
మీడియాతో మాట్లాడుతున్న జి. పరమేశ్వర
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టినట్టు వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వర తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరైయ్యారని చెప్పారు. బీదర్ నుంచి ప్రత్యేక విమానంలో రావడం వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారని వివరించారు. కాగా, కర్ణాటక పీసీసీ కార్యాయలంలో జరిగిన పార్టీ శాసనసభా భేటీకి కొందరు ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగింది.
డిప్యూటీ సీఎం అడగలేదు: శివకుమార్
మరోవైపు తమ పార్టీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని, ఎటువంటి ప్రలోభాలకు లొంగబోరని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి పదవి అడిగినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. తానేమీ అడిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే తమ తక్షణ ప్రాధాన్యత అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment