vijayawada-hyderabad highway
-
కీసర టోల్‌ప్లాజా వద్ద పెరుగుతున్న వాహనాల రద్దీ
నందిగామ: విజయవాడ-హైదరాబాద్ హైవేలో కృష్ణాజిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వచ్చిన వారు తిరిగి వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాదు వెళ్తున్న వాహనాలతో ఇక్కడ రద్దీ ఏర్పడింది. సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఏడాది రద్దీ కారణంగా టