Ramadoss
-
త్వరలోనే రామదాస్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే?
సినీ, రాజకీయ సెలబ్రిటీల జీవిత చరిత్ర వెండితెరకెక్కడం పరిపాటిగా మారింది. గతంలో కామరాజర్, జయలలిత, గాంధీజీ, క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని ఇలా పలువురు ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా రూపొందాయి. తాజాగా పీఎంకే నేత రామదాస్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు భారతి కనమ్మ, వెట్రిక్కోడి కట్టు, పాండవ భూమి, ఆటోగ్రాఫ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన చేరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లోనూ కథానాయకుడిగా నటించిన చేరన్ ఇటీవల జర్నీ అనే వెబ్ సీరీస్‌కు దర్శకత్వం వహించారు. తాజాగా దర్శకత్వం పైనే దృష్టిపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సుదీప్ హీరోగా తమిళం, కన్నడం భాషల్లో ఒక చిత్రం చేస్తున్నారు. దీన్ని పూర్తిచేసిన తరువాత డా.రామదాస్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో డి.రామదాస్ పాత్రలో శరత్‌కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. రామదాస్ ఒక్కపక్క వైద్యవృత్తి నిర్వహిస్తునే మరో పక్క అణగారిన వన్నియార్ సామాజిక వర్గం న్యాయ హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడడం, అలా పాట్టాలి మక్కల్ కట్చి పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడం వంటి అంశాలతో బయోపిక్‌ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
మిత్రపక్షాలు మోసం చేశాయి!
సాక్షి, చెన్నై(తమిళనాడు): అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలు చేసిన మోసంతో ఘోరంగా ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని, ఇకనైనా వన్నియర్లు ఐక్యంగా సాగాలని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే – బీజేపీ కూటమితో కలిసి ఎన్నికల్లోకి పీఎంకే వెళ్లిన విషయం తెలిసిందే. 23 స్థానాల్లో పోటీ చేసిన పీఎంకే ఐదు చోట్ల గెలిచింది. ఈ పరిస్థితుల్లో సేలంలో సోమవారం పార్టీ కార్యవర్గ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాందాసు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తాను ప్రజాజీవితంలోకి వచ్చి 42 ఏళ్లు అవుతోందని, అయితే, తన సామాజిక వర్గానికి సరైన మార్గదర్శకం చేయలేదా..? అనే ఆవేదన కల్గుతోందన్నారు. వన్నియర్ సామాజిక వర్గం రెండు కోట్ల మంది ఉన్నారని గుర్తు చేస్తూ, ఐక్యంగా ఉండి ఉంటే, అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండే వాళ్లమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లోని కొన్ని సామాజిక వర్గాలను చూసి ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితవు పలికారు. ఉద్యమాలతో 10.5 శాతం రిజర్వేషన్ దక్కించుకుంటే, కోర్టు రూపంలో అడ్డంకులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంటరిగా పోటీ చేసిన సమయంలో సామాజిక వర్గం అంతా తన వెన్నంటే ఉన్నట్టు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేక పోవడానికి కూటముల ఏర్పాటు విషయంలో తాను చేసిన తప్పిదం కూడా ఉన్నట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అన్భుమణికి ఒక్క చాన్స్ ఎన్నికల్లో కనీసం 15 చోట్ల విజయకేతనం ఎగుర వేసి ఉండే వాళ్లమని, అయితే, కూటమిలోని మిత్ర పక్షాల నేతలు మోసం చేశారని అన్నాడీఎంకే కూటమిపై రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా, సామాజిక వర్గం కోసం, ఆ అభ్యర్థి కోసం పాటు పడాల్సిన అవసరం ఉందని, అయితే, ఇక్కడ మోసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, మార్పు మార్గంగా ముందుకు వెళ్లనున్నామని, దయ చేసి అన్భుమణి రాందాసుకు ఒక్క చాన్స్ ఇవ్వాలని సామాజిక వర్గం నేతలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్, పురపాలక ఎన్నికల్లో నైనా ఐక్యంగా సత్తా చాటుదామని , కొత్త మార్గంలో పయనిద్దామని, అన్భుమణిని ఆదరిద్దామని వారసుడికి నేతల మద్దతు కూడగట్టే పనిలో రాందాసు నిమగ్నం అయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జికే మణి, ఎమ్మెల్యేలు అరుల్, సదాశివం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. చదవండి: మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు! -
'కావేరిపై కర్ణాటక చెప్పేదంతా అబద్ధం'
