సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన సహా నేరాలకు, అక్రమాలకు పాల్పడినట్టుగా కేసులున్న ప్రస్తుత ఎంపీల, ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ సోమవారం ప్రకటించింది. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహా పలు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు ఈ జాబితాలో ఉన్నారుు. మొత్తం జాబితాలో అత్యధికంగా 36 మందితో(ఏడుగురు ఎంపీలు, 29 మంది ఎమ్మెల్యేలు) కాంగ్రెస్ అగ్రభాగాన ఉంది. బీజేపీ 34 వుందితో (9మంది ఎంపీలు, 25 ఎమ్మెల్యేలు) ద్వితీయ స్థానంలో ఉంది. లోక్‌సభనుంచి 28వుంది, రాజ్యసభనుంచి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు జాబితాలో ఉన్నారు.
127 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు జాబితాలో ఉన్నాయి. రాష్ట్రాలవారీగా చూస్తే 8 మంది ఎంపీలు, 33 మంది ఎమ్మెల్యేలతో బీహార్ ప్రథమ స్థానంలో, ఇద్దరు ఎంపీలు, 8 ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నారుు. 2009 ఎన్నికల్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కాంగ్రెస్ ఎంపీ బొత్స ఝాన్సీపై భారతీయు శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 77వ సెక్షన్ కింద కేసు నమోదైంది. 2009 ఎన్నికల్లో నిబంధనావళి ఉల్లంఘనపై టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద రెండు కేసులున్నాయి. మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు యత్నించారన్న అభియోగంపై బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌పై ఐపీసీ 153 ఎ , 153 బి, 505 సెక్షన్ల కింద ఒక కేసు ఉంది. పరువునష్టం ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఐపీసీ సెక్షన్ 500 కింద కేసు ఉంది. అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయునపై మరో కేసు ఉంది. 2009ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే పి. మహేందర్ రెడ్డిపై ఐపీసీ 171బి, 353, 341, 143, 504, 506, 34 సెక్షన్ల కింద మొత్తం రెండు కేసులున్నాయి.
పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీతపై ఐపీసీ 171 ఎఫ్, 188,171 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2009 ఎన్నికల్లో ముధోల్ ఎమ్మెల్యే ఎస్.వేణుగోపాలచారి (టీడీపీ)పై ఐపీసీ 353, 332, 143, 186, 290, 341, 506 సెక్షన్ల కింద మొత్తం ఆరు కేసులున్నాయి. 2010 ఉప ఎన్నికకు సంబంధించి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (టీఆర్‌ఎస్)పై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద రెండు కేసులు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యే జి. కమలాకర్ (టీడీపీ)పై ఐపీసీ 324, 171 హెచ్, 427, 148, 34, 147, 448, 143, 341, 149 సెక్షన్ల కింద మొత్తం ఆరు కేసులు, 2009 ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (కాంగ్రెస్)పై ఐపీసీ 324, 171 బి, 171 హెచ్, 188, 286, 149, 143, 283, 290, 147, 148, 125 సెక్షన్ల కింద ఆరు కేసులు ఉన్నాయి. 2012 ఉప ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్ సీపీ,)పై ఐపీసీ 171, 188 సెక్షన్ల కింద ఒక కేసు నమోదైంది.
ఎన్నికల కేసుల్లో కాంగ్రెస్ టాప్!
Published Tue, Oct 22 2013 2:20 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement