బలితీసుకున్న మంత్రి కారు
లక్నో: ఓ మంత్రి కారు డ్రైవర్ బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ నిండు ప్రాణం పోయేందుకు కారణమయ్యాడు. అతడి కారులో మద్యం సీసాలు కూడా లభించడంతో మద్యం తాగి అతడు వాహనం నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తప్రదేశ్‌లోని ఓం ప్రకాశ్ సింగ్ అనే ఆయన సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.
ఆయనకు సంబంధించిన కారు హర్దోయి అనే ప్రాంతంలో ఓ హ్యాండ్ కార్ట్(మనిషిలాగే బండి)ను ఢీకొట్టడంతో దానిని నడిపే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం కారును తనిఖీ చేయగా అందులో మద్యం బాటిళ్లు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.