మున్సిపాలిటీల్లో నామినేషన్ల సందడి | Municipalities nominations Noise | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో నామినేషన్ల సందడి

Published Wed, Mar 12 2014 3:05 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Municipalities nominations Noise

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్నికలు జరగనున్న ఇచ్ఛాపురం, పలాస, ఆమదాల వలస, పాలకొండ నగర పంచాయతీలలో ఎన్నికల సందడి ఊపందుకుంది. నామినేషన్ల దాఖలుకు తొలిరోజైన సోమవారం ఒక్క నామినేషన్ దాఖలు కాగా, రెండోరోజు 18 నామినేషన్లు దాఖల య్యాయి. ఇచ్ఛాపురంలో 9, పలాసలో 6, ఆమదాలవలసలో 2, పాలకొండలో 1 నామినేషన్ దాఖలయ్యాయి. బుధవారం ఏకాదశి కావడంతో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా భారీ ఊరేగింపులు జరగడం తో కోలాహలం నెలకొంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థు లు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత ఇది మరింత జోరందుకోనుంది. 
 
‘అపద్బంధు’ చెక్కు పంపిణీ
ఎచ్చెర్ల, న్యూస్‌లైన్: బుడగట్లపాలెం గ్రామంలో ఇటీవల మృతిచెందిన అల్లుపల్లి లక్ష్మణరావు కుటుంబానికి తహశీల్దార్ బి.వెంకటరావు రూ.50 వేల ఆపద్బంధు చెక్కును అందజేశారు. ప్రభుత్వం అందజేసిన ఈ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement