‘సుప్రీం’ తీర్పులకు ఈసీ వక్రభాష్యం | Supreme Court orders for verification of EVMs | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ తీర్పులకు ఈసీ వక్రభాష్యం

Published Sat, Aug 17 2024 5:26 AM | Last Updated on Sat, Aug 17 2024 4:41 PM

Supreme Court orders for verification of EVMs

ఈవీఎంల వెరిఫికేషన్‌కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు 

అందుకు విరుద్ధంగా స్వీయ ఎస్‌వోపీ రూపొందించిన ఈసీ 

వెరిఫికేషన్‌ స్థానంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహణకు ఆదేశాలు 

మాక్‌ పోలింగ్‌తో ఈవీఎంల ట్యాంపరింగ్‌ తేల్చడం అసాధ్యం 

ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌ స్లిప్పులను సరి పోల్చితేనే లొసుగులు బహిర్గతం 

ఎన్నికల కమిషన్‌ తీరుపై హైకోర్టులో బాలినేని పిటిషన్‌ 

ఎన్నికల సంఘం ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థన  

సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)ల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు, సందేహాలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ ఎన్నికల సంఘం రూపొందించిన టెక్నికల్‌ స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (టీ–ఎస్‌వోపీ)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎన్నికల సంఘం తీరుపై ప్రజల్లో, పోటీ చేసిన అభ్యర్థుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలనకు అవకాశం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఎన్నికల సంఘం తిలోదకాలిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా మాక్‌ పోలింగ్‌ నిర్వహించి చేతులు దులిపేసుకునే దిశగా ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. 

మాక్‌ పోలింగ్‌ నిర్వహించడం ద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్‌ బయట పడే అవకాశమే లేదన్నది నిపుణుల మాట. ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చి పరిశీలిస్తే కానీ ఈవీఎంల ట్యాంపరింగ్‌ వెలుగుచూసే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. మాక్‌ పోలింగ్‌ కేవలం ఆయా మిషన్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని మాత్రమే రూఢీ చేస్తుందని, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయదని స్పష్టంగా చెబుతున్నారు. 

సుప్రీంకోర్టు చెప్పింది ఇదీ... 
ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఈవీఎంల ట్యాంపరింగ్, మార్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలైన ఓట్లను వీవీ ప్యాట్ల స్లిప్పులతో సరిపోల్చి చూడాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లపరంగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు రాతపూర్వకంగా కోరవచ్చు. అలాంటప్పుడు ఒక్కో అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్‌లలో 5 శాతం ఈవీఎంలను, వీవీ ప్యాట్ల స్లిప్పులను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లు తనిఖీ చేసి పరిశీలన చేసి తీరాలి. 

పోలింగ్‌ స్టేషన్లను లేదా సీరియల్‌ నంబర్లను అభ్యర్థులే ఎంపిక చేసుకోవచ్చు. ఈవీఎంల పరిశీలన కోరిన అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన సమయంలో ఉండొచ్చు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వారం లోపు అభ్యర్థులు ఈవీఎంల పరిశీలన కోరవచ్చు. ఇంజనీర్లతో సంప్రదించిన తరువాత ఈవీఎంల తాలూకు మైక్రో కంట్రోలర్ల ప్రామాణికతను ఎన్నికల అధికారి ధృవీకరించాలి. ఈవీఎం ట్యాంపరింగ్‌ అయిందని తేలితే పరిశీలన నిమిత్తం ఆ అభ్యర్థి చెల్లించిన మొత్తాన్ని వాపసు చేయాలి. 

ఎన్నికల సంఘం చేస్తున్నది ఇదీ... 
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు, ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లకు పొంతనే లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికులకు అసాధారణ మెజారిటీలు వచ్చాయి. ఇవన్నీ ఈవీఎంల పనితీరుపై సందేహాలు, అనుమానాలు రేకెత్తించాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. 

నిబంధనల ప్రకారం ఫీజు సైతం చెల్లించారు. అయితే ఇటీవల ఎన్నికల అధికారులు ఈ ఫీజును వాపసు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఒత్తిళ్లకు వారు లొంగలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్‌ బయటపడుతుందన్న ఆందోళనతోనే ఎన్నికల అధికారులు ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తనిఖీ, పరిశీలన స్థానంలో మాక్‌ పోలింగ్‌ను తెరపైకి తెచ్చారు. 

ఈవీఎంలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ బాలినేని న్యాయ పోరాటంtion-evms-2155621

ఏమిటీ మాక్‌ పోలింగ్‌..? 
మాక్‌ పోలింగ్‌ అనేది ఎన్నికల సంఘం రొటీన్‌గా నిర్వహించే ఓ ప్రక్రియ. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, సింబల్‌ లోడింగ్‌ యూనిట్లు తదితరాలను తనిఖీ చేస్తారు. ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు, పరిశీలనలు ఉంటాయి. పోలింగ్‌ రోజు ఎలాగైతే ఆయా మిషన్లను ఓటింగ్‌ కోసం ఉపయోగిస్తారో అదే రీతిలో మాక్‌ పోలింగ్‌ సందర్భంగా వాటిని వినియోగిస్తారు. 

ఒక్కో బటను నొక్కి సక్రమంగా పనిచేస్తుందా? లేదా? అనేది పరిశీలిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్‌ను నొక్కి పని తీరును పరిశీలిస్తారు. అలాగే వీవీ ప్యాట్ల స్లిప్పులు సక్రమంగా వస్తున్నాయా? లేదా? చూస్తారు. అన్ని యూనిట్లు సక్రమంగా కనెక్ట్‌ అయ్యాయా? లేదా? అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తారు. అన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయా? లేదా? అనేది తనిఖీ చేస్తారు.  

ఎన్నికల సంఘం తీరుపై బాలినేని న్యాయ పోరాటం.. 
తన నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందన్న అనుమానాలతో ఓటింగ్‌ యంత్రాల పరిశీలన, తనిఖీ కోసం దరఖాస్తు చేసుకున్న ఒంగోలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన మాక్‌ పోలింగ్‌ ఆదేశాలపై న్యాయ పోరాటానికి దిగారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసినట్లు ఆయన న్యాయవాది వివేకానంద తెలిపారు. 

ఈ నెల 16న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోర్టును కోరినట్లు చెప్పారు. మాక్‌ పోలింగ్‌ ద్వారా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలనను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని అభ్యరి్థంచామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని, అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement