నాయి?మీరు(ఈసీ) చెప్పిందాన్ని బట్టి ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడానికి పరిమితి 30 రోజులు. నిల్వ, రికార్డులు మాత్రం 45 రోజులు నిర్వహించబడతాయి. కానీ పరిమితి రోజు 45 రోజులా? మీరు దాన్ని సరిచేయాల్సి ఉంది.వీటికి మేం క్లారిటీ కావాలని కోరుతున్నాం. వీటికి సమాధానాలతో ఈసీ ఆఫీసర్ మధ్యాహ్నాం మా ముందుకు రావాలి అని కోర్టు బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది. వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్‌ను ఏర్పాటుచేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని ADR(అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్) దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.విచారణ సందర్భంగా.. ఏడీఆర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలి. లేదంటే వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్ల చేతికి ఇవ్వాలి. అదీ కుదరకుంటే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్ బ్యాక్సుల్లో వేసేలా రూపొందించాలి అని వాదించారాయన.అయితే.. రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని పిటిషనర్‌కు సూచించింది. జర్మనీలాంటి దేశాల్లో పశ్చిమ బెంగాల్ కన్నా తక్కువ జనాభా ఉందని, మన దేశంలో వంద కోట్ల మంది ఓటర్లున్నారని, అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మీరు(పిటిషనర్) కోరుతున్నారని, బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదీ చదవండి: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని, అయితే మానవతప్పిదాలను మాత్రం తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఇక విచారణ సందర్భంగా ఓటింగ్, ఈవీఎంలను భద్రపర్చడం, కౌటింగ్ ప్రక్రియ గురించి ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆరా తీసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినవారికి కఠిన శిక్ష లేకపోవడంపై ధర్మాసనం పెదవి విరిచింది. మరోవైపు.. రెండ్రోజుల విచారణ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ఓ అధికారి ద్వారా ఈవీఎంల పని తీరును ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించడం గమనార్హం.వీవీప్యాట్ ఎందుకు?ఓటర్ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) తీసుకొచ్చింది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. -
జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్లు.. ఎవరిచ్చారో అస్సలు తెలియదు!
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలు 2004 నుంచి 2021 వరకు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి సుమారు రూ.15,077.97 కోట్లు విరాళాలు అందుకున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్-ఏడీఆర్ నివేదిక తెలిపింది. అయితే.. ఒక్క 2020-21 ఆర్థిక ఏడాదిలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలు గుర్తు తెలియని వారి నుంచి రూ.690.67 కోట్లు విరాళంగా స్వీకరించినట్లు పేర్కొంది. ఈ నివేదికలో.. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ వంటి ఎనిమిది జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకుని వివరాలు వెల్లడించింది ఏడీఆర్. 2004-05 నుంచి 2020-21 వరకు ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన విరాళాలు, ఆదాయపన్ను రిటర్న్‌ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఏడీఆర్. ఎలాంటి వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి జాతీయ పార్టీలు సుమారు రూ.15,077.97 కోట్లు విరాళంగా అందుకున్నట్లు స్పష్టం చేసింది. ‘2020-21 ఆర్థిక ఏడాదిలో 8 జాతీయ పార్టీలు గుర్తుతెలియని వారి నుంచి రూ.426.74 కోట్లు అందుకోగా.. 27 ప్రాంతీయ పార్టీలు రూ.263.928 కోట్లు విరాళంగా పొందాయి.’అని తెలిపింది ఏడీఆర్. తొలిస్థానంలో కాంగ్రెస్.. 2020-21లో కాంగ్రెస్ పార్టీ రూ.178.782 కోట్లు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి పొందిందని, అది మొత్తం జాతీయ పార్టీలు పొందిన దాంట్లో 41.89 శాతమని తెలిపింది ఏడీఆర్. ఇదే అత్యధికమని పేర్కొంది. మరోవైపు.. బీజేపీకి రూ.100.502 కోట్లు అందాయి. అది మొత్తం వివరాలు లేని వారి నుంచి అందిన దాంట్లో 23.55 శాతంగా తెలిపింది. మరోవైపు.. వివరాలు లేని సోర్స్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో విరాళాలు అందుకున్న మొదటి ఐదు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.96.2507 కోట్లు, డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఎంఎన్ఎస్ రూ.5.773 కోట్లు, ఆప్ రూ.5.4కోట్లుగా నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: Cartoon Today: రాజకీయ పార్టీలకు కోవిడ్ దెబ్బ.. 41 శాతం తగ్గిన విరాళాలు -
మధ్యవర్తిత్వంతో న్యాయవ్యవస్థలో మార్పులు
