kisara
-
ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతి
-
పెళ్లైన మరునాడే.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో బుధవారం ఏడుగురు మృత్యువాతపడ్డారు. కీసర ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా.. సాగర్ హైవే సర్వీస్ రోడ్డులో ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని బోర్వెల్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శేరిలింగంపల్లి నేతాజీనగర్‌కు చెందిన నవదంపతులు బెంగళూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. పెళ్లైన మరునాడే.. సాక్షి, చందానగర్: నగరానికి చెందిన నవదంపతులు పెళ్లి అయిన మరునాడే రోడ్డు ప్రమాదానికి గురై విగతజీవులుగా మారారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్‌లో నివసించే పార్శి మురళీకృష్ణ, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాసులు(38) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి చెన్నైకి చెందిన కనిమొళి(33)తో తిరుపతిలో ఆదివారం వివాహమైంది. సోమవారంరాత్రి 8.30 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఐ 10 వాహనంలో నవదంపతులతోపాటు ఇద్దరు బంధువులు చెన్నైకి ప్రయాణమయ్యారు. చదవండి: క్రిప్టో కరెన్సీ’ చేతికి రాలేదని.. ‘స్వాతీ.. పిల్లలు జాగ్రత్త.. అర్థం చేసుకో’ బెంగళూరు నుంచి 120 కి.మీ. దూరంలో రాత్రి 12 గంటల సమయంలో కారును నడుపుతున్న శ్రీనివాసులు ఆగివున్న లారీని ఢీకొట్టడంతోఅతను అక్కడికక్కడే మృతి చెందాడు. కోమాలోకి వెళ్లిన కనిమొళి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వారితో ప్రయాణిస్తున్న నవవధువు సోదరి, శ్రీనివాసులు కోడలు తీవ్ర గాయాలపాలయ్యా రు. శ్రీనివాసులు మృతదేహాన్ని బుధవారం ఉద యం నేతాజీనగర్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆగి ఉన్న లారీని ఢీకొని... సాక్షి, కీసర: పేట్ బషీరాబాద్‌లోని శ్రీని అవెన్యూ గేట్–3లో నివసించే సుమంత్‌రెడ్డి (20) తన సోదరుడిని ఖమ్మంలోని నీట్ కోచింగ్ సెంటర్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(21), డ్రైవర్ శంకర్‌రెడ్డి(39)తో కలసి కారులో బుధవారం తెల్లవారుఝామున బయలుదేరారు. తిరుగుప్రయాణంలో ఉదయం 11.30 గంటల సమయంలో కీసర ఓఆర్ఆర్ ప్లాజాకు రెండు కిలోమీటర్ల దూరంలో కారు బ్రేక్‌డౌన్ అయింది. డ్రైవింగ్ చేస్తున్న సుమంత్‌రెడ్డి కారును అకస్మాత్తుగా ఎడమ వైపునకు మళ్లించగా, అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో సుమంత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, పవన్‌కుమార్‌రెడ్డి (21)కి తీవ్రగాయాలయ్యాయి. కీసర పోలీసులు వచ్చి పవన్‌కుమార్‌రెడ్డిని ఈసీఐఎల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో పది నిమిషాలలోపు శామీర్‌పేట జంక్షన్ వద్ద రోడ్డు దిగి అల్వాల్‌కు చేరుకునే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. చదవండి: బస్ డ్రైవర్ నిర్లక్ష్యం..యువతి మృతి సాగర్ రహదారి సర్వీస్ రోడ్డుపై ప్రమాదానికి కారణమైన బోర్వెల్ వాహనం బోర్వెల్ లారీ ఢీకొని.. హస్తినాపురం: బోర్వెల్ వాహనం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన విశాల్(21), నగరంలోని హబ్సిగూడకు చెందిన రోహిత్‌రెడ్డి (21), గౌతంరెడ్డిలు బీఎన్‌రెడ్డి నగర్లో నివసిస్తూ ఇబ్రహీంపట్నం సమీపంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. కాలేజీ వదిలిన వెంటనే వీరు స్కూటీపై నగరానికి బయలుదేరారు. సాగర్ రహదారి సమీపంలోని సర్వీస్ రోడ్డుపై సాగర్ కాంప్లెక్స్ వద్ద స్కూటీని, వెనుక నుంచి వేగంగా వచ్చిన బోర్వెల్ లారీ ఢీకొట్టడంతో విశాల్, రోహిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గౌతంరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. -
రేవ్ పార్టీ : విందులు, అమ్మాయిలతో చిందులు..
మేడ్చల్ : కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో సన్నిహితుల కోసం ఆరుగురు అమ్మాయిలతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన డీలర్లు ఇందులో పాల్గొన్నారు. విందులు, అమ్మాయిలతో చిందులతో వారు రచ్చరచ్చ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆరుగురు యువతుల్ని, 10 మంది యువకుల్ని అరెస్ట్ చేశారు. బెస్ట్ క్రాఫ్ట్స్ సీడ్స్ కంపెనీ మేనేజర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి సెల్ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీని ముప్పుతిప్పలు పెట్టిన నాగరాజు
సాక్షి, హైదరాబాద్ : కోటి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు అక్రమాలు తవ్వినకొద్ది బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా పోలీసు అధికారులను సైతం లంచం డిమాండ్ చేసి ముప్పు తిప్పలు పెట్టారు. ఆయన బాధితుల్లో తాను ఒకడినని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. లీగల్‌గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడని వాపోయారు. (చదవండి : 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) ‘నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 2018లో సర్వేనెంబర్ 614లో నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాను. లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. గతంలో నాగరాజుపై చీఫ్ సెక్రెటరీకి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవో కు ఫిర్యాదు చేశాను. అధికారులను మభ్యపెడుతు తన పదవిని కాపాడుకుంటున్నాడు. ఒక పోలీస్ అధికారిగా ఉన్న నన్నే లంచం డిమాండ్ చేశాడంటే.. ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై దందాలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఒక్క పని కూడా చేయడు.న్యాయస్థానం కూడా నాగరాజు వ్యవహారంలో సీరియస్ అయింది. ఇలాంటి వ్యక్తి ని కఠినంగా శిక్షించాలి’అని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. (చదవండి : నాగరాజు ఇంటిలో కొనసాగుతున్న సోదాలు) -
అవినీతిలో నాగరాజు
-
అవినీతిలో నాగ ‘రాజు’ లీలలు
సాక్షి, మేడ్చల్: కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో 28 లక్షలు నగదు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు బినామీల పేర్లతో భారీగా అక్రమాస్తులు కలిగిఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. తహసీల్దార్ బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది.తహసీల్దార్ నాగరాజు, రియల్టర్స్ అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏ సాయిరాజులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గతంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తహశీల్దార్ నాగరాజు అరెస్టయ్యారు. తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘కేసీఆర్ ముందుకు వెళ్లే దమ్ము మంత్రికి లేదు’
సాక్షి, కీసర(రంగారెడ్డి) : ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రజలకు ఇచి్చన ఏ ఒక్కహామీని కూడా నెరవేర్చలేదన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రజలకు పెనుశాపంగా మారిన డంపింగ్‌యార్డును తరలించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.ఆరీ్టసీ చార్జీలు, మద్యం ధరలను పెంచిన టీఆర్ఎస్ను వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే కరెంటు చార్జీలు, ఇంటిపన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతుందన్నారు. (మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా.) సీఎం కేసీఆర్ ముందుకెళ్లే దమ్ము మంత్రి మల్లారెడ్డికే లేదని, ఇక ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు డబ్బుల ఆశ చూపించి ఓట్లు దండుకునేందుకు వస్తారని, వారు ఇచ్చే డబ్బు తీసుకొని ప్రజల సమస్యలపై పోరాటం చేసే కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఓటు వేసే ముందు ఓటర్లంతా ఆలోచించి మంచినాయకులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్లు మాట్లాడుతూ అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారన్నారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌కే పరిమితమయ్యాడన్నారు. సమావేశంలో మున్సిపల్ ఎన్నిలక ఇన్చార్జ్ వేణుగోపాల్, జెడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి హరివర్థన్‌రెడ్డి, నాగారం దమ్మాయిగూడ మున్సిపాలిటీల కాంగ్రెస్ నేతలు ముప్పురాంరెడ్డి, చిన్నమరాజు ప్రభాకర్‌గౌడ్, సురకంటి శ్రీకాంత్‌రెడ్డి, ముప్పు శ్రీనివాస్‌రెడ్డి, సతీష్‌గౌడ్, సురకంటి నవనీత, సంజీవరెడ్డి, రామారావు, అశోక్‌యాదవ్, వెంకటేష్, తటాకం అభిలాష్ మంచాల ప్రవీన్, రాములు , తదితరులు పాల్గొన్నారు. చదవండి: కారెక్కనున్న బట్టి -
కీసర టోల్‌ప్లాజా వద్ద పెరుగుతున్న వాహనాల రద్దీ
నందిగామ: విజయవాడ-హైదరాబాద్ హైవేలో కృష్ణాజిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వచ్చిన వారు తిరిగి వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాదు వెళ్తున్న వాహనాలతో ఇక్కడ రద్దీ ఏర్పడింది. సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది రద్దీ కారణంగా టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోల్‌ప్లాజాలో పోలీసులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 5200 వాహనాలు ఈ టోల్‌ప్లాజా ద్వారా వెళ్లినట్లు టోల్ గేటు సిబ్బంది వెల్లడించారు. సాయంత్రానికి 15000 వేలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. -
ఇంట్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం
కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం కీసరలో శుక్రవారం తెల్లవారుజామున డీసీఎం బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టి.. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. డీసీఎంలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖ జిల్లా యలమంచిలి నుంచి గన్నవరం గొర్రెల సంతకు వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యలమంచిలికి చెందిన ఎస్కే సుభాని గన్నవరం నుంచి గొర్రెలు తీసుకెళ్లడానికి తన డీసీఎం వాహనంలో ఓ డ్రైవర్‌తో పాటు వచ్చాడు. ఈ క్రమంలో కీసర వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుభాని మృతి చెందగా.. ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
కీసరలో వైభవంగా రుద్రాభిషేకం
కీసర: ప్రఖ్యాతశైవ క్షేత్రమైన కీసర గుట్ట శ్రీభవానీరామలింగేశ్వర స్వామి సన్నిదిలో సోమవారం నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఉదయం గర్బాలయంలో కొలువైన శ్రీస్వామివారికి రుద్రాభిషేకం అనంతరం భక్తులు సాముహిక అభిషేకాల్లో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో స్వామివారికి పల్లకీసేవను నిర్వహించారు. ఆలయ ఛైర్మెన్ తటాకం ఉమాపతిశర్మ, భక్తులు తదితరులుపాల్గొన్నారు. -
కీసరగుట్టలో శివరాత్రి ఏర్పాట్లు పూర్తి: జేసీ రజత్
మార్చి 5 నుంచి 10 వ తేది వరకు జరిగే కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అన్నారు. మంగళవారం ఆయన ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ, వివిధ శాఖల అధికారులతో కలసి కీసరగుట్టలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కీసరగుట్ట జాతరను విజయవంతం చేసేందుకు గాను ఏర్పాటు చేసిన వివిధ కమిటీల పనితీరును సమీక్షించారు. భక్తులు గుట్టకు చేరుకొని స్వామిని దర్శించుకొని ప్రశాంతంగా తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని జేసీ ఆదేశించారు. రాజధానికి చేరువలో కీసరగుట్ట ఉన్నందున బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. -
ఇంతింతై.. ఉల్లింతై..
