
కీసరలో వైభవంగా రుద్రాభిషేకం
కీసర: ప్రఖ్యాతశైవ క్షేత్రమైన కీసర గుట్ట శ్రీభవానీరామలింగేశ్వర స్వామి సన్నిదిలో సోమవారం నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఉదయం గర్బాలయంలో కొలువైన శ్రీస్వామివారికి రుద్రాభిషేకం అనంతరం భక్తులు సాముహిక అభిషేకాల్లో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో స్వామివారికి పల్లకీసేవను నిర్వహించారు. ఆలయ ఛైర్మెన్ తటాకం ఉమాపతిశర్మ, భక్తులు తదితరులుపాల్గొన్నారు.