కెవాడియా (గుజరాత్): మధ్యవర్తిత్వంతో పాటు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్) యంత్రాంగాన్ని అమలు చేస్తే భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఉండే కొన్ని చిక్కుముళ్ల వల్ల దీనికి విస్తృత స్థాయిలో ఆమోదం ఉండాలన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా కోర్టు కేసుల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర టెంట్ సిటీలో మధ్యవర్తిత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో రాష్ట్రపతి కోవింద్, సీజేఐ జస్టిస్ రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
జియో ఏజీఆర్ బకాయిలు చెల్లింపు
సాక్షి,న్యూఢిల్లీ : ఏజీఆర్‌పై వివాదం కొనసాగుతుండగానే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రభుత్వానికి తన బకాయిలను మొత్తం చెల్లించింది. జనవరి 31, 2020 వరకు చట్టబద్ధంగా టెలికాం విభాగానికి రూ.195 కోట్ల బకాయలను చెల్లించింది. తద్వారా ఈ ఏజీఆర్ బాకీ చెల్లింపుల విషయంలో జియో ముందు నిలిచింది. సుప్రీంకోర్టు విధించిన గడువు (2020 జనవరి 23 వ తేదీ) లోగా బకాయిలు తీర్చిన ఏకైక టెలికం సంస్థగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో నిలిచింది. టెలికాం విభాగానికి (డిఓటి) జియో రూ. 195 కోట్లు చెల్లించిందని గురువారం పిటిఐ నివేదించింది. మరోవైపు ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, తదుపరి విచారణ వరకు గడువును పొడిగించాల్సిందిగా వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వాన్ని కోరాయి. వొడాఫోన్ ఐడియా రూ. 53,038 కోట్లు, ఎయిర్టెల్ సుమారు రూ. 36 వేలకోట్లను చెల్లించాల్సి వుంది. కాగా సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జనవరి 23ను గడువుగా నిర్ణయించింది. అక్టోబర్ 24, 2019 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెల్లింపులు చేయాలని, నిర్ణీత కాలపరిమితిలో అవసరమైన పత్రాలను సమర్పించాలని ప్రభుత్వం టెల్కోలకు ఆదేశించింది. అయితే గడువులోపు బకాయిల చెల్లించలేమని గడువును పొడిగించాలని టెలికాం సంస్థలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి వోడాఫోన్ఐడియా, ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్ సంస్థలుదాఖలు చేసిన మోడిఫికేషన్ను పిటిషన్‌నుసుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. దీంతో రానున్న వారంలో సుప్రీంకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో ఏడీఆర్ బకాయిలు చెల్లించని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డాట్ తన అధికారులను కోరింది. -
‘ఎలక్టోరల్ బాండ్స్’పై స్టే ఇవ్వం: సుప్రీం
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులను అందించే ‘ఎలక్టోరల్ బాండ్స్’ పథకంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. 2018లో ప్రారంభమైన ఈ పథకంపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర స్టే విధించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) అనే స్వచ్చంధ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం విచారణ జరిపింది. స్టే విధించేందుకు నిరాకరించిన ధర్మాసనం రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నల్లధనాన్ని అధికార పార్టీకి అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతోందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకం మరింత దుర్వినియోగమయ్యే అవకాశముందని ఏడీఆర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకాన్ని అన్యాయంగా పునఃప్రారంభించారని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల కోసం 10 రోజుల పాటు బాండ్స్ అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
2019 ఎన్నికల అంకెల్లో అవకతవకలు
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాల్సిందిగా శుక్రవారం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. దాదాపు 347 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యకు, పోలైన ఓట్లకు మధ్య తేడాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరపాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్), కామన్ కాజ్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును కోరాయి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాంటి తేడాలు రాకుండా ఓ పటిష్టమైన పద్ధతి రూపకల్పనకు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని వీరు నివేదించారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే ముందుగా అంకెలను స్పష్టంగా లెక్కకట్టాలని కోరింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పత్రాలు 17సీ, 20, 21సీ, 21డీ, 21ఈల సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాని ఏడీఆర్ కోరింది. దేశవ్యాప్తంగా ఎన్నికల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు పిటిషన్ వేసుకునేందుకు అవకాశముండగా, ఫలితాల కచ్చితత్వం, అంకెల్లోని తేడాల కారణంగా వచ్చే అనుమానాలను తీర్చేందుకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఏడీఆర్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. -
ధనిక బాబులు
-
ఆ పార్టీల ఆస్తులు ఎలా పెరిగాయంటే..
సాక్షి,న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం రాజకీయ పార్టీల ఆస్తులపై ఏమాత్రం పడలేదు. ఆయా పార్టీలు వెల్లడిస్తున్న ఆస్తుల చిట్టా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. 2004-05లో బీజేపీ ప్రకటించిన ఆస్తులు రూ 122.93 కోట్లు కాగా 2015-16 నాటికి అవి రూ 893.88 కోట్లకు పెరిగాయి. కాంగ్రెస్ వెల్లడించిన ఆస్తులు రూ 167.35 కోట్ల నుంచి రూ 758.79 కోట్లకు చేరాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎలెక్షన్ వాచ్‌లు తెలిపాయి. పదకొండేళ్ల వ్యవధిలో తృణమూల్ కాంగ్రెస్ ఆస్తుల విలువ రూ 25 లక్షల ఏనుంచి ఏకంగా రూ 44.99 కోట్లకు ఎగబాకడం గమనార్హం. ఇక బీఎస్పీ ఆస్తులు సైతం భారీగా ఎగిశాయి. ఈ పార్టీ ఆస్తుల విలువ పదకొండేళ్లలో రూ 43 కోట్ల నుంచి రూ 559 కోట్లకు పెరిగింది. ఎన్నికల కమిషన్‌కు ఆయా పార్టీలు వెల్లడించిన డిక్లరేషన్ల ఆధారంగా వాటి ఆస్తుల విలువను ఈ సంస్థలు విశ్లేషించాయి.ఇదే కాలంలో సీపీఐ(ఎం) మొత్తం ఆస్తుల విలువ దాదాపు నాలుగు రెట్లు పైగా పెరిగింది. సీపీఐ(ఎం) ఆస్తుల విలువ రూయ 90.55 కోట్ల నుంచి రూ 437.78 కోట్లకు చేరిందని ఏడీఆర్ జాతీయ సమన్వయకర్త అనిల్ వర్మ చెప్పారు. ఆస్తుల విలువ పెరుగుదల తక్కువగా నమోదైన రాజకీయ పార్టీల్లో సీపీఐ ముందువరసులో ఉంది. ఈ వ్యవధిలో సీపీఐ ఆస్తులు రూ 5.56 కోట్ల నుంచి రూ 10.18 కోట్లకు పెరిగాయని వర్మ పేర్కొన్నారు. ఈసీకి సమర్పించిన డిక్లరేషన్ల ఆధారంగా ప్రస్తుతం రూ 868 కోట్లతో బీజేపీ, రూ 557 కోట్లతో బీఎస్పీ, రూ 432 కోట్లతో సీపీఐ(ఎం) ఆస్తుల విలువలో టాప్ 3 పార్టీలుగా నిలిచాయి. -
వేధింపుల్లో ఘనులు!
మహిళలపై వేధింపుల కేసుల్లో ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు ♦ దేశవ్యాప్తంగా నాలుగో స్థానం.. ఏడీఆర్ స్వచ్ఛంద సంస్థ నివేదికలో వెల్లడి ♦ అత్యాచార యత్నం కేసులో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ♦ మహిళలపై వేధింపుల్లో ఏపీ మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడు.. ♦ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా.. ♦ ఈ జాబితాలో బీజేపీ టాప్.. టీడీపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపుల కేసుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా, మరో ఎమ్మెల్యే అత్యాచార యత్నం చేసినట్లుగా కేసులున్నాయని ఢిల్లీకి చెందిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి.. వారిలో మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసులున్న వారి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఆ జాబితాలో పార్టీల వారీగా తెలుగుదేశం పార్టీ నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పరిశీలించి.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచినవారు ఎన్నికల్లో పోటీ సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్ సంస్థ సేకరించి.. పరిశీలించింది. దేశవ్యాప్తంగా 774 మంది ఎంపీలు, 4,078 మంది ఎమ్మెల్యేల వివరాలను విశ్లేషించి.. ‘క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ (మహిళలపై వేధింపులు)’ కేసులున్న వారి వివరాలతో నివేదిక రూపొందించింది. మొత్తంగా 51 మంది ప్రజాప్రతినిధులు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా కేసులున్నాయని.. అందులో 48 మంది ఎమ్మెల్యేలుకాగా, ముగ్గురు ఎంపీలని తెలిపింది. వీరితోపాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీల నుంచి పోటీచేసి ఓడిపోయిన 334 మంది అభ్యర్థులపైనా ఈ తరహా కేసులున్నట్లు తేల్చింది. ఈ జాబితాలో ఉన్న 48 ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధినేతగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఉన్నారు. మొత్తంగా చూస్తే... 14 మందితో నేరారోపితులతో బీజేపీ తొలిస్థానంలో, ఏడుగురు ఎమ్మెల్యేలతో ఎస్హెచ్ఎస్ (శివసేన)రెండో స్థానంలో, ఆరుగురితో ఏఐటీసీ (తృణమూల్ కాంగ్రెస్) మూడో స్థానంలో ఉన్నాయి. ఐదుగురు ఎమ్మెల్యేలపై కేసులతో టీడీపీ నాలుగో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, బీజేడీ, జేఎంఎం, డీఎంకే, సీపీఎం ఉన్నాయి. ఏడీఆర్ వెల్లడించిన జాబితా ప్రకారం.. మహిళలను వేధించిన కేసుల్లో ఏపీ సీనియర్ మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర్రావు, మరో సీనియర్ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఇక ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై అత్యాచారయత్నం కేసు ఉంది. ఈయనపై 376 ఐపీసీతో పాటు 506, 511, 379, 366, 324 సెక్షన్ల కింద మహిళలపై వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలపై మహిళా వేధింపుల కేసులే కాకుండా మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని తెలిపింది. విప్ చింతమనేని ప్రభాకర్‌పై అత్యధికంగా 20 కేసులున్నట్టు పేర్కొంది. ఇటీవల ఎత్తేసిన కేసుల్లో ఇవి కూడానా? ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ జీవోలు జారీచేసింది. హత్యలు, దోపిడీ కేసులు, మహిళలపై వేధింపులకు పాల్పడ్డ కేసులు, ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలకు సంబంధించిన అనేక కేసులు ఈ ఉపసంహరణ జాబితాలో ఉన్నాయి. వాటిల్లో ఎమ్మెల్యేలపై కేసులు కూడా ఉన్నాయా అన్న సందేహం తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులై ఉండి.. తప్పుడు చేష్టలకు పాల్పడినవారిపై కేసులను ఎత్తివేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కొత్త ‘ఫిరాయింపు’ సిద్ధాంతం
కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఆందోళన న్యూఢిల్లీ: అధికార పార్టీలోకి ఫిరాయిస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయనే, నేరాలన్నీ సమసిపోతాయనే భావన పెరిగిపోతోందని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వ్యాఖ్యానించారు. ‘అధికార పార్టీలోకి ఫిరాయిస్తే తాను చేసిన నేరాలతో పాటు అన్ని అపరాధాలు తొలగిపోతాయనే భావనలో ఉన్నారు. ఈ తరహా కొత్త రాజకీయ విధానం బాగా విస్తరిస్తోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల సభ్యులను తమవైపు తిప్పుకోవడం, డబ్బులు వెదజల్లి ఆకర్షించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి బెదిరించడం మొదలైనవి తెలివైన రాజకీయ నిర్వహణగా చెప్పుకోవడం పరిపాటిగా మారిందన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, మీడియా, ప్రజా సంఘాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వల్ల ఎన్నికల వ్యవస్థలోకి నల్లధనం ప్రవేశించే అవకాశం ఉందన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఎన్నికలు, రాజకీయ సంస్కరణలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన సదస్సులో రావత్ ప్రసంగించారు. ప్రైవేటు పీఆర్ సంస్థలు డబ్బులు తీసుకుని సోషల్ మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు చురుకుగా పనిచేస్తున్నాయి. దీనిపై ఈసీ దృష్టికి సారించింది. సోషల్ మీడియా పాలసీని రూపొందిస్తోంది’ అని రావత్ వెల్లడించారు. -
బీజేపీకి 705 కోట్లు.. కాంగ్రెస్‌కు 198 కోట్లు
గత నాలుగేళ్లలో కార్పొరేట్ కంపెనీల విరాళాలు న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో బీజేపీ పార్టీకే అత్యధికంగా కార్పొరేట్ కంపెనీల విరాళాలు అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. దేశంలోని జాతీయ పార్టీలకు నాలుగేళ్లలో రూ. 956.77 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలు విరాళాలుగా ఇవ్వగా.. ఇందులో అత్యధికంగా 73 శాతం (రూ. 705.81 కోట్లు) నిధులు బీజేపీకే అందాయని పేర్కొంది. 2012–13 నుంచి 2015–16 వరకు ఈ మొత్తం ఆయా పార్టీలకు చేరినట్లు తెలిపిన ఏడీఆర్.. బీజేపీకి 2,987 కార్పొరేట్ సంస్థల నుంచి ఈ మొత్తం అందిందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 167 సంస్థల నుంచి రూ. 198.16 కోట్లు అందినట్లు.. ఎన్నికల సంఘం అందించిన వివరాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఎన్సీపీకి రూ. 50.73 కోట్లు, సీపీఎంకు రూ.1.89కోట్లు, సీపీఐకి రూ. 18 లక్షలు విరాళాలుగా అందాయి. 1,546 మంది దాతల నుంచి జాతీయ పార్టీలకు వచ్చిన 355.08 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరు విరాళాలు ఇచ్చారనే వివరాల్లేవు. ఇలాంటి వాటిలో బీజేపీకి వచ్చిన వాటిలో రూ. 159.59 కోట్ల విరాళాల్లో 99 శాతం నిధులకు పాన్ నంబర్లు, చిరునామాలు వెల్లడించలేదని ఏడీఆర్ తెలిపింది. ఏ ఒక్కరి నుంచి కూడా రూ. 20వేల కన్నా ఎక్కువ మొత్తం స్వచ్ఛంద విరాళంగా అందనందున బీఎస్పీని ఈ జాబితాలో చేర్చలేదని ఏడీఆర్ తెలిపింది. ‘గత నాలుగేళ్లలో ఐదు జాతీయ పార్టీలకు రూ.1,070.68 కోట్ల విరాళం అందింది. ఇందులో రూ. 956.77 కోట్లు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిందే’ అని సంస్థ పేర్కొంది. 2004–05 నుంచి 2011–12 వరకు (ఎనిమిదేళ్లలో) జాతీయ పార్టీలకు రూ. 378.89 కోట్ల విరాళం అందిందని ఏడీఆర్ గుర్తుచేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి రూ.20వేల కన్నా ఎక్కువగా చేసే విరాళాల వివరాలు ప్రకటించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఆయా పార్టీలు తమ దాతల వివరాలను, అందిన మొత్తాన్ని ఈసీకి అందజేశాయి. 2014–15 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీలకు కార్పొరేట్ ఫండింగ్ పెద్దమొత్తంలో జరిగిందని కూడా ఏడీఆర్ వెల్లడించింది. ఆ సమయంలోనే బీజేపీకి ఎక్కువ విరాళాలు అందాయని పేర్కొంది. -