* గ్రీన్హౌస్లో ఉల్లిసాగు... దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో.. * రంగారెడ్డి జిల్లా కీసరలోని రైతు క్షేత్రంలో ఉద్యాన శాఖ శ్రీకారం * నాలుగింతలు పెరగనున్న దిగుబడులు... 70 రోజుల్లోనే పంట * ఎకరాకు రూ.6లక్షల ఆదాయం.. ఒక్కో ఉల్లి గడ్డ బరువు 200 గ్రాములు సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యపరంగా ఉల్లి చేసే మేలు అందరికీ తెలిసిందే. ఆర్థికంగా అది కలిగించే మేలుపై తెలంగాణ ఉద్యాన శాఖ ప్రయోగం చేపట్టింది. అధిక దిగుబడి, అధిక ఆదాయం సాధించే దిశగా ఉల్లిసాగును చేపట్టింది. గ్రీన్హౌస్ (పాలీహౌస్)లో ఉల్లిసాగుకు తెలంగాణ ఉద్యానశాఖ నడుం బిగించింది. దేశంలోనే మొదటిసారిగా రంగారెడ్డి జిల్లా కీసరలో ఒక రైతు పొలంలో ఉల్లి సాగు చేపట్టింది. సాధారణంగా ఒక్కో ఉల్లి గడ్డ బరువు 60 నుంచి 70 గ్రాములుంటుంది. కానీ, గ్రీన్హౌస్లో పండించే ఉల్లి గడ్డ బరువు 180 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఉల్లి కొరతతో తెలంగాణ సతమతమవుతోన్న నేపథ్యంలో గ్రీన్హౌస్ ద్వారా అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. పబ్లిక్ గార్డెన్లో ప్రయోగం సక్సెస్ వాస్తవంగా గ్రీన్హౌస్లో పూలు, కూరగాయల సాగు చేపడతారు. దేశ, విదేశాల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఉల్లి కొరత నేపథ్యంలో తెలంగాణ ఉద్యానశా ఖ ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల పబ్లి క్ గార్డెన్లో ఒక గ్రీన్హౌస్ నిర్మించి అందులో 50 ఉల్లి మొక్కలను నాటింది. అందులో ప్రయోగాత్మకంగా చే పట్టిన ఉల్లి సాగు విజయవంతమైంది. ఎకరా గ్రీన్హౌస్ సాగులో ఏకంగా 30 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడి వస్తుందని తేలింది. సాధారణంగా బయట క్షేత్రా ల్లో ఉల్లిని పండిస్తే కేవలం ఏడు మెట్రిక్ టన్నుల మేర కే దిగుబడి వస్తుంది. గ్రీన్హౌస్లో ఉల్లి సాగు వల్ల నాలుగింతల దిగుబడి వస్తుందని ప్రయోగం లో తేలడంతో రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డిని ఉద్యానశాఖ సంప్రదిం చింది. అర ఎకరం భూ మిలో ఆ రైతు ఉల్లి సాగు చేపట్టారు. 75 వేల మొక్కలు నాటారు. 70 రోజుల్లో ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం సాధారణంగా ఉల్లి పంట 110 రోజులకు దిగుబడి వస్తుంది. అలాంటిది గ్రీన్హౌస్లో 70 రోజులకే పంట చేతికి వస్తుంది. సాధారణం కంటే నాలుగింతల దిగుబడి రానుండటంతో ఎకరాకు రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని ఉద్యానశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కీసర రైతు అర ఎకరానికిగాను రూ. 3 లక్షల ఆదాయం పొందుతారని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వెంటనే కొత్తమీర, దోసకాయ, క్యాప్సికం సాగు చేయాలని అధికారులు అతనికి సూచించారు. ఆ ప్రకారం ఏడాదికి అర ఎకరా భూమిలో కనీసంగా రూ. 10 లక్షల వరకు ఆదాయం పొందుతారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గ్రీన్హౌస్ ద్వారా మూడు నాలుగు పంటలు ఏడాదికి వేసే అవకాశం ఉంది. -
కీసరలో ప్రశాంతంగా పోలింగ్
రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మొదటగా ఓటును కొండాపూర్ ఎంపీటీసీ జ్యోతి వేశారు. ఇక్కడ మొత్తం 149 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. -
ఏటీఎంలో చోరీకి యత్నం
రంగారెడ్డి జిల్లా కీసరలోని ఓ ఏటీఏంలో దుండగులు చోరికి యత్నించారు. ప్రధాన చౌరస్తాకు సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలోకి శనివారం అర్థరాత్రి దాటిన తరువాత దుండగులు ప్రవేశించి ఏటీఎం యంత్రాన్ని తెరిచేందుకు ప్రయత్నించారు. ఎంతకూ తెరచుకోకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం విషయం తెలుసుకున్న కీసర పోలీసులు ఏటీఏం కేంద్రం వద్ద ఆధారాలను సేకరించి ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
కీసర వద్ద ఒరిగిపోయిన బ్రిడ్జి 6వ బ్లాక్
-
రంగారెడ్డి జిల్లా కీసరలో దారణం
రంగారెడ్డి జిల్లా: కీసరలో దారణం చోటుచేసుకుంది. సాయి అనే యువకుడు తన భార్య హేమలతకు లింగనిర్ధారణ పరీక్ష చేయించాడు.ఆమెకు ఆడశిశువని తేలడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారిసున్నారు. -
‘ఔటర్’పై బైక్ రేసింగ్
కీసర: ఔటర్ రింగ్ రోడ్డుపై పలువురు విద్యార్థులు బుధవారం బైక్ రేసింగ్‌కు పాల్పడ్డారు. సీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కీసర ఔటర్‌రింగ్ రోడ్డుపై మధ్యాహ్నం సమయంలో 13 మంది విద్యార్థులు స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే పసిగట్టిన విద్యార్థులు పరారయ్యారు. కాగా సంఘటనా స్థలంలో ఉన్న మూడు యాక్టివా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. కాగా రేసింగ్‌కు పాల్పడిన విద్యార్థులు కీసర మండలంలో ఉన్న పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న వారని పోలీసులు తెలిపారు. వీరంతా నగరంలోని ఈసీఐఎల్ ప్రాంతంలో ఉంటున్నవారు. స్వాధీనం చేసుకున్న వాహనాల నంబర్ల ఆధారంగా విద్యార్థులను పట్టుకొని కౌన్సెలింగ్ చేస్తామని సీఐ తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
