సాక్షి,న్యూఢిల్లీ : ఏజీఆర్‌పై వివాదం కొనసాగుతుండగానే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రభుత్వానికి తన బకాయిలను మొత్తం చెల్లించింది. జనవరి 31, 2020 వరకు చట్టబద్ధంగా టెలికాం విభాగానికి రూ.195 కోట్ల బకాయలను చెల్లించింది. తద్వారా ఈ ఏజీఆర్ బాకీ చెల్లింపుల విషయంలో జియో ముందు నిలిచింది. సుప్రీంకోర్టు విధించిన గడువు (2020 జనవరి 23 వ తేదీ) లోగా బకాయిలు తీర్చిన ఏకైక టెలికం సంస్థగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో నిలిచింది. టెలికాం విభాగానికి (డిఓటి) జియో రూ. 195 కోట్లు చెల్లించిందని గురువారం పిటిఐ నివేదించింది.
మరోవైపు ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, తదుపరి విచారణ వరకు గడువును పొడిగించాల్సిందిగా వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ ప్రభుత్వాన్ని కోరాయి. వొడాఫోన్ ఐడియా రూ. 53,038 కోట్లు, ఎయిర్‌టెల్ సుమారు రూ. 36 వేలకోట్లను చెల్లించాల్సి వుంది. కాగా సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జనవరి 23ను గడువుగా నిర్ణయించింది. అక్టోబర్ 24, 2019 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెల్లింపులు చేయాలని, నిర్ణీత కాలపరిమితిలో అవసరమైన పత్రాలను సమర్పించాలని ప్రభుత్వం టెల్కోలకు ఆదేశించింది. అయితే గడువులోపు బకాయిల చెల్లించలేమని గడువును పొడిగించాలని టెలికాం సంస్థలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి వోడాఫోన్‌ఐడియా, ఎయిర్‌టెల్, టాటా టెలీ సర్వీసెస్ సంస్థలుదాఖలు చేసిన మోడిఫికేషన్‌ను పిటిషన్‌నుసుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. దీంతో రానున్న వారంలో సుప్రీంకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో ఏడీఆర్ బకాయిలు చెల్లించని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డాట్ తన అధికారులను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment