
బెంగుళూరులో కాల్పులు : ఒకరి మృతి
బెంగుళూరు : కావేరి నది జల వివాదంతో బెంగుళూరు నగరం అట్టుడుకుతోంది. నగరంలో సోమవారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
నగరంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు రాజ్గోపాల్నగర్, కామాక్షిపాలై, విజయనగర్, బయంత్రాయన్పురా, కెన్రెగి, మగాది రోడ్డు, రాజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కర్ఫ్యూ విధించారు.