'కావేరిపై కర్ణాటక చెప్పేదంతా అబద్ధం'
చెన్నై: కర్ణాటక రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోందని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అన్నారు. శాసన నిర్మాణ శాఖ, న్యాయ వ్యవస్థ మధ్య తగాదాను పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కావేరీ జలాల సమస్య అంశం ద్వారా గట్టి పాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తన వద్ద నీళ్లు లేవని కర్ణాటక చెప్పేదంతా కూడా ఓ అబద్ధం అని ఆయన మండిపడ్డారు. ఆదేశాల ప్రకారం 23 వరకు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు నీళ్లు తమిళనాడుకు ఇవ్వకుండా కర్ణాటక ఆపేయడం సుప్రీంకోర్టును అవమానించడమే అని అన్నారు.
ఇదొక్కటే కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నీళ్లు ఇవ్వడం కుదరదని తీర్మానం చేసేందుకు కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తోందని అన్నారు. ఆయన ఆలోచన ప్రకారం కర్ణాటక సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో తీర్మానం చేసి ఇదొక రాజకీయ-చట్టపరమైన సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు. సెప్టెంబర్ 27న కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఆ రోజు తమ రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకుందని దానికి సంబంధించిన తీర్మానం సుప్రీంకోర్టులో ఉంచాలని చూస్తోందన్నారు.
దానిని కోర్టు వ్యతిరేకిస్తే అది కాస్త న్యాయ వ్యవస్థకు, శాసన సభకు మధ్య ఘర్షణకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క, రేపు కావేరి జలాల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చర్చించే విషయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే గవర్నర్ ను కలిసి అనుమతి కలిశారు.