శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం జోరందుకుంది. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గానికి, జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖల య్యాయి. శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి ఒకే రోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయటం విశేషం. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి తరఫున పార్టీ నాయకులు బి.ఆదినారాయణశాస్త్రి, విజయరామకృష్ణ, ప్రభాకర్, మాధవరావులు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. టీడీపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు నామినేషన్ వేశారు. ఆయన వెంట పార్టీ నేతలు కింజరాపు ప్రసాద్, పి.వి.రమణ, బి.గోవిందరాజులు, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు ఉన్నారు. సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పైడి రాజారావు నామినేషన్ వేశారు.
ఆయన వెంట కణితి విశ్వనాథం, పి.జె నాయుడు తదితరులు ఉన్నారు. సీపీఐ ఎంఎల్ అభ్యర్థిగా బి.వాసుదేవరావు నామినేషన్ వేయగా ఆయనకు మద్దతుగా తామాడ సన్యాసిరావు, కె.శ్రీనివాసరావు వచ్చారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి, డమ్మీగా ఆమె కుమారుడు గుండ విశ్వనాథ్, జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పొన్నాడ జోగినాయుడు నామినేషన్లు వేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గొర్లె కిరణ్‌కుమార్, డమ్మీ అభ్యర్థిగా ఆయన భార్య గొర్లె పరిమళ, టీడీపీ అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు, డమ్మీ అభ్యర్థిగా ఆయన కుమారుడు కిమిడి వెంకట సూర్య రామమల్లిక్, కాంగ్రెస్ అభ్యర్థిగా కిలారి రవికిరణ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఆమదాలవలస నియోజకవర్గానికి 8 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం మూడు సెట్లు, ఆయన భార్య తమ్మినేని వాణి 3 సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాజాం నియోజకవర్గానికి ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కంబాల బోగులు ఒక సెట్టు, టీడీపీ అభ్యర్థి ప్రతిభాభారతి 4 సెట్లు, ఆమ్ ఆద్మి పార్టీ అభ్యర్థి పైల సురేష్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పలాస నియోజకవర్గానికి బుధవారం 9 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వజ్జ బాబూరావు రెండు, ఆయన భార్య భవానీ ఒకటి, టీడీపీ అభ్యర్థి గౌతు శివాజీ 2, ఆయన భార్య విజయలక్ష్మి ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థి వంక నాగేశ్వరరావు ఒకటి, ఆయన భార్య సుధ ఒకటి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థి తమ్మినేని మాధవరావు ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గానికి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.
టెక్కలి ఆసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఒకటి, జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి కొర్ల భారతి ఒకటి, ఆమె కుమార్తె శిగిలిపల్లి శిరీష ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నరసన్నపేట నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా బగ్గు రహణమూర్తి మూడు సెట్లు, ఇండిపెండెంట్‌గా ఈ. త్రివేశ్వరరావు ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
పాలకొండ నియోజకవర్గానికి బుధవారం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ, డమ్మీగా ఆయన సోదరుడు నిమ్మక పాండురంగ, కాంగ్రెస్ అభ్యర్థిగా నిమ్మక సుగ్రీవులు, డమ్మీగా ఆయన భార్య భాగ్యలక్ష్మి, సీపీఎం అభ్యర్థిగా పత్తిక కుమార్, డమ్మీగా పాలక సాంబయ్య, ఇండిపెండెంట్‌గా సవరపులిపుట్టి పెంటయ్య, యూసీసీఆర్‌ఐ(ఎంఎల్) అభ్యర్థిగా బిడ్డిక వెంకయ్య నామినేషన్లు వేశారు. పాతపట్నం నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కలమట వెంకటరమణ, డమ్మీగా కలమట ఇందిర నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల జోరు
Published Thu, Apr 17 2014 2:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement