
బెంగళూరులో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర్ వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే మహాలక్ష్మి కేసు నేపథ్యంలో మహిళల భద్రతపై నెలకొన్న ఆందోళనపై పరమేశ్వర్ స్పందించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు.
బెంగళూరు వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ ఇంట్లో యువతిని హత్యచేసి 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి నాలుగైదు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నట్టు బెంగళూరు వెస్ట్‌జోన్ అడిషనల్ కమిషనర్ ఎన్ సతీశ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment