కీసర: ఔటర్ రింగ్ రోడ్డుపై పలువురు విద్యార్థులు బుధవారం బైక్ రేసింగ్‌కు పాల్పడ్డారు. సీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కీసర ఔటర్‌రింగ్ రోడ్డుపై మధ్యాహ్నం సమయంలో 13 మంది విద్యార్థులు స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే పసిగట్టిన విద్యార్థులు పరారయ్యారు.
కాగా సంఘటనా స్థలంలో ఉన్న మూడు యాక్టివా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. కాగా రేసింగ్‌కు పాల్పడిన విద్యార్థులు కీసర మండలంలో ఉన్న పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న వారని పోలీసులు తెలిపారు. వీరంతా నగరంలోని ఈసీఐఎల్ ప్రాంతంలో ఉంటున్నవారు. స్వాధీనం చేసుకున్న వాహనాల నంబర్ల ఆధారంగా విద్యార్థులను పట్టుకొని కౌన్సెలింగ్ చేస్తామని సీఐ తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
‘ఔటర్’పై బైక్ రేసింగ్
Published Wed, Nov 26 2014 11:11 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement