
టోల్‌ప్లాజాల వద్ద నిలిచిన వాహనాలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫీజుల రద్దు గడువు శుక్రవారం అర్థరాత్రితో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అన్ని టోల్ప్లాజాల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
టోల్‌గేట్ సిబ్బంది పాత నోట్లు రూ.500 తీసుకోకపోవటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చిల్లర కోసం వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ప్లాజాల్లో ఏర్పాటుచేసిన స్వైపింగ్ మెషిన్లు మొరాయిస్తున్నాయి. దీంతో వాహనదారుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. స్వైపింగ్ మెషిన్లు ద్వారా టోల్‌ఫీజు వసూలు చేస్తున్న కేంద్రాల్లో ఎక్కువ సమయం పడుతుండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నల్లగొండ జిల్లా పంతంగి టోల్‌గేట్తో పాటు కృష్ణాజిల్లా కీసర వద్ద భారీగా వాహనాలు నిలిచాయి.