న్యూఢిల్లీ: కేరళ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 202 మంది కోటీశ్వరులున్నారు. 311 మంది తమపై నేర కేసులున్నట్లు ప్రకటించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక గురువారం ఈ వివరాలు వెల్లడించింది. పోటీలో ఉన్న 1203 అభ్యర్థుల్లో 1125 మంది స్వీయ ధృవీకరణ పత్రాలను విశ్లేషించింది. మే16న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఏడీఆర్ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు: కోటీశ్వరుల్లో 43 ఐఎన్‌సీ, 24 సీపీఎం, 18 బీజేపీ, 18 భారత్ ధర్మ జనసేన, ఇద్దరు ఏఐఏడీఎంకే, 17 ఐయూఎంఎల్ అభ్యర్థులున్నారు.
30 మంది స్వతంత్రుల ఆస్తులు కోటిపైనే ఉన్నట్లు అఫిడవిట్లు సమర్పించారు.అభ్యర్థుల సగటు ఆస్తులు 1.28 కోటు.్ల నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో 72 మంది సీపీఎం, 42 బీజేపీ,37 ఐఎన్‌సీ, 15 సీపీఐ, 25 ఎస్పీడీఐ అభ్యర్థులున్నారు. 834 మంది ఆదాయ వివరాలు వెల్లడించలేదు. 669 మంది విద్యార్హతలు 5 నుంచి 12 తరగతుల మధ్య ఉన్నాయి. 380 అభ్యర్థులు డిగ్రీ అంతకంటే ఎక్కువ విద్యార్హతలున్నట్లు ప్రకటించారు. 29 మందికి చదవడం, రాయడం మాత్రమే వచ్చు. ఏడుగురు నిరక్షరాస్యులున్నారు. 104 మంది మహిళలు బరిలో ఉన్నారు.
కేరళ ఎన్నికల బరిలో 311 మంది నేరచరితులు
Published Fri, May 13 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement
Advertisement