కావేరి వివాదంపై స్పందించిన మోదీ
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం స్పందించారు. ఇరురాష్ట్రాల ప్రజలు సంయమనం పాటించాలని, సామాజిక బాధ్యతలను గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు తనను ఎంతగానో బాధించినట్లు మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే సాధ్యపడతాయని అన్నారు.
ఇరు రాష్ట్రాల ప్రజలు హింసను వదిలిపెట్టి జాతీయ అవసరాల కోసం నిలబడతారని తాను నమ్ముతున్నట్లు మోదీ పేర్కొన్నారు. దేశాన్ని నిర్మించుకోవడమే అన్నింటికన్నా పెద్ద విషయమని, అందుకు తమిళ, కన్నడ ప్రజలు తోడుగా నిలబడతారని భావిస్తున్నట్లు చెప్పారు. సోమవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆందోళనకారులు బస్సులకు నిప్పు అంటించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు బెంగుళూరులోని కొన్ని ప్రాంతాల్లో కర్య్ఫూని విధించారు.
PM Modi appeals to people in Karnataka and TN, to display sensitivity, and also keep in mind their civic responsibilities. #CauveryIssue
— ANI (@ANI_news) September 13, 2016