189 మంది కోటీశ్వరులు.. 116 మంది నేరస్తులు | 189 crorepatis 116 criminals .. | Sakshi
Sakshi News home page

189 మంది కోటీశ్వరులు.. 116 మంది నేరస్తులు

Published Sun, Feb 19 2017 2:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

189 మంది కోటీశ్వరులు.. 116 మంది నేరస్తులు - Sakshi

189 మంది కోటీశ్వరులు.. 116 మంది నేరస్తులు

యూపీ నాలుగోదశ ఎన్నికల్లో పోటీ
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 23న జరగనున్న యూపీ నాలుగోదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 189 మంది కోటీశ్వరులు, 116 మంది నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఎన్నికల పర్యవేక్షణ, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్‌) మొత్తం 680 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించింది. వీరిలో బీజేపీ అభ్యర్థులు 36 మంది, బీఎస్పీ అభ్యర్థులు 45 మంది, ఎస్పీ అభ్యర్థులు 26 మంది, కాంగ్రెస్‌ అభ్యర్థులు 17 మంది, ఆర్‌ఎల్డీ అభ్యర్థులు ఆరుగురు, 25 మంది స్వతంత్ర అభ్యర్థులు కోటీశ్వరులని తెలిపింది.

స్వతంత్ర అభ్యర్థి సుభాష్‌ చంద్ర(రూ.70 కోట్లు), బీజేపీ అభ్యర్థి నంద్‌ గోపాల్‌ గుప్తా నంది(రూ.57 కోట్లు), బీఎస్పీ అభ్యర్థి మహమ్మద్‌ మస్రూర్‌ షేక్‌(రూ.32 కోట్లు) అత్యధిక ధనికుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. నేర చరిత్ర కలవారి విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థులు 19 మంది, బీఎస్పీ అభ్యర్థులు 12 మంది, 9 మంది ఆర్‌ఎల్డీ, 13 మంది ఎస్పీ, 8 మంది కాంగ్రెస్, 24 మంది స్వతంత్ర అభ్యర్థులపై పలు రకాల క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement