కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర |  Parameshwara To Take Oath As Karnataka Deputy CM On Wednesday | Sakshi
Sakshi News home page

కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర

Published Tue, May 22 2018 8:03 PM | Last Updated on Tue, May 22 2018 8:07 PM

 Parameshwara To Take Oath As Karnataka Deputy CM On Wednesday - Sakshi

కర్ణాటక డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న జీ పరమేశ్వర

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్‌ నేత జీ పరమేశ్వర్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక సీఎం పగ్గాలు చేపట్టనున్న హెచ్‌డీ కుమారస్వామి డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్‌ నియామకాన్ని నిర్ధారించారు. మే 25న స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఉంటుందన్నారు. కేబినెట్‌ మంత్రుల శాఖల కేటాయింపును గురువారం నిర్ణయిస్తామని చెప్పారు.

మంత్రివర్గ కూర్పు సహా అన్ని అంశాలపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి ముందుకుసాగుతాయని, ఎలాంటి విభేదాలు లేవని కుమారస్వామి స్పష్టం చేశారు. కాగా బుధవారం బెంగళూర్‌లో కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు పలువురు విపక్ష నేతలు హాజరవనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement