Vehicles rush
-
టోల్ ప్లాజాకు ‘పండుగ’
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మూడు రోజులు గా పెద్ద ఎత్తున ప్రజలు తమ స్వగ్రామాలకు తరలివెళుతు న్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా నుంచి రికార్డు స్థాయిలో వాహనాలు వెళ్లాయి. 12వ తేదీన ఇరువైపులా 56,595 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఇందు లో కార్లు 42,844, ఆర్టీసీ బ స్సులు 1,300, ప్రైవేట్ బస్సు లు 4,913, గూడ్స్ వాహనాలు 7,538 ఉన్నాయి. 13వ తేదీన 67,577 వాహనాలు ఇరుమార్గాల్లో వెళ్లాయి. ఇందులో కార్లు 53,561, ఆర్టీసీ బస్సులు 1,851, ప్రైవేట్ బస్సులు 4,906, అలాగే 7,259 గూడ్స్, ఇతర వాహనాలు రాకపోకలు సాగించాయి. 11 ఏళ్లలో ఇదే మొదటిసారి: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని 4 వరుసలుగా మార్చిన తర్వాత 11 ఏళ్ల కాలంలో ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించడం ఇదే మొదటిసారని అంటున్నారు. సాధారణ రోజుల్లో పంతంగి టోల్‌ప్లాజా నుంచి రోజుకు 30 వేల నుంచి 40 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముందస్తు జాగ్రత్తలు: సంక్రాంతి పండుగకు ఈ రహదారిగుండా పెద్ద సంఖ్యలో ప్రజానీకం వెళ్తుండటంతో పోలీసులు, జీఎమ్మార్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పంతంగి టోల్‌ప్లాజా, గ్రామాల కూడళ్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించారు. -
కీసర టోల్‌ప్లాజా వద్ద పెరుగుతున్న వాహనాల రద్దీ
నందిగామ: విజయవాడ-హైదరాబాద్ హైవేలో కృష్ణాజిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వచ్చిన వారు తిరిగి వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాదు వెళ్తున్న వాహనాలతో ఇక్కడ రద్దీ ఏర్పడింది. సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది రద్దీ కారణంగా టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోల్‌ప్లాజాలో పోలీసులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 5200 వాహనాలు ఈ టోల్‌ప్లాజా ద్వారా వెళ్లినట్లు టోల్ గేటు సిబ్బంది వెల్లడించారు. సాయంత్రానికి 15000 వేలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. -
టోల్‌ప్లాజాల వద్ద నిలిచిన వాహనాలు
-
టోల్‌ప్లాజాల వద్ద నిలిచిన వాహనాలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫీజుల రద్దు గడువు శుక్రవారం అర్థరాత్రితో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్గేట్ సిబ్బంది పాత నోట్లు రూ.500 తీసుకోకపోవటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చిల్లర కోసం వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్‌ప్లాజాల్లో ఏర్పాటుచేసిన స్వైపింగ్ మెషిన్లు మొరాయిస్తున్నాయి. దీంతో వాహనదారుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. స్వైపింగ్ మెషిన్లు ద్వారా టోల్‌ఫీజు వసూలు చేస్తున్న కేంద్రాల్లో ఎక్కువ సమయం పడుతుండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నల్లగొండ జిల్లా పంతంగి టోల్గేట్తో పాటు కృష్ణాజిల్లా కీసర వద్ద భారీగా వాహనాలు నిలిచాయి. -
టోల్గేట్లకు వాహనాల తాకిడి
చౌటుప్పల్/షాద్‌నగర్/అడ్డాకుల: టోల్గేట్లకు ఆదివారం వాహనాల తాకిడి పెరిగింది. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లిన వారు నగరబాట పట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పదిరోజుల సెలవులు ముగియడంతో సొంతూర్లకు వెళ్లిన వారంతా హైదరాబాద్ పయనమయ్యారు. విజయవాడ- హైదరాబాద్, హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారులపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై సాధారణ రోజుల్లో రోజుకు 20వేల వాహనాలు తిరుగుతుండగా.. ఆదివారం ఒక్కరోజే 30 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. హైవేలపై ఉన్న టోల్‌ప్లాజాలకు వాహనాల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండల పరిధిలోని జీ ఎంఆర్ టోల్ ప్లాజా వద్ద జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రహదారి ఆదివారం రాత్రి 9.30 నుంచి 10గంటల ప్రాంతంలో కిక్కిరిసిపోయింది. సుమారు కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో టోల్‌గేట్‌కు ఉన్న నాలుగు గేట్లతోపాటు వీఐపీ దారిని కూడా తెరిచారు. అలాగే కర్నూలు వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలతో అడ్డాకుల మండలం శాఖాపూర్ ఎల్అం డ్‌టీ టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రద్దీతో టోల్‌ప్లాజా నిర్వాహకులకు కాసులవర్షం కురిసింది.