ఊరికో చరిత్ర
ఘట్కేసర్ కీసరను రాజధానిగా చేసుకొని విష్ణుకుండినులనే రాజులు పరిపాలిం చారు. వారు తమ విద్యాసంస్థలను ఘటికలు అని పిలిచేవారు. ఘట్కేసర్ సమీపంలో వారు కొన్ని ఘటికలను ఏర్పాటు చేశారు. దాంతో ఘటికేశ్వరంగా పేరొచ్చింది. అదే కాలక్రమంలో ఘట్‌కేసర్‌గా రూపాంతరం చెందింది అనేది పూర్వీకుల కథనం. ఇక్కడ మరో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న శివలింగాలను శ్రీరామ భక్తుడైన హనుమంతుడు విసిరేసినట్లు చెబుతారు. అలా విసిరేసిన శివలింగాల్లో ఒకటి వచ్చి ఈ ప్రాంతంలో పడిందంటారు. ఘటికల వద్ద ఉన్న ఈశ్వరుడు కాబట్టి ఘటకేశ్వరుడిగా పేరొచ్చిందని, రానురాను అక్కడే గ్రామం వెలియడంతో ఘటకేశ్వరంగా అనంతరం ఘట్‌కేసర్‌గా మారిందని పెద్దలు చెబుతుంటారు. ఏదులాబాద్ ఈ ప్రాంతంలో సుమారు 48 వరకు వివిధ ఆలయాలు ఉన్నాయి. వీటిలో కుబేరాలయం, శ్రీగోదాదేవి సమేత మన్నార్ రంగనాయకస్వామి దేవాలయాలకు సుమారు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. వీటిలో ఏదో ఒక దేవాలయంలో తరచూ పూజలు, ఉత్సవాలు జరుగుతుండేవి. అప్పుడు పాలించిన నైజాం నవాబులు పండుగను ‘ఈద్’ అని పిలిచేవారు. దాంతో ఈ ప్రాంతం కాస్తా ఈద్‌లాబాద్‌గా పేరుబడింది. కాలక్రమేణా ఏదులాబాద్‌గా మారింది. ప్రతాప్‌సింగారం ఓరుగల్లును రాజధానిగా చేసు కొని పాలించిన రాణీరుద్రమదేవి మనుమడైన ప్రతాపరుద్రుడు యేడాదికోసారి వేటకు వచ్చి కొంతకాలం ఇక్కడే గడిపేవాడట. దీంతో ఈ గ్రామానికి ప్రతాపసింగారంగా పేరొచ్చింది. ప్రతాపరుద్రుడు అశ్వాలతో కాచివానిసింగారం వద్ద దిగి నడుచుకుంటూ తన బలగాలతో వేటకు వచ్చేవాడట. తిరిగి కాచివానిసింగారం వద్ద గుర్రాలను ఎక్కి తన రాజధానికి తిరుగుపయనమయ్యేవాడట. ఈ కారణంగా అప్పట్లో కాచివాని సింగారాన్ని ఎక్కే సింగారంగా, ప్రతాప్‌సింగారంను దిగే సింగారంగా పిలిచేవారట. ముత్వెల్లిగూడ నైజాం పాలించిన కాలంలో కాచివానిసింగారం, ప్రతాప్‌సింగారం గ్రామాల్లోని కొన్ని వందల ఎకరాలను (జాగీర్లు) చూసుకోవడానికి నైజం ప్రభువు ముతవల్లీ (నిర్వాహకుడు)ని నియమించుకున్నాడు. ముతవల్లీ శిస్తు కింద పొలాల ద్వారా వచ్చిన ఫలసాయంలో కొంత భాగం నైజం నవాబుకు పంపేవాడు. ముతవల్లీ నివసించే గూడెన్ని ముతవల్లీగూడగా పిలిచేవారట. అదే కాలానుగుణంగా ముత్వెల్లిగూడగా మారింది. అవుశాపూర్ ఈ గ్రామానికి సమీపంలో ఓ జాగీర్ ఉండేది. ఆ జాగీర్ను నైజాం కాలం లో జమీలా అనే దొరసాని చూసుకునేదట. ఆమెకు సంబంధించిన అశ్వాలను జాగీర్‌కు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉంచేవారట. దాంతో ఈ ప్రాంతం అశ్వాల పురం తదనంతరం అశ్వాపు రంగా పేరుమారి చివరికి అవుశాపురంగా రూపాంతరం చెందింది. కాచివాని సింగారం ప్రతాపరుద్రుని అల్లుడైన కసురుడు కాచివాని సింగారంను పరిపాలిం చాడు. అందుకే ఆ గ్రామం కసురుని పేరుతో కాసవాని సింగారంగా.. తర్వాత రూపాం తరం చెంది కాచివాని సింగారంగా మారింది. కసురుడు మంచి వేటగాడని తన మామ ప్రతాపరుద్రునితో కలిసి వేటకు వెళ్లేవాడని చెబుతారు. -
బండరాయితో మోది.. గొంతునులిమి..
కీసర: ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఆమె తలపై బండరాయితో మోది.. చీరతో ఉరివేసి చంపేశారు. హతురాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా వాసి. ఈ సంఘటన మంగళవారం మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని పాలకొల్లు గ్రామానికి చెందిన పోనగంటి లక్ష్మి,(33)ధన్‌బాబు ద ంపతులు. వీరు పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం శామీర్‌పేట్ మండలం పోతారం గ్రామానికి వలస వచ్చారు. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు(13) హైదరాబాద్‌లోని తన మేనమామ వద్ద ఉంటోంది. ఇదిలా ఉండగా సోమవారం పని నిమిత్తం ఫాంహౌస్ నుంచి వెళ్లిన లక్ష్మి ఎంతకూ తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం మండల పరిధిలోని రాంపల్లి-చర్లపల్లి రహదారి సమీపంలో ఉన్న శ్రీనగర్‌కాలనీ వెంచర్‌కు దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో ఓ మహిళ మృతదేహం పడి ఉండడంతో అటుగా వెళ్లిన పశువుల కాపరి గమనించి కీసర పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానిక సీఐ గురువారెడ్డి, అల్వాల్ ఏసీపీ ప్రకాశ్‌రావు తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతురాలి వద్ద ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా లక్ష్మి వివరాలు తెలిశాయి. దుండగులు మహిళ తలపై బండరాయితో మోది.. అనంతరం చీరకొంగుతో గొంతు నమిలి చంపేసిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసు జాగిలం ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న రాంపల్లి-చర్లపల్లి ప్రధాన రహదారి వరకు వెళ్లి తిరిగి వచ్చింది. పరిచయం ఉన్న వ్యక్తులే లక్ష్మిని తీసుకొచ్చి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చినుకు పడక .. చెరువులు నిండక..
కీసర: వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా చిరుజల్లులు తప్ప భారీవర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు వట్టిపోతున్నాయి. అడపాదడపా చిరుజల్లులు కురుస్తున్నా మండుతున్న ఎండలకు అవి కాస్తా ఆవిరైపోతున్నాయి. మండలంలో మొత్తం 12 నోటిఫైడ్ చెరువులు, మరో 30 వరకు చిన్నాచితక కుంటలు ఉన్నాయి. రాంపల్లి పాతచెరువు, నాగారం అన్నరాయిని చెరువులు మినహా మిగతా చెరువుల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లో కూడా అడుగు నీరు లేకుండా పోయాయి. ఇక కుంటల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కొన్ని చోట్ల నీటి సంగతి దేవుడెరుగు కుంటల స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. చెరువుల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోవడంతో ఆయా గ్రామాల్లో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. బోరుబావుల్లో నీటిమట్టాలు పడిపోవడంతో ఇటు పంటల సాగుకు, అటు ప్రజలకు తాగునీటికి కష్టాలు మొద లయ్యాయి. చెరువు కింద వ్యవసాయం చేసే రైతులు, బోరు బావులపై ఆధారపడి పంటలుసాగు చేద్దామని వరినార్లు పోసిపెట్టుకున్న రైతులకు ఈ సీజన్లో నష్టాలు తప్పడం లేదు. వరినాట్లు వేసే సమయం ముగిసిపోవడంతో చేసేది లేక నారుమడులను పొలంలోనే వదిలేశారు. మరోవైపు వచ్చే వేసవిలో తాగునీటి కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన చెరువులకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకలేదు. పూడికతీత, ముళ్లపొదలను తొల గించడం వంటి పనులు చేపట్టకపోవడంతో చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కీసర నూర్‌మహ్మద్ చెరువు ఒక్కసారి నిండితే ఐదేళ్లపాటు కాలం లేకున్నా నీరు ఉండేది. చెరువు కట్టకు షేడ (రంధ్రం) పోవడంతో వర్షకాలంలో చెరువులోకి వచ్చి చేరే వరద నీరు వచ్చినట్లే బయటకు పోతోంది. ఇక గోదుమకుంట తీగల నారాయణ చెరువు, చీర్యాల పెద్ద చెరువు, చీర్యాల నాట్కాన్ చెరువు, రాంపల్లి సూర్యనారాయణ చెరువు, యాద్గారపల్లి గండి చెరువు, రాంపల్లిదాయర జాఫర్‌ఖాన్ చెరువు, కీసర పెద్దమ్మ, తిమ్మాయిపల్లి పెద్ద చెరువు, దమ్మాయిగూడ నర్సింహ చెరువులకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు నిల్వ ఉండడం లేదు. ఇప్పటికైనా మరమ్మతులు చేపడితే భవిష్యత్తులో వర్షాలు కురిస్తే చెరువుల్లో నీరు నిల్వ ఉం టుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. -
సమస్యల ఒడిలో గురుకుల బడి
కీసర: ఒకప్పుడు ఆదర్శ విద్యాలయంగా పేరు సంపాదించిన ఆ గురుకుల పాఠశాల నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన సాగాల్సి ఉండగా అధ్వాన పరిస్థితుల్లో కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో 1978లో కీసరగుట్టలో గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే మొదట్లో సకల సౌకర్యాలతో అత్యుత్తమ బోధనతో ఆదర్శ గురుకుల విద్యాలయంగా పేరు గడించింది. రానురాను పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ఎప్పుడో 35 ఏళ్ల క్రితం కల్పించిన సౌకర్యాలు తప్పితే కొత్తగా చేసింది ఏమీ లేదు. ఒకప్పుడు ఐదు నుంచి పదో తరగతి వరకు 500 నుంచి 600 వరకు విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 370 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ఏళ్లక్రితం విద్యార్థులకోసం నిర్మించిన ఐదు డార్మెంట్ హాళ్లు అధ్వాన స్థితికి చేరాయి. కిటికీలు, తలుపులు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో విద్యార్థులు రాత్రి వేళ పడరానిపాట్లు పడుతున్నారు. దోమలు, ఈగల బాధకు తోడు చలికాలం, వర్షకాలంలో కంటికి కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో విద్యార్థులకోసం ఇచ్చిన మంచాలు తుప్పుపట్టి పోవడంతో మూలన పడేశారు. వాటిస్థానంలో ఇప్పటి వరకు కొత్తవి మంజూరు కాకపోవడం విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. ఇక పాఠశాలకు పక్కా ప్రహరీ లేకపోవడం కుక్కలు, పందులు, పశువులు పాఠశాల ఆవరణలోనే తిరుగుతున్నాయి. విషసర్పాలు డార్మింట్ రూమ్ సమీపంలోనే సంచరిస్తూ విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. డైనింగ్‌హాల్ సమీపంలోనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి. సరైన బాత్రూమ్లు, మరుగుదొడ్లు లేకపోవడం విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం చేస్తున్నారు. మంచినీటి సమస్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాఠశాలలో ఒకే ఒక్కబోరు ఉండటంతో నీటికోసం ప్రతిరోజు ఇబ్బందులు తప్పడంలేదు. ఉన్న ఒక్కబోరు చెడిపోతే విద్యార్థులు స్నానాలకోసం కీసరగుట్ట వేదపాఠశాల, పార్కు, టీటీడీ ధర్మశాల వద్దకు బకెట్లు పట్టుకొని పరుగులు తీయాల్సిందే. ఇక డైనింగ్‌హాల్, వంటగదిలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు భోజనపాట్లు అదనంగా తోడయ్యాయి. పేరుకే గురుకుల పాఠశాల అయినా కనీసం సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న కొద్దిపాటి వసతులు కూడా విద్యార్థులకు అందడం లేదు. అమ్మో ఆ స్కూలా..! ఒకప్పుడు ఇక్కడి పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపేవారు. నేటి పరిస్థితులను చూసి ఇక్కడ ఉండడానికి, చదవడానికి జంకుతున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చామా అని విద్యార్థులు.. తమ పిల్లలను ఎందుకు పంపించామా అని తల్లిదండ్రులు ఆవేదన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. మూడు సంవ త్సరాలుగా పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఇక్కడ చదవలేక వెనుదిరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా వికారాబాద్ ఆలంపల్లికి చెందిన విఘ్నేశ్వర్‌రెడ్డి ఐదో తరగతిలో అడ్మిషన్ పొంది వారం రోజులు తిరక్కముందే ఇక్కడి పరిస్థితులు చూసి మంగళవారం వెనుదిరిగాడు. ఈ మేరకు విద్యార్థితండ్రి మహిపాల్‌రెడ్డి పాఠశాల దయనీయ పరిస్థితులను స్వయంగా కలెక్టర్‌కు తెలియజేశారు. తమ బిడ్డను కూలీనాలి చేసైనా ఎక్కడైనా చదివిస్తాను తప్ప ఈ గురుకుల పాఠశాలలో మాత్రం చదివించనని స్పష్టం చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. కీసరగుట్ట గురుకులాన్ని జిల్లాలోనే ఆదర్శపాఠ శాలగా తీర్చిదిద్దుతామని దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు గుప్పిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. పూర్వ విద్యార్థులు అడపాదడపా విరాళాలు ఇస్తున్నా లెక్కలేకుండాపోయింది. విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి పాఠశాలకు పూర్వవైభవం తేవాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
గుట్టుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్
కీసర: రేషన్ బియ్యం రీసైక్లింగ్ గుట్టును అధికారులు రట్టు చేశారు. ఓ రైస్‌మిల్లుపై దాడి చేసి 650 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండల పరిధిలోని అహ్మద్‌గూడలో శుక్రవారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం నివాసి చంద్రమౌళి నిరుపేదలకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని కొన్నేళ్లుగా గ్రామాల నుంచి దళారుల ద్వారా సేకరిస్తున్నాడు. కీసర మండల పరిధిలోని అహ్మద్‌గూడలో ఉన్న ఓ రైస్‌మిల్లులో గుట్టుగా రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యాన్ని గురువారం లారీలో బహిరంగ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమవుతుండగా విశ్వసనీయ సమాచారంతో రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన బియ్యం, మార్కెట్‌కు తరలించేందుకు లారీలో ఉన్న బియ్యంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్‌జోన్ సివిల్ సప్లై అధికారి సురేష్ విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిమిత్తం బియ్యాన్ని ల్యాబ్ పంపినట్లు తెలిపారు. రైస్‌మిల్లును సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కీసర తహసీల్దార్ రవీందర్‌రెడ్డి తెలిపారు. -
బాలికపై వాచ్‌మన్ అత్యాచారయత్నం
కీసర, న్యూస్‌లైన్: ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఉన్మాది అత్యాచారయత్నం చేశాడు. చిన్నారి చాకచక్యంగా అతడి నుంచి తప్పించుకుంది. స్థానికులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం మండల పరిధిలోని రాంపల్లిలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రులు, ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం మండల పరిధిలోని రాంపల్లి గ్రామానికి వలస వచ్చారు. స్థానిక హరిజనవాడ సమీపంలోని ఓ సిమెంట్ ఇటుకల తయారీకేంద్రంలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు(8) స్థానికంగా మూడో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు ఉండడంతో బాలిక తమ్ముడితో కలిసి ఇంటి వద్దే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం బాలిక తల్లిదండ్రులు ఇటుకల ఆర్డర్ విషయమై సమీపంలోని మల్లాపూర్‌కు వెళ్లారు. రాంపల్లి సమీపంలోని ఓ వెంచర్లో వాచ్‌మన్‌గా పనిచేసే ఉత్తరప్రదేశ్వాసి విజయేంద్రమిశ్రా మద్యం మత్తులో గురువారం మధ్యాహ్నం ఇటుకల తయారీకేంద్రం వద్దకు వచ్చాడు. తమ్ముడితో కలిసి ఉన్న బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. విజయేంద్ర మిశ్రా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశాడు. భయాందోళనకు గురైన బాలిక అతడి నుంచి తప్పించుకొని గ్రామంలోకి పరుగులు తీసింది. అదే సమయంలో ఇటుకల తయారీకేంద్రానికి వస్తున్న బాలిక తల్లిదండ్రులు గమనించి ఏం జరిగిందని చిన్నారిని ఆరా తీశారు. ఏడుస్తూ బాలిక విషయం చెప్పింది. అక్కడి నుంచి పరారవుతున్న విజయేంద్ర మిశ్రాను బాలిక తల్లిదండ్రులు, స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
విద్యార్థిపై దాడి.. గొలుసు చోరీ
కీసర, న్యూస్‌లైన్: ఇంటర్ విద్యార్థిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి రెండు తులాల బంగారు గొలుసును అపహరించుపోయారు. ఈ సంఘటన శుక్రవారం మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుబ్బారావు కొన్నేళ్ల క్రితం కుటుంబంతో కీసర మండల తిమ్మాయిపల్లి గ్రామానికి వలస వచ్చాడు. గ్రామ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద హోటల్‌ను నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన కుమారుడు శ్రీనివాస్ నగరంలో ఇంటర్ చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో శ్రీనివాస్(21) హోటల్ సమీపంలోంచి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. పల్సర్ బైకుపై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారి ముఖాలకు మాస్క్‌లు ఉన్నాయి. శామీర్‌పేటకు ఎలా వెళ్లాలి..? అని శ్రీనివాస్‌ను అడిగారు. అంతలోనే బైకు పైనుంచి దిగిన ఇద్దరు అతడి ముఖంపై తీవ్రంగా దాడి చేశారు. శ్రీనివాస్‌ను కత్తితో బెదిరించి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. షాక్‌కు గురైన విద్యార్థి కొద్దిసేపటి తర్వాత కోలుకొని విషయాన్ని తన తండ్రికి తెలిపాడు. శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అపూర్వం.. అపురూపం!
కీసర, న్యూస్‌లైన్: అపూర్వ రీతిలో 150 మంది విద్యార్థులు స్వామి వివేకానంద వేషధారణలతో అపురూపంగా నిలిచారు. యువతకు వివేకాందుడు మార్గదర్శి అని, ఆయన బోధనలు అందరూ పాటించాలని వక్తలు సూచించారు. ఆదివారం శ్రీ వివేకానంద సెరినిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని చీర్యాల చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో చీర్యాల సెరినిటీ పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థులు వివేకానందుడి వేషధారణలో మానవ హారం నిర్వహించారు. సెరినిటీ పాఠశాల నుంచి విద్యార్థులు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. వివేకానంద వేషధారణలో విద్యార్థులు ర్యాలీగా నగరంలోని రామకృష్ణమఠం వరకు వెళ్లారు. విద్యార్థులు నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో నమోదయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం కీసర వెంకటసాయి థియేటర్లో ‘స్వామి వివేకానంద- ది యూత్ ఐకాన్’ డాక్యుమెంటరీ ప్రివ్యూను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ దర్శకుడు సురేష్ బుజ్జి మాట్లాడుతూ.. వివేకానందుడి ఆదర్శాలు, ఆశయాలు నేటి తరానికి కొంతమేరకైనా అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. డాక్యుమెంటరీలో సెరినిటీ పాఠశాలకు చెందిన 150 విద్యార్థులు నటించారని ఆయన చెప్పారు. చిత్ర దర్శకుడిని, నిర్మాత జీఆర్ రెడ్డిని చీర్యాల దేవాలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ముప్పురాంరెడ్డి, చీర్యాల సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ తదితరులు సత్కరించారు. అనంతరం చీర్యాల చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువత నడవాలని, దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మేడ్చల్ ఇన్చార్జి నక్కా ప్రభాకర్ గౌడ్, బీజేపీ నేత కొంపల్లి మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు నానునాయక్, ఖలీల్, అనిల్, బచ్పన్ స్కూల్స్ రాష్ట్ర డెరైక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కట్టుకున్న భార్యనే కడతేర్చాడు
కీసర,న్యూస్‌లైన్: మద్యానికి బానిసైన అతడు కట్టుకున్న భార్యను కడతేర్చాడు. వాటర్ హీటర్ తీగతో ఉరివేసి ఉసురుతీశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. నిందితుడు పారిపోయే యత్నం చేయగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కవాడీగూడ ప్రాంతానికి చెందిన నర్సింగ్‌రావు(42), హేమలత(38) దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దంపతులు ఏడాదిన్నరగా కీసర మండలం అహ్మద్‌గూడ పంచాయతీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉంటున్నారు. నర్సింగ్‌రావు నగరంలోని ఓ బ్యాంకులో ప్రైవేట్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. హేమలత నగరంలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. తాగుడుకు బానిసైన నర్సింగ్‌రావు భార్యను వేధించసాగాడు. ఈక్రమంలో పలుమార్లు హేమలత పుట్టింటికి వెళ్లగా నర్సింగ్‌రావు తిరిగి తీసుకొచ్చాడు. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన నర్సింగ్‌రావు ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఒంటిగంట సమయంలో వాటర్ హీటర్ వైరుతో ఆమెకు ఉరివేసి చంపేశాడు. ఉరి వేసిన ఆనవాళ్లు కనిపించకుండా హేమలత మెడకు జండూబామ్ రుద్దాడు. తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని ఇరుగుపొరుగును పిలిచాడు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో స్థానికులు అనుమానించి నర్సింగ్రావును నిలదీశారు. అతడు పారిపోయే యత్నం చేయగా పట్టుకొని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హేమలత మృతి విషయం తెలుసుకున్న ఆమె బంధువులు రాజీవ్ గృహకల్పకు చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. నర్సింగ్‌రావు మద్యం తాగుతూ, పిల్లలు కలగడం లేదని హేమలతను వేధించేవాడని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింగ్‌రావు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీ లు షురూ
కీసర, న్యూస్‌లైన్: వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులతో కీసరలో సందడి నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక సెరినీటి పాఠశాలలో శుక్రవారం 59వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఇక్కడి పోటీల్లో మంచి ప్రతిభ చూపి జాతీయ, అంతర్జాతీయస్థాయికి చేరుకోవాలన్నారు. ప్రతి క్రీడాకారుడు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రస్థాయి పోటీలు మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఖోఖో పోటీల్లో 23 జిల్లాల నుంచి బాలికలు, బాలుర విభాగంలో ఒక్కో జట్టు చొప్పున పాల్గొంటున్నాయన్నారు. మొత్తం 552 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారని, 130 మంది వ్యాయామఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులకు స్థానికంగా వసతి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అంతకు ముందు క్రీడాకారులు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో క్రీడా పోటీల రాష్ట్ర అబ్జర్వర్ విజయేందర్, శ్యాంసుందర్, టోర్నమెంట్ ఇన్చార్జి రమేష్‌రెడ్డి, తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎండీఓ నిరంజన్, ఎంఈఓ రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ చినింగని గణేష్, ఉపసర్పంచ్ రాయిల శ్రావన్కుమార్గుప్తా, కీసరగుట్ట దేవస్థానం చైర్మన్ తటాకం నారాయణశర్మ, కాంగ్రెస్ నేతలు తటాకం వెంకటేష్, పన్నాల