'కావేరి' పై స్పందించిన ప్రకాష్ రాజ్
హైదరాబాద్ : 'కర్ణాటక - తమిళనాడులో విధ్వంసాలు చూస్తుంటే బాధగా ఉంది.. మనం మనుషులం శాంతియుతంగా పోరాడి సమస్యకు పరిష్కారం కనుగొందాం' అంటూ కావేరి నదీ జలాల వివాదంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ర్టాలలో కొనసాగుతున్న విధ్వంసం చూస్తుంటే బాధగా ఉంది. హక్కుల కోసం పోరాడటం తప్పుకాదు కానీ.. ఆస్తులు ధ్వంసం చేయడం.. ఒకరినొకరు కొట్టుకోవడం తప్పు అని ఆయన అన్నారు. 'మనమంతా మనుషులం శాంతియుతంగా పోరాడుదాం... ఉద్యమం ఎలా చేయాలో భావి తరాలకు నేర్పుదాం. మీ కోపాన్ని అర్ధం చేసుకోగలను.. కొంచెం శాంతిని పాటించి అల్లర్లకు స్వస్థి పలుకుదాం' అని ఆయన ఆందోళన కారులను కోరారు. ఎలాంటి పుకార్లు నమ్మొద్దు.. ఆవేశానికి గురికావద్దని ఆయన సూచించారు.