ఇంట్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం
Published Fri, Mar 10 2017 9:51 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం కీసరలో శుక్రవారం తెల్లవారుజామున డీసీఎం బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టి.. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. డీసీఎంలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖ జిల్లా యలమంచిలి నుంచి గన్నవరం గొర్రెల సంతకు వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
యలమంచిలికి చెందిన ఎస్‌కే సుభాని గన్నవరం నుంచి గొర్రెలు తీసుకెళ్లడానికి తన డీసీఎం వాహనంలో ఓ డ్రైవర్‌తో పాటు వచ్చాడు. ఈ క్రమంలో కీసర వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుభాని మృతి చెందగా.. ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Advertisement