బుచ్చిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు జ్యోతి సురేష్, కుర్రి మానస, రాజమణి పాల్గొన్నారు. మొదటి రోజు విజేతలు ఖోఖో పోటీల్లో మొదటిరోజు విజేతలుగా నిలిచిన జట్ల వివరాలను పోటీల ఇన్చార్జి రమేష్‌రెడ్డి వెల్లడించారు. బాలికల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టు మెదక్ జిల్లాపై, నల్గొండ జిల్లా జట్టు ఖమ్మంపై, మెదక్ జట్టు హైదరాబాద్ జిల్లా జట్టుపై, చిత్తూరు జట్టు పశ్చిమగోదావరి జట్టుపై, కరీంగనర్ జట్టు గుంటూరు జిల్లాపై, అనంతపురం జిల్లా జట్టు విజయనగరం జిల్లాపై గెలుపొందాయని వెల్లడించారు. బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు ఖమ్మంపై, మెదక్ జట్టు పశ్చిమ గోదావరిపై, నల్గొండ జట్టు కర్నూలుపై, కడప జట్టు గుంటూరుపై, ఆదిలాబాద్ టీం నెల్లూరుపై, తూర్పు గోదావరి జట్టు వరంగల్ జిల్లా జట్టుపై విజయం సాధించాయన్నారు. -
బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
కీసర, న్యూస్‌లైన్: ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం మండల పరిధిలో వెలుగుచూసింది. కళాశాల విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసరగుట్ట సమీపంలో ఉన్న హస్విత ఇంజినీరింగ్ కళాశాలలో వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన వెంకటేష్(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు కాలేజీ అనుబంధ హాస్టల్లో ఉంటున్నాడు. ఇటీవల దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థి గురువారం తిరిగి హాస్టల్‌కు వచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో వెంకటేష్ హాస్టల్ నుంచి బయటకు వె ళ్లాడు. కొద్దిసేపటి తర్వాత క్యాంపస్‌కు వచ్చిన అతడు గేట్లోకి ప్రవేశించగానే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నోట్లో నుంచి నురగలు వచ్చాయి. విద్యార్థులు గమనించి వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాలేజీలో వార్డెన్ గాని, ఇన్చార్జి గాని లేకపోవడంతో విద్యార్థులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నాగారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. వెంకటేష్‌ను ఏదైనా విషసర్పం కాటేసిందా..? లేదా అతడే ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? అనే విషయం తెలియరాలేదు. తనకు ఈ కాలేజీలో చదవడం ఇష్టం లేదని వెంకటేష్ తరచూ తమతో వాపోయేవాడని తోటి విద్యార్థులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వరంగల్ నుంచి వెంకటేష్ తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని అప్పగించారు. విద్యార్థుల ఆందోళన బీటెక్ విద్యార్థి వెంకటేష్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ టీజేఏసీ నాయకులు గంధం రాజశేఖర్, అశోక్, కిరణ్‌గౌడ్ తదితరులు శుక్రవారం కళాశాల క్యాంపస్‌కు చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కాలేజీ హాస్టల్లో సరిగా వసతులు లేవని మండిపడ్డారు. సరైన భోజనం లేక విద్యార్థులు పలుమార్లు అస్వస్థతకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకొని విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎంతకూ కాలేజీ యాజ మాన్యం స్పందించలేదు. విద్యార్థి మృతి విషయమై కీసర పోలీసులను వివరణ కోరగా.. వెంకటేష్ తల్లిదండ్రులు గాని కాలేజీ యాజమాన్యం గాని తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. -
బైక్‌ను ఢీకొట్టిన కారు ఇద్దరి దుర్మరణం
కీసర, న్యూస్‌లైన్: చిన్ననాటి నుంచి మురిపెంగా పెంచిన పెద్దమ్మను, అంతే బాధ్యతగా ఆమె బాగోగులు చూసిన కుమారుణ్ని.. కారు రూపంలో మృత్యువు కబళించింది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శామీర్‌పేట మండలం తూంకుంట గ్రామానికి చెందిన ఆవుల రమేష్‌యాదవ్(43) బతుకుదెరువు నిమ్తితం ఆరే ళ్లక్రితం కీసర మండలం రాంపల్లి గ్రామానికి వలస వచ్చాడు. ఇక్కడి ఆర్ఎల్ నగర్లో పశుపోషణ చేపట్టి కాలం వె ళ్లదీస్తున్నాడు. కాగా ఆదివారం ఇంట్లో ఓ శుభకార్యం ఉండగా తూంకుంటలో ఉంటున్న రమేష్ యాదవ్ పెద్దమ్మ వెంకటమ్మ (63) అతని ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం వెంకటమ్మను శామీర్‌పేట తూంకుంట వద్ద దింపేందుకు తన బైక్‌పై ఆర్‌ఎల్‌నగర్ నుంచి బయలుదేరాడు. కాగా కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోకి రాగానే అక్కడ ఉన్న ఓ మలుపువద్ద ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటమ్మ, రమేష్యాదవ్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ‘108’లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో వారిద్దరు మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా రమేష్‌యాదవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, వెంకటమ్మకు ఆరుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా రమేష్‌యాదవ్‌ను వెంకటమ్మే పెంచి పెద్ద చేసిందని, వీరిద్దరూ ఒకేరోజు మృత్యువాత పడడం తమను కలచివేసిందని స్థానికులు కంటతడిపెట్టారు. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారని తెలిపారు. ప్రమాదాలకు నిలయం కీసర- శామీర్‌పేట ర హదారిలో తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఉన్న రోడ్డు మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయని స్థానికులు చెబుతున్నారు. ఈ మలుపుల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొని ప్రయాణికులు మృత్యువాతపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి మలుపులు తగ్గించాలని, రోడ్డుకిరువైపులా పెంచిన హుడా చెట్లను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.