చెన్నై: కర్ణాటక రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోందని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అన్నారు. శాసన నిర్మాణ శాఖ, న్యాయ వ్యవస్థ మధ్య తగాదాను పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కావేరీ జలాల సమస్య అంశం ద్వారా గట్టి పాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తన వద్ద నీళ్లు లేవని కర్ణాటక చెప్పేదంతా కూడా ఓ అబద్ధం అని ఆయన మండిపడ్డారు. ఆదేశాల ప్రకారం 23 వరకు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు నీళ్లు తమిళనాడుకు ఇవ్వకుండా కర్ణాటక ఆపేయడం సుప్రీంకోర్టును అవమానించడమే అని అన్నారు. ఇదొక్కటే కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నీళ్లు ఇవ్వడం కుదరదని తీర్మానం చేసేందుకు కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తోందని అన్నారు. ఆయన ఆలోచన ప్రకారం కర్ణాటక సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో తీర్మానం చేసి ఇదొక రాజకీయ-చట్టపరమైన సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు. సెప్టెంబర్ 27న కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఆ రోజు తమ రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకుందని దానికి సంబంధించిన తీర్మానం సుప్రీంకోర్టులో ఉంచాలని చూస్తోందన్నారు. దానిని కోర్టు వ్యతిరేకిస్తే అది కాస్త న్యాయ వ్యవస్థకు, శాసన సభకు మధ్య ఘర్షణకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క, రేపు కావేరి జలాల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చర్చించే విషయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే గవర్నర్ ను కలిసి అనుమతి కలిశారు. -
30 రోజుల్లో జయ జైలుకెళ్లడం ఖాయం
కేకే.నగర్ : నెల రోజుల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని పీఎంకే నేత రామదాస్ జోస్యం చెప్పారు. విల్లుపురం జిల్లా తిరుకోవిలూర్ సమీపంలోని వీరపాండి గ్రామంలో తిరుకోవిలూర్ నియోజకవర్గంలో పీఎంకే తరఫున బహిరంగ సమావేశం జరిగింది. అందులో పార్టీ నేత రామదాస్ మాట్లాడుతూ కొందరు కోట్ల రూపాయలు సంపాదించి కోర్టుకు, జైలుకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారన్నారు. జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసు బెంగళూరులో 18 సంవత్సరాలుగా నడుస్తోంది. ఈ కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. భారీ కాంట్రాక్టుల్లో కూడా దోపిడీ సంఘటనలు జరుగుతున్నాయి. జయలలిత కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది. మరో 30 రోజుల్లో అదే జైలుకు మళ్లీ జయలలిత వెల్లడం ఖాయం. ఎంజీఆర్‌తో నటించి అధికారం చేజిక్కించుకున్న జయలలిత బాగా నటించగలరు. ఎదుటి వారు నమ్మే విధంగా అబద్దం చెప్పగలరు అని రామదాస్ మాట్లాడారు. -
రామ @ ప్రేమ
* వివాదంలో మాజీ మంత్రి రామదాస్ * తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ ఓ మహిళ ఆరోపణ * మంత్రిగా ఉన్నప్పుడి నుంచే ప్రేమాయణం * తనను బహిరంగంగా వివాహం చేసుకోవాలని డిమాండ్ * కలత చెందిన రామదాస్ ఆత్మహత్యాయత్నం * సకాలంలో ఆస్పత్రికి తరలింపు.. తప్పిన ముప్పు * ఆత్మహత్యాయత్నంపై విభిన్న కథనాలు మైసూరు, న్యూస్‌లైన్ : ఆయన బ్రహ్మచారి. గత బీజేపీ హయాంలో వైద్య విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓ మహిళ హఠాత్తుగా ఆయనపై ‘బాంబు’ లాంటి ఆరోపణలు పేల్చడంతో ఖిన్నుడయ్యారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మాజీ మంత్రి ఎస్ఏ. రామదాస్ తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నారని చిక్కమగళూరుకు చెందిన ప్రేమ కుమారి (35) మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త మరణించాడు. తమకూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్లర్కుగా పని చేస్తోంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బదిలీ విషయమై తరచూ వెళ్లానని, క్రమేపీ తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆమె వివరించింది. అందరి సమక్షంలో రామదాస్ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాలతో కలత చెందిన రామదాస్ మంగళవారం రాత్రి ఇక్కడి గోకులంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయన సహాయకుడు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. బెంగళూరుకు తరలించాలని కుటుంబ సభ్యులు యోచిస్తున్నారు. ఆస్పత్రిలో ఆయనను అనేక మంది బీజేపీ నాయకులు పరామర్శించారు. కాగా రామదాస్ ఆత్మహత్యాయత్నంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మద్దతుదారుని ఆత్మహత్య తమ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుసుకున్న రామదాస్ మద్దతుదారుడు నవీన్ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను స్థానిక విద్యారణ్యపురానికి చెందిన వాడు. మరో వైపు ప్రేమ కుమారి బాగోతంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె ఇదివరకే ఓ విలేజ్ అకౌంటెంట్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉండేదని, బ్లాంక్ చెక్కు తీసుకుని అతనిని మోసం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
రాందాస్‌పై ఒత్తిడి!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు పీఎంకే అధినేత రాందాసును ఇరకాటంలో పెడుతున్నాయి. ఇన్నాళ్లు ఒంటరి...ఒంటరి అంటూ వచ్చిన ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం కొత్త పల్లవి అందుకున్నారు. కొత్త ఫ్రంట్ ప్రయత్నాల్ని పక్కన పెట్టి, జతకట్టే మార్గాల్ని అన్వేషించాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. శనివారం తైలాపురంలో జరిగిన ఉత్తర తమిళనాడు జిల్లాల నాయకుల సమావేశం రాందాసును ఆలోచనలో పడేసింది. సాక్షి, చెన్నై : వన్నియర్ సంఘం పార్టీగా రూపుదిద్దుకోవడంతో ద్రవిడ పార్టీలకు తన సత్తా ఏమిటో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు గతంలో రుచి చూపించారు. అయితే, ప్రతి ఎన్నికల్లోనూ కూటముల్ని మారుస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంకట పరిస్థితుల్లోకి నెట్టింది. అసెంబ్లీలో రెండంకెల ఎమ్మెల్యేల్ని కలిగి ఉన్న పీఎంకే, ప్రస్తుతం సింగిల్ డిజిట్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. పతనం నేర్పిన గుణపాఠంతో ఇక ద్రవిడ పార్టీలతో కలసి పనిచేయకూడదన్న తుది నిర్ణయానికి ఆ పార్టీ వర్గాలు వచ్చాయి. ఇక తమది ఒంటరి సమరం అని, లేదా తమ నేతృత్వం లోనే కూటమి ఆవిర్భావం జరిగి తీరుతుందన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. ద్రవిడ పార్టీల తీరును దుమ్మెత్తి పోసిన రాందాసు అక్టోబర్‌లో సమూహ జననాయగ కూట్టని (సోషియల్ డెమోక్రటిక్ అలయన్స్)ను ప్రకటించారు. ఇందులో సమాజ హితాన్ని కాంక్షించే ప్రజా సంఘాలు, ద్రవిడ పార్టీలతో ఎలాంటి సంబంధాలు లేకుండా ప్రజల కోసం శ్రమిస్తున్న, ఉద్యమిస్తున్న పార్టీల్ని చేర్చుకోనున్నట్టు ప్రకటించారు. అందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. పుదుచ్చేరితో పాటుగా 40 లోక్‌సభ స్థానల్లో పోటీకి రెడీ అయ్యారు. పదిహేను చోట్ల పోటీకి అభ్యర్థుల చిట్టాను ప్రకటించేశారు. అన్ని పార్టీల కన్నా ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. తమకు పట్టున్న చోట్ల గెలుపు ఖాయం అన్న ధీమాతో ముందుకెళ్తోన్న రాందాసును నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇరకాటంలో పడేశాయి. ఒంటరి అంటూ, కొత్త ఫ్రంట్ అంటూ వచ్చిన ఆ పార్టీ నాయకులు మనస్సు మార్చుకున్నట్టున్నారు. తమ నేతృత్వంలో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి, ఎన్నికల్ని ఎదుర్కొనడం కన్నా జాతీయ పార్టీలతో జత కట్టడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. జాతీయ పార్టీలతో పొత్తు: కొత్త ఫ్రంట్ ప్రయత్నాన్ని మానుకుని, జాతీయ పార్టీలతో మంతనాలకు సిద్ధం కావాలన్న ఒత్తిడిని అధినేత రాందాసుపై తెస్తున్నారు. శనివారం తైలాపురం వేదికగా జరిగిన సమావేశంలో నాయకుల ఒత్తిడికి రాందాసు ఉక్కిరి బిక్కిరయ్యూరు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, ధర్మపురి, కృష్ణగిరి, విల్లుపురం, కడలూరు, సేలం జిల్లాల నాయకులతో ఎన్నికల ఏర్పాట్లపై రాందాసు సమీక్షించారు. ఆయా జిల్లాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన దృష్ట్యా, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, తమకు ఏ మేరకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో ఆరా తీశారు. ఈ సమీక్షలో నాయకులందరూ కొత్త పల్లవి అందుకోవడం రాందాసును ఆలోచనలో పడేసింది. కొత్త ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు చేయడం కన్నా, జాతీయ పార్టీలతో