special counters
-
కీసర టోల్‌ప్లాజా వద్ద పెరుగుతున్న వాహనాల రద్దీ
నందిగామ: విజయవాడ-హైదరాబాద్ హైవేలో కృష్ణాజిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వచ్చిన వారు తిరిగి వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాదు వెళ్తున్న వాహనాలతో ఇక్కడ రద్దీ ఏర్పడింది. సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది రద్దీ కారణంగా టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోల్‌ప్లాజాలో పోలీసులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 5200 వాహనాలు ఈ టోల్‌ప్లాజా ద్వారా వెళ్లినట్లు టోల్ గేటు సిబ్బంది వెల్లడించారు. సాయంత్రానికి 15000 వేలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. -
‘నోటు’కష్టం..
-
'భూ వివాదాలను నెలాఖరులోపు పరిష్కరించాలి'
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కర్నూలు సిటీ: ఎస్సీ, ఎస్టీల భూ వివాదలపై వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 31లోపు పరిష్కరించాలని ఎస్టీ, ఎస్టీ కమిషన్ చెర్మన్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. మొదట జిల్లాలో భూ వివాద సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ భూ దురాక్రమణల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. కారణాలు చూపకుండా ఫిర్యాదు వచ్చిన వెంటనే నిర్దేశించిన గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. వివాదాస్పద భూముల్లో ఇతరులకు పట్టాలు ఇస్తే చర్యలు తప్పవన్నారు. జేసీ కోర్టులో ఇలాంటి వివాదాలకు పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ఓర్వకల్లు మండలంలో సాగు చేసుకుంటున్న భూములపై విచారణ చేసి న్యాం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూములను సేకరించాలన్నారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. వివాదాలపై ఫిర్యాదులు వస్తే ఆ కాపీతో పాటు పరిష్కారాన్ని నివేదిక రూపంలో కమిషన్‌కు పంపాలన్నారు. ప్రత్యేక కౌంటర్లలో 188 ఫిర్యాదులు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ భూముల వివాదాలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు ఈ నెల 1 నుంచి 10 తేది వరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని జేసీ హరికిరణ్ తెలిపారు. ఈ కేంద్రాలకు మొత్తం 188 ఫిర్యాదులు రాగా, ఇప్పటికే 60 పరిష్కరించామన్నారు. అధికారులు ప్రజా సాధికార సర్వేలో ఉండడం వల్ల మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెల 4వ సోమవారం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ భూముల వివాదాలపై విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత 17 నెలల కాలంలో ఈ సమావేశాలకు 950 ఫిర్యాదులు రాగా 856 అర్జీలు పరిష్కారం అయ్యాయన్నారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు కమిషన్ చైర్మెన్ కారెం శివాజీకి వినతులు ఇచ్చారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డీఆర్ఓ గంగాధర్ గౌడు, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ’ బియ్యం కొనే వారేరీ?
ప్రత్యేక కౌంటర్లలో తక్కువ ధరకు విక్రయిస్తున్నా అమ్మకాలు అంతంత మాత్రమే ప్రజల్లో అవగాహన కల్పించని సర్కారు పలు చోట్ల అందుబాటులో లేని కౌంటర్లు 5 నెలల్లో విక్రయించింది 12 వేల క్వింటాళ్లే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బియ్యం ధరల నియంత్రణతో పాటు సాధారణ ప్రజలకు మేలు రకం బియ్యం తక్కువ ధరకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లతో ప్రయోజనం కనిపించడం లేదు. ఈ ప్రత్యేక కౌంటర్లపై సాధారణ ప్రజలకు అవగాహన లేకపోవడం, ప్రభుత్వం కూడా పెద్దగా ప్రచారం కల్పించకపోవడం, సరైన చోట్ల, సరైన సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో వాటిని వినియోగించుకునే వారే కరువయ్యారు. దాదాపు ఐదు నెలల్లో మొత్తంగా 337 కౌంటర్ల ద్వారా కేవలం 12 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయం మాత్రమే జరగడం దీనిని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఫైన్ రకం బియ్యం ధరలను వ్యాపారులు ఇష్టారీతిగా పెంచే అవకాశాన్ని ముందుగానే పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఈ ఏడాది జూన్‌లోనే తగిన చర్యలు చేపట్టింది. పొరుగు రాష్ట్రాల్లో మేలు రకం బియ్యానికి మంచి ధర లభించడంతో గతంలో రైస్‌మిల్లర్లు అక్కడికి తరలించి రాష్ట్రంలో కొరత సృష్టించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని... ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు సామాన్య, మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని, రైస్‌మిల్లర్లతో చర్చించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలను అధికారులు చేపట్టారు. ఇలా జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని పది జిల్లాల్లో 337 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మేలు రకం సోనామసూరి బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తుండగా.. ‘ప్రభుత్వ’ కౌంటర్లలో కిలో రూ. 35కే అందిస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక కౌంటర్లపై ప్రజలకు అవగాహన కొరవడటంతో.. విక్రయాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ కేంద్రాల ద్వారా దాదాపు 23 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయాలు సాగగా... అందులో ఆగస్టు మొదటి వారానికి 335 కౌంటర్ల ద్వారా 11 వేల క్వింటాళ్లు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు ఐదు నెలల కాలంలో 337 కౌంటర్ల ద్వారా కేవలం 12 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయాలు మాత్రమే జరిగాయి. సోనామసూరి ధరలు అధికంగా ఉన్న హైదరాబాద్‌లో కేవలం 1,173 క్వింటాళ్ల బియ్యం విక్రయాలు జరుగగా.. మహబూబ్‌నగర్‌లో 777, మెదక్‌లో 1,266, ఆదిలాబాద్‌లో 1,371 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలో మాత్రం 60 కేంద్రాల ద్వారా అత్యధికంగా 8,085 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ప్రత్యేక కౌంటర్లు 20కు మించి లేకపోవడంతో విక్రయాలు బాగా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా జిల్లాల్లో అసలు బియ్యం కౌంటర్ల ఏర్పాటుపై అవగాహన లేకపోవడం కారణంగా చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో వరి సాగు 28 శాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో... బియ్యం ధరలకు రెక్కలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి. -
రైతు బజార్లలో నాణ్యమైన ఉల్లి
కాకినాడ సిటీ: నాణ్యమైన ఉల్లిపాయలను తక్కువ ధరకే విక్రయించేందుకు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఎస్టేట్ ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన శుక్రవారం రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో ఉల్లి, బియ్యం ధరల నియంత్రణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని రకాల ఉల్లిపాయలను తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచుతూ రకాల వారీగా ధరల బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆయన ఆదేశించారు. రోజుకు ఎంత స్టాకు ఉంచుతున్నారు. ఎంత విక్రయించారు అనే వివరాలను ప్రతీ రోజు తనకు అందజేయాలని ఆదేశించారు. ఉల్లి నిల్వల అవసరాలను మూడు, నాలుగు రోజుల ముందే తెలిపితే స్థానిక హోల్‌సేల్ డీలర్లతో ఆర్డీఓలు మాట్లాడి సరఫరా జరిగేట్లు చర్యలు తీసుకుంటారన్నారు. అవసరమైతే కర్నూలు, మహారాష్ర్టల నుంచి నేరుగా రప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతు బజార్ కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయిస్తున్న నాణ్యమైన సన్నరకం బియ్యానికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందన్నారు. అన్ని రైతు బజార్లలో తగిన పరిమాణంలో ఈ బియ్యం నిల్వలు ఎల్లప్పుడూ ఉండేలా చూడాలని ఆదేశించారు. రైతుబజార్లలో పారిశుధ్య లోపం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. షెడ్లకు మరమ్మతులు అవసరమైతే వెంటనే ప్రతిపాదించాలని కోరారు. కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందిన 22 మందికి జిల్లాలోని వివిధ రైతు బజార్లలో ఖాళీగా ఉన్నషాపులను కేటాయించాలని ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టీవీఎస్‌జీ కుమార్ పాల్గొన్నారు. -
‘ఉల్లి’కి కళ్లెం
రంగంలోకి మార్కెటింగ్ శాఖ రేపటి నుంచి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఒక్కొక్కరికి 2 కేజీల చొప్పున విక్రయం సాక్షి, సిటీబ్యూరో: ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీటి ధరలకు కళ్లెం వేసేందుకు ఎట్టకేలకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు సరసమైన ధరకు విక్రయించాలని మార్కెటింగ్ శాఖ ఇన్చార్జి కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని రైతుబజార్లలో ఉల్లి స్టాక్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా కొరత రాకుండా చూడడంతోపాటు ధరలు పెరగకుండా నియంత్రించవచ్చని సూచించారు. నగరంలోని అన్ని రైతుబజార్లలో సోమవారం నుంచి ప్రత్యేకంగా కౌంటర్లను ప్రారంభించనున్నారు. మలక్‌పేటలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో పెద్దమొత్తంలో ఉల్లిని సేకరించి నో లాస్... నో ప్రాఫిట్ ప్రాతిపదికన రైతుబజార్లలో విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రత్యేక కౌంటర్లలో ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తారు. హోల్‌సేల్ మార్కెట్లో ఉన్న ధరకే ఇక్కడ వినియోగదారులకు అందజేయనున్నారు. రైతుబజార్లు అందుబాటులో లేని ప్రాంతాలకు సంచార రైతుబ జార్ల ద్వారా ఉల్లి సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉల్లి సేకరణపై దృష్టి.. ఇప్పటికే ఉల్లి ధర అనూహ్యంగా పెరిగినందున సామాన్య మధ్యతరగతి వర్గాలవారు విలవిల్లాడిపోతున్నారు. డిమాండ్-సరఫరాకు మధ్య అంతరం పెరుగుతుండటంతో ధరలు ఇంకా పెరిగే పరిస్థితి కన్పిస్తోంది. అదే జరిగితే ఉల్లి ధరలు చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నందున మొదట ఉల్లి కొరత ఏర్పడకుండా చూడాలని అధికారులు యోచిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లోని ట్రేడర్స్‌తో మాట్లాడి పెద్దమొత్తంలో సరుకు సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉల్లి ధర లు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో సరసమైన ధరలకు ఉల్లిని విక్రయిస్తామని మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్ జి.రాజశేఖర్ తెలిపారు. చిల్లర వ్యాపారులను కట్టడి చేసేందుకు ఒక్కో వినియోగదారుడికి రెండేసి కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తామన్నారు. నగరంలో ఉల్లికి కొరత రాకుండా చూస్తే ధరలు దిగివస్తాయని ఆయన తెలిపారు. -
మున్సిపాలిటీల్లో నామినేషన్ల సందడి
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్నికలు జరగనున్న ఇచ్ఛాపురం, పలాస, ఆమదాల వలస, పాలకొండ నగర పంచాయతీలలో ఎన్నికల సందడి ఊపందుకుంది. నామినేషన్ల దాఖలుకు తొలిరోజైన సోమవారం ఒక్క నామినేషన్ దాఖలు కాగా, రెండోరోజు 18 నామినేషన్లు దాఖల య్యాయి. ఇచ్ఛాపురంలో 9, పలాసలో 6, ఆమదాలవలసలో 2, పాలకొండలో 1 నామినేషన్ దాఖలయ్యాయి. బుధవారం ఏకాదశి కావడంతో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా భారీ ఊరేగింపులు జరగడం తో కోలాహలం నెలకొంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థు లు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత ఇది మరింత జోరందుకోనుంది. ‘అపద్బంధు’ చెక్కు పంపిణీ ఎచ్చెర్ల, న్యూస్‌లైన్: బుడగట్లపాలెం గ్రామంలో ఇటీవల మృతిచెందిన అల్లుపల్లి లక్ష్మణరావు కుటుంబానికి తహశీల్దార్ బి.వెంకటరావు రూ.50 వేల ఆపద్బంధు చెక్కును అందజేశారు. ప్రభుత్వం అందజేసిన ఈ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉల్లి విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఉల్లిగడ్డల విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి ఉషారాణి తెలిపారు. కలెక్టరేట్లో శనివారం హైదరాబాద్ నుంచి పౌరసరఫరాల శాఖ కమిషనర్ సునీల్‌శర్మ, మేనేజింగ్ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉల్లిగడ్డల విక్రయం, రేషన్‌కార్డుల అప్లోడ్పై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఉల్లిగడ్డలను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి వర్తకులతో మాట్లాడి రూ.34కు కిలో చొప్పున విక్రయిస్తున్నామని వెల్లడించారు. ఉల్లిగడ్డల విక్రయం కోసం 5 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తొలిరోజు శనివారం ప్రత్యేక కౌంటర్ల ద్వారా 800 కిలోల ఉల్లిగడ్డలు విక్రయించామని చెప్పారు. రచ్చబండ-2 రేషన్‌కార్డుల దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నామని ఆమె వివరించారు. కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారి కొండల్రావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఉల్లి విక్రయ కేంద్రం ప్రారంభం ఎన్జీవోస్ కాలనీ : ఎక్సైజ్ కాలనీ రైతుబజార్లో రాయితీపై ఉల్లిగడ్డ అమ్మకం కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఉషారాణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బయటమార్కెట్లో కిలో ఉల్లి గడ్డను రూ. 60 నుంచి రూ. 65 వరకు అమ్ముతున్నారన్నారు. దీంతో పేద, సామాన్య ప్రజలు ఉల్లి కొనుక్కోలేని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ప్రభుత్వం రాయితీపై ఉల్లి విక్రయించే కేంద్రాలు ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా రూ. 34కే కిలో ఉల్లిగడ్డను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఒక్కో వినియోగదారునికి ఒక కిలో చొప్పున ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇలాంటివి ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్, రామకృష్ణ పాల్గొన్నారు.