రంగారెడ్డి జిల్లా కీసర మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మొదటగా ఓటును కొండాపూర్ ఎంపీటీసీ జ్యోతి వేశారు. ఇక్కడ మొత్తం 149 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.