189 మంది కోటీశ్వరులు.. 116 మంది నేరస్తులు
యూపీ నాలుగోదశ ఎన్నికల్లో పోటీ న్యూఢిల్లీ: ఫిబ్రవరి 23న జరగనున్న యూపీ నాలుగోదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 189 మంది కోటీశ్వరులు, 116 మంది నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఎన్నికల పర్యవేక్షణ, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) మొత్తం 680 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించింది. వీరిలో బీజేపీ అభ్యర్థులు 36 మంది, బీఎస్పీ అభ్యర్థులు 45 మంది, ఎస్పీ అభ్యర్థులు 26 మంది, కాంగ్రెస్ అభ్యర్థులు 17 మంది, ఆర్ఎల్డీ అభ్యర్థులు ఆరుగురు, 25 మంది స్వతంత్ర అభ్యర్థులు కోటీశ్వరులని తెలిపింది. స్వతంత్ర అభ్యర్థి సుభాష్ చంద్ర(రూ.70 కోట్లు), బీజేపీ అభ్యర్థి నంద్ గోపాల్ గుప్తా నంది(రూ.57 కోట్లు), బీఎస్పీ అభ్యర్థి మహమ్మద్ మస్రూర్ షేక్(రూ.32 కోట్లు) అత్యధిక ధనికుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. నేర చరిత్ర కలవారి విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థులు 19 మంది, బీఎస్పీ అభ్యర్థులు 12 మంది, 9 మంది ఆర్ఎల్డీ, 13 మంది ఎస్పీ, 8 మంది కాంగ్రెస్, 24 మంది స్వతంత్ర అభ్యర్థులపై పలు రకాల క్రిమినల్ కేసులు ఉన్నాయి. -
నాస్డాక్లో వీడియోకాన్2హెచ్
ముంబై: డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) సేవలందించే వీడియోకాన్2హెచ్ సంస్థ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ఏడీఆర్)ల ద్వారా 32.5 కోట్ల డాలర్లు సమీకరించింది. ఈ ఏడీఆర్‌ల జారీ కారణంగా మంగళవారం నుంచి నాస్డాక్లో వీడియోకాన్2హెచ్ ట్రేడింగ్ మొదలైంది. భారత్‌లో లిస్ట్ అవ్వాలన్న ప్రణాళికలను వాయిదా వేసిన ఈ కంపెనీ ఈ ఏడీఆర్ జారీ ద్వారా 115 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించామని పేర్కొంది. 2000 తర్వాత విదేశీ స్టాక్ మార్కెట్లలో లిస్టైన తొలి దేశీయ ప్రైవేట్ కంపెనీ తమదేనని, 2007 తర్వాత అమెరికాలో అతి పెద్ద భారత ఐపీఓ ఇదేనని వివరించింది. -
కౌన్ బనేహై కరోడ్ పతి?
పార్టీలు ఏవైనా ఈసారి మాత్రం మన రాష్ట్రంలో పోటీ చేస్తున్న రాజకీయ అభ్యర్ధుల ఆస్తులు మాత్రం 5 రెట్లు పెరిగాయి. ఒకరు కారు, ఇద్దరు కారు.... ఏకంగా 74 మంది కోటీశ్వర్లు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ జారీ చేసిన వివరాల ప్రకారం మన రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న మొత్తం 265 మంది రాజకీయ నాయకుల్లో 74 మంది నాయకులు కోటీశ్వరులు. అంతేకాదు, రాజకీయ నాయకుల సంపద ఏ ఏడాదికాఏడాది భారీగా పెరుగుతోంది. కోటీశ్వరులైన రాజకీయ నాయకుల సంఖ్య 2009 తో పోలిస్తే 20 శాతం నుంచి 28శాతంకు పెరిగింది. 2009లో కోటీశ్వరులుగా ఉన్న రాజకీయ నాయకులు సగటు ఆస్తులు 2.50 కోట్లుగా ఉంటే ఇపుడు అవి 8.49 కోట్లకు పెరిగాయని ఏడీఆర్ తెలిపింది. రాష్ట్రంలో ఎక్కువ మంది కోటీశ్వరులు టిడిపి లోనే ఉన్నారు. టీడీపీలో పోటీ చేస్తున్న 89 శాతం మంది కోటీశ్వరులే . ఇక రెండో స్ధానంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులున్నారు. టీఆర్ ఎస్ తరఫున పోటీ దారుల్లో 82 శాతం మంది కోటీశ్వరులే . ఆ తరువాత స్ధానంలో 81శాతం కోటీశ్వరులు కాంగ్రెస్ లో ఉన్నారు. చివరకు కామన్ మ్యాన్ పోటీ చేస్తారని చెపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ లోనూ 50 శాతం మంది పోటీదారులు కోటికి మించి ఆదాయం ఉన్నవారే కావడం విశేషం. ఇక క్యాండెట్ల వారిగా పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొండావిశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలోక్ సభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ 528 కోట్లు. రెండో స్థానంలో టిడిపికి చెందిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 338 కోట్లు . ఇక మూడో రిచెస్ట్ అభ్యర్ధి కాంగ్రెస్ కి చెందిన జి వివేక్. ఆయన పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ 266కోట్లు. వివిధ పార్టీలకు చెందిన దాదాపుగా ఆరుగురు అభ్యర్ధుల ఆస్తుల విలువ వందేసి కోట్లు. తక్కువ ఆస్తులు ఉన్న పార్టీలలో 13 మంది వైఎస్సార్ సిపికి చెందిన వారు. వారి సరాసరి ఆస్తుల విలువ 4.29 కోట్లు. కాగా ఎనిమిది మంది బిజెపి అభ్యర్ధుల విలువ సరాసరిన 29.73 కోట్లు. ఇక ఆఫిడవిట్ సమర్పించిన వారిలో ఆన్కంటాక్స్ వివరాలు ప్రకటించని వారిశాతం 51కాగా 23శాతం మంది ప్యాన్ కార్డ్ వివరాలు అందించలేదు. -
ఎన్నికల కేసుల్లో కాంగ్రెస్ టాప్!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన సహా నేరాలకు, అక్రమాలకు పాల్పడినట్టుగా కేసులున్న ప్రస్తుత ఎంపీల, ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ సోమవారం ప్రకటించింది. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహా పలు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు ఈ జాబితాలో ఉన్నారుు. మొత్తం జాబితాలో అత్యధికంగా 36 మందితో(ఏడుగురు ఎంపీలు, 29 మంది ఎమ్మెల్యేలు) కాంగ్రెస్ అగ్రభాగాన ఉంది. బీజేపీ 34 వుందితో (9మంది ఎంపీలు, 25 ఎమ్మెల్యేలు) ద్వితీయ స్థానంలో ఉంది. లోక్‌సభనుంచి 28వుంది, రాజ్యసభనుంచి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు జాబితాలో ఉన్నారు. 127 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు జాబితాలో ఉన్నాయి. రాష్ట్రాలవారీగా చూస్తే 8 మంది ఎంపీలు, 33 మంది ఎమ్మెల్యేలతో బీహార్ ప్రథమ స్థానంలో, ఇద్దరు ఎంపీలు, 8 ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నారుు. 2009 ఎన్నికల్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కాంగ్రెస్ ఎంపీ బొత్స ఝాన్సీపై భారతీయు శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 77వ సెక్షన్ కింద కేసు నమోదైంది. 2009 ఎన్నికల్లో నిబంధనావళి ఉల్లంఘనపై టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద రెండు కేసులున్నాయి. మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు యత్నించారన్న అభియోగంపై బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌పై ఐపీసీ 153 ఎ , 153 బి, 505 సెక్షన్ల కింద ఒక కేసు ఉంది. పరువునష్టం ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఐపీసీ సెక్షన్ 500 కింద కేసు ఉంది. అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయునపై మరో కేసు ఉంది. 2009ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే పి. మహేందర్ రెడ్డిపై ఐపీసీ 171బి, 353, 341, 143, 504, 506, 34 సెక్షన్ల కింద మొత్తం రెండు కేసులున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీతపై ఐపీసీ 171 ఎఫ్, 188,171 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2009 ఎన్నికల్లో ముధోల్ ఎమ్మెల్యే ఎస్.వేణుగోపాలచారి (టీడీపీ)పై ఐపీసీ 353, 332, 143, 186, 290, 341, 506 సెక్షన్ల కింద మొత్తం ఆరు కేసులున్నాయి. 2010 ఉప ఎన్నికకు సంబంధించి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (టీఆర్ఎస్)పై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద రెండు కేసులు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యే జి. కమలాకర్ (టీడీపీ)పై ఐపీసీ 324, 171 హెచ్, 427, 148, 34, 147, 448, 143, 341, 149 సెక్షన్ల కింద మొత్తం ఆరు కేసులు, 2009 ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (కాంగ్రెస్)పై ఐపీసీ 324, 171 బి, 171 హెచ్, 188, 286, 149, 143, 283, 290, 147, 148, 125 సెక్షన్ల కింద ఆరు కేసులు ఉన్నాయి. 2012 ఉప ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్ సీపీ,)పై ఐపీసీ 171, 188 సెక్షన్ల కింద ఒక కేసు నమోదైంది.