జత కట్టి ఎన్నికల్ని ఎదుర్కొంటే బాగుంటుందన్న అభిప్రాయాల్ని నాయకులు వ్యక్తం చేశారు. వేచిచూద్దాం: పట్టున్న చోట్ల బలం మరింత పుంజు కుంటోందని వివరించిన ఓ నేత, గెలుపు మాత్రం ఏదో ఒక జాతీయ పార్టీతో కలసి పనిచేస్తే సులభతరం అవుతుందంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. దీంతో అందరు నేతలు అదే బాటలో సాగారు. దేశంలో మోడీ ప్రభంజనం మార్మోగుతున్న దృష్ట్యా, బీజేపీతో జత కడితే భవిష్యత్తు ఉంటుందంటూ మెజారిటీ శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో వేచి చూద్దామం టూ నాయకులకు సర్ది చెప్పారు. మెజారిటీ శాతం మం ది పట్టుబట్టడంతో చివరకు త్వరలో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం దృష్టికి తీసుకెళ్లి, తుది నిర్ణ యం తీసుకుందామంటూ సూచించడం గమనార్హం. -
తిరుపతిని తమిళనాడులో కలపాలి: రాందాస్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించే క్రమంలో తిరుపతి, శ్రీకాళహస్తి సహా 8 మండలాలను తమిళనాడులో కలపాలని పట్టాళి మక్కల్ కట్చీ (పీఎంకే) అధినేత రాందాస్ డిమాండ్ చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా 1956లో విభజన జరిగినప్పుడు తమిళులు అధికంగా నివసించే 32 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 300 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయూయని తెలిపారు. ఆ రోజుల్లోనే తీవ్రంగా వ్యతిరేకించడంతో తిరుత్తణి, పళ్లిపట్టులోని కొంతభాగాన్ని తిరిగి తమిళనాడులో కలిపారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నివసించడం వల్ల విద్య, ఉద్యోగాలు, రాజకీయపరమైన హక్కులను తమిళులు కోల్పోయారని చెప్పారు. తమను తమిళనాడులో కలపాలని కోరుతూ ఆంధ్ర సరిహద్దులోని 75 శాతం పంచాయతీలు తీర్మానాలు ఆమోదించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పంపాయన్నారు. గతంలో తమిళనాడుకు ఏర్పడిన నష్టాన్ని సవరించేందుకు ఇదే సరైన సమయమని తెలిపారు. ఈ అంశాన్ని కేంద్రం వెంటనే పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. -
తిరుపతిని మాకివ్వండి: పీఎంకే నేత రాందాస్
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందట. ఇంతకీ ఆ పిల్లి ఏం చేసింది? పిట్టల దగ్గరున్న రొట్టెముక్క తాను లాగేసుకుని చక్కా పోయింది. ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా.. విభజించాలా అని ఒక పక్క మనలో మనం వాదులాడుకుంటుంటే మధ్యలో తమిళనాడుకు చెందిన పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్ వచ్చి తానూ అందులో వేలు పెడతుతున్నారు. ఏకంగా తిరుపతిని తమకు ఇచ్చేయాలని ఆయన అడుగుతున్నారు. తిరుపతిలో చాలామంది తమిళులే ఉంటారని, అందువల్ల అది తమిళనాట కలవడమే మంచిదన్నది ఆయన వాదన. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు తమిళనాడుకు అన్యాయం జరిగిందని, తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు లాంటి ఎనిమిది జోన్లను ఇప్పుడు మళ్లీ తమిళనాడులో కలపాలని ఆయన డిమాండు చేశారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఒక్క మాట మీద ఉండి, రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, అందులో ఓ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి సమర్పించాలని ఆయన సూచించారు. తమిళులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాలను అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు తరలించారని రాందాస్ అన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి రెండూ పుణ్యక్షేత్రాలే. అందులోనూ తిరుపతికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వెల్లువెత్తుతుంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేవుడిగా శ్రీ వేంకటేశ్వరుడిని భావిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దాదాపు 200 గ్రామాలను తమిళనాడులో కలిపే అవకాశం వస్తుందని, అక్కడున్న తమిళులకు ఉద్యోగావకాశాలు దక్కక చాలా ఇబ్బంది పడుతున్నారని రాందాస్ ఆవేదన చెందారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో తమిళనాడు దాదాపు 70వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని పొరుగు రాష్ట్రాలకు ఇచ్చేయాల్సి వచ్చిందని, 32 వేల చదరపు మీటర్లు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే ఇచ్చారని ఆయన చెప్పారు.