Exposition
-
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్‌లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్‌తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్‌పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్‌లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్‌పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
వైభవంగా తాజ్‌క్రిష్ణలో ట్రెండ్ ఎగ్జిబిషన్
-
బతుకమ్మను వైభవంగా నిర్వహించాలి
కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: బతుకమ్మ పండుగను జిల్లాలో వైభవంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. ఈ నెల 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు బతుకమ్మ పండుగ నిర్వహణపై గురువారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఆధాధ్య దైవమైన ప్రకృతి పండుగ బతుకమ్మను అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ శాఖల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. నగరంలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించాలని; బతుకమ్మ ఆడే ప్రదేశాలలో విద్యుద్దీపాలు, తాగునీరు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నగర పాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. నగరంలో ఈ నెల 30 వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పండుగ నిర్వహణ షెడ్యూల్ రూపొందించినట్టు తెలిపారు. నగరంతో పాటు అన్ని మండలాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం, భద్రాచలంలో వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ దివ్య, డీఆర్వో శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ మారుపాక నాగేశ్, ఏడీ ముర్తుజా, సీపీఓ రాందాస్, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రాజేందర్, డీఎస్పీ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ ఇలా... - 30న మెప్మా, బీసీ వెల్ఫేర్, ఎన్పీడీసీఎల్ శాఖల ఆధ్వర్యంలో ఆటాపాట. - అక్టోబర్ 1న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో. - 2న జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో. - 3న పోలీస్, ఫైర్, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల ఆధ్వర్యంలో. - 4న కలెక్టరేట్ ఆవరణలో అన్ని శాఖల ఆధ్వర్యంలో. - 5న సంక్షేమ భవన్‌లోని అన్ని శాఖలు, సమాచార శాఖ ఆధ్వర్యంలో. - 6న మున్సిపల్, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో. - 7న జిల్లాపరిషత్, పరిశ్రమలు, మత్స్య శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో. - 8న అన్ని శాఖల సమన్వయంతో కాల్వొడ్డులోని నయాబజార్ కళాశాల ఆవరణలో పెద్దఎత్తున ఆటాపాట. బాణసంచా వెలుగుల్లో బతుకమ్మ సంబురాల నిర్వహణ. -
వైభవంగా జగన్నాథ రథయాత్ర
నందిపేట : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తి కీర్తనలతో గ్రామం మారుమోగిపోయింది. అందంగా అలంకరించిన రథం గ్రామంలోని వీరాంజనేయ మందిరం నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా యోగేశ్వర మందిరం వరకు సాగింది. దారి వెంబడి భక్తులు కీర్తనలు చేస్తూ భక్తి పాటలు పాడారు. మహిళలు మంగళహారతులతో జగన్నాతునికి స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి 108 రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిగా జనం ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
రామయ్యకు వైభవంగా స్వర్ణ పుష్పార్చన
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి ఆదివారం వైభవంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకోచ్చి అంతరాయంలో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో అర్చన, అష్టోత్తర శతనామార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన సింహాసనంపై వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి, అమ్మవారికి కంకణధారణ గావించి, స్వామివారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవోపేతంగా రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. శని, ఆదివారం వరుస సెలవు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భద్రాచలం వచ్చారు. ఉదయం పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలై¯ŒSలో బారులు తీరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రామయ్య కల్యాణం
భద్రాచలం:భద్రాద్రి రాముడికి శుక్రవారం నిత్యకల్యాణం వైభవంగా జరిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలతో భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి నిత్య కల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేన పూజాది కార్యక్రమాలు నిర్వహించి కల్యాణం జరిపించారు. రామాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీతాయారమ్మ వారికి శ్రావణమాసపు శుక్రవారం సందర్భంగా ఉదయం పవిత్ర గోదావరి నదీ జలాలు, నారికేళ జలాలు, హరిద్రాచూర్ణాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు, పదిరకాల పుష్పాలతో అభిషేకాలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చన చేశారు. స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహం ఐదో రోజు కూడా కొనసాగింది. ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గ్రామ దేవతల బోనాలు
ఆలయాలకు పోటెత్తిన భక్తులు ఆయా గ్రామాల్లో వైభవంగా బోనాలు చేవెళ్ల రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని ఆలూరు, దామరగిద్ద, వెంకన్నగూడ, గుండాల, రేగడిఘనాపూర్ గ్రామాల్లో బోనాల పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు పెద్ద ఎత్తున పోచమ్మ, దుర్గమ్మ, ఈదమ్మ, ఉప్పలమ్మ, మైసమ్మ దేవతలకు పూజలు చేశారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు పూనకాలు ఆకట్టుకున్నాయి. కందుకూరు: మండల పరిధిలోని ఆకులమైలారం, ముచ్చర్ల, బేగంపేట గ్రామాల్లో ఆదివారం మహంకాళీ బోనాలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాల్లో డప్పు వాయిద్యాల నడుమ మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
కీసరలో వైభవంగా రుద్రాభిషేకం
కీసర: ప్రఖ్యాతశైవ క్షేత్రమైన కీసర గుట్ట శ్రీభవానీరామలింగేశ్వర స్వామి సన్నిదిలో సోమవారం నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఉదయం గర్బాలయంలో కొలువైన శ్రీస్వామివారికి రుద్రాభిషేకం అనంతరం భక్తులు సాముహిక అభిషేకాల్లో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో స్వామివారికి పల్లకీసేవను నిర్వహించారు. ఆలయ ఛైర్మెన్ తటాకం ఉమాపతిశర్మ, భక్తులు తదితరులుపాల్గొన్నారు. -
వైభవంగామహంకాళి బోనాలు
-
వైభవంగా త్రిశూల, చక్రస్నానం
తాళ్లపాక(రాజంపేట) తాళ్లపాక గ్రామంలో శనివారం శ్రీ సిద్దేశ్వరస్వామికి వసంతోత్సవం, త్రిశూలస్నానం నిర్వహించారు. శ్రీ చెన్నకేశవస్వామికి అన్నమాచార్య ధ్యానమందిరం ఆవరణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై చక్రస్నానం నిర్వహించారు. అంతకముందుగా వసంతోత్సవం రాత్రి ధ్వజావరోహణం నిర్వహించారు. శ్రీ సిద్దేశ్వర, శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి జరిగే పూజల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. టీటీడీ వేదపండితుల నేతృత్వంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం శ్రీ సిద్దేశ్వరస్వామి, చెన్నకేశవస్వామికి ఆదివారం ఉదయం స్నపన తిరుమంజనం, హోమం, రాత్రికి పుష్పయాగం నిర్వహించనున్నారు. -
వైభవంగా రథోత్సవం
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వరోజు బుధవారం భక్తుల కోలాహాలం మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా రథాన్ని శుభ్రపరిచి మామిడాకులు, రంగురంగుల పూలతో అలంకరించారు. కళశానికి పూజలునిర్వహించి రథం పైభాగాన అమర్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి ఉత్సవమూర్తులను ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో రథంపైకి చేర్చారు. బూడిద గుమ్మడి కాయలను నాలుగు రథచక్రాల వద్ద ఉంచారు. వందల సంఖ్యలో హాజరైన భక్తులు గోవింద నామస్మరణల మధ్య రథాన్ని ముందుకు కదిలించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ రథోత్సవంలో చెక్కభజన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రహ్మోత్సవ కమిటీ చైర్మన్ యెద్దుల సుబ్బరాయుడు, ఆలయ ప్రతినిధి పల్లె సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
గోల్కొండ కోటలో వైభవంగా బోనాలు
-
వైభవంగా ప్రణయ కలమహోత్సవం
-
ద్వారకా తిరుమలలో వైభవంగా మాస తిరుకళ్యాణం
-
గోవిందా..గోవిందా..!
కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుతున్నాయి. ప్రధాన ఘట్టమైన అలంకారోత్సవం మంగళవారం రాత్రి కనులపండువగా సాగింది. ఆత్మకూర్ ఎస్బీహెచ్ లాకర్లో భద్రపర్చిన స్వామివారి ఆభరణాలను బయటకు తీసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. పోలీసు బందోబస్తు మధ్య చిన్నచింతకుంట మండలం కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా అమ్మాపురం సంస్థానాధీశులు రాజాసోంభూపాల్ ఇంటికి చేర్చారు. ఒక్కసారిగా గోవిందా.. నామస్మరణ మారుమోగింది. ఆనవాయితీ ప్రకారం ముక్కెర వంశీయులు రాజా శ్రీరాంభూపాల్ ఇంటిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అమ్మాపురం గ్రామానికి చెందిన నంబి వంశస్తులు అంభోరుమధ్య కాలినడకన కురుమూర్తి కొండకు చేర్చారు. ముత్యాలు, పడగాలు, పచ్చలు, కెంపులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన ఏడువారాల నగలను శ్రీనివాసుడికి అలంకరించడంతో స్వర్ణకాంతులతో కాంచనగృహ పులకరించిపోయింది. చిన్నచింతకుంట : తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవమైన శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అలంకరణోత్సవంలో స్వామివారి నామస్మరణం మార్మోగింది. మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆత్మకూర్ నుం చి మేళతాళాలతో ప్రారంభమైన ఆభరణా ల ఊరేగింపు పరమేశ్వరుడి చెరువు కట్ట వ రకు చేరింది. అక్కడ పూజలు చేసిన అనంతరం పోలీసు కాన్వాయ్‌లో చిన్నచింతకుం ట మండలం కొత్తపల్లి నుంచి దుప్పల్లికి చేరుకుంది. గ్రామస్తులు, పెద్దఎత్తున స్వామివారి నామస్మరణం చేస్తూ స్వాగతం పలి కారు. స్థానిక రామాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అక్క డి నుంచి ఊరేగింపు అమ్మాపురం చేరుకుం ది. ఆనవాయితీ ప్రకారం ముక్కెర వంశీ యులు రాజా శ్రీరాంభూపాల్ ఇంటిలో గంటన్నర పాటు ప్రత్యేక పూజలు జరిగా యి. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆభరణాలను దర్శించుకున్నారు. అనంతరం నంబి వంశస్తులు ఆభరణాలను తలపై పెట్టుకొని కాలిననడకన కురుమూర్తి కొండలకు బయలు దేరారు. ప్రధాన ఆల యంలో ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మె ల్యే ఆల దంపతులు, ఏసీ శ్రీనివాసమూర్తి, ఆలయ ఈఓ గురురాజ, అధికారుల సమక్షంలో అభరాణాలు కీరిటం, హస్తాలు, పాదుకలు, కోర మీసా లు, కెంపు, ముత్యాలహారం, కనకహారాలతో పాటు ఇతర ఆభరాణాలను ప్రధాన పూజారులు వెంకటేశ్వర్లకు అందజేయగా ఆయన కాంచన గృహ లో కొలువుదీరిన శ్రీనివాసుడికి అలంకరిం చారు. స్వర్ణ కాంతులతో కాంచన గృహ పులకరించింది. రాత్రి 10 గంటలకు స్వామివారికి అశ్వవాహన సేవను ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మోగి స్తుండగా అర్చకులు మంత్రోర్చన చేశారు. దాసులు, స్వామి వారిని భూజన పెట్టుకొని ప్రధాన మెట్ల గుండా ముఖద్వారం వరకు ఊరేగించారు. పూజా కార్యక్రమాల్లో ముక్కెరవంశపు రాజువారసుడు శ్రీరాంభూపాల్, ఎంపీపీ క్రాంతిఆంజనేయులు, జిల్లా పరి షత్ సభ్యురాలు లక్ష్మీ ప్రభాకర్, వైస్ ఎంపీ పీ సులోచన సత్యనారాయణగౌడ్, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
‘జన’సరోవరం
=పంచమి తీర్థానికి పోటెత్తిన భక్తులు =నేత్రపర్వంగా చక్రస్నానం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమితీర్థ (చక్రస్నానం) మహోత్సవం శనివారం అమ్మవారి పుష్కరిణిలో నేత్రపర్వంగా జరిగింది. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి స్వయంగా తన కుంతాయుధంతో తవ్విన పద్మసరోవరం(పుష్కరిణి)లో కార్తీక మాసం, శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాడ నక్షత్రం రోజున స్వర్ణకమలంలో పద్మావతీదేవిగా అమ్మవారు అవతరిం చారు. ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. తిరుచానూరు, న్యూస్‌లైన్: అమ్మవారు ఆవిర్భవించిన పద్మసరోవరంలో ప్రతి ఏటా నిర్వహించే పంచమితీర్థం రోజున స్నానమాచరిస్తే సకల పాపాలు హరిం చుకుపోయి కోటిజన్మల పుణ్యఫలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా పద్మావతీ అమ్మవారిని శనివారం వేకువజాము 3.30 గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారికి పల్లకీ వాహన సేవ జరిగింది. అమ్మవారు, చక్రతాళ్వార్లను సన్నిధి నుంచి వేంచేపుగా పుష్కరిణిలోని పంచమితీర్థం మం డపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. తిరుమల నుంచి వచ్చిన సారెతో ఉదయం 10.30 గంటల నుంచి అమ్మవారు, చక్రతాళ్వార్లకు నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వైభవంగా చక్రస్నానం స్నపన తిరుమంజనం అనంతరం చక్రతాళ్వార్లను పుష్కరిణిలోకి తీసుకొచ్చి, 12.12 గంటలకు ధనుర్లగ్నంలో చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పద్మసరోవరంలో పవిత్ర స్నానమాచరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరిబాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో గోపాలకృష్ణ, ఏఈవో నాగరత్న పాల్గొన్నారు.