రాజీనామాకు సిద్ధపడ్డ హోంమంత్రి! | Karnataka Home Minister G Parameshwara offers to resign | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: రాజీనామాకు సిద్ధపడ్డ హోంమంత్రి!

Published Thu, Jun 1 2017 12:28 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

రాజీనామాకు సిద్ధపడ్డ హోంమంత్రి!

రాజీనామాకు సిద్ధపడ్డ హోంమంత్రి!

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామం. కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర రాజీనామాకు సిద్ధపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. కర్ణాటకలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది.

ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలకు వెళ్లనుంది. సీఎం అభ్యర్థిగా మరోసారి సిద్దరామయ్యకే కాంగ్రెస్‌ చాన్స్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సీఎం అభ్యర్థిగా శక్తిమంతమైన నేత యడ్యూరప్ప ఖరారయ్యారు. ఈ క్రమంలో సిద్దరామయ్య వర్సెస్‌ యడ్యూరప్పగా ఈ ఎన్నికల పోరు జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement