వైభవంగా జగన్నాథ రథయాత్ర
Published Mon, Sep 19 2016 4:23 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
నందిపేట :
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తి కీర్తనలతో గ్రామం మారుమోగిపోయింది. అందంగా అలంకరించిన రథం గ్రామంలోని వీరాంజనేయ మందిరం నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా యోగేశ్వర మందిరం వరకు సాగింది. దారి వెంబడి భక్తులు కీర్తనలు చేస్తూ భక్తి పాటలు పాడారు. మహిళలు మంగళహారతులతో జగన్నాతునికి స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి 108 రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిగా జనం ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Advertisement
Advertisement