నందిగామ: విజయవాడ-హైదరాబాద్ హైవేలో కృష్ణాజిల్లా కీసర టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వచ్చిన వారు తిరిగి వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాదు వెళ్తున్న వాహనాలతో ఇక్కడ రద్దీ ఏర్పడింది. సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది రద్దీ కారణంగా టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోల్‌ప్లాజాలో పోలీసులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 5200 వాహనాలు ఈ టోల్‌ప్లాజా ద్వారా వెళ్లినట్లు టోల్ గేటు సిబ్బంది వెల్లడించారు. సాయంత్రానికి 15000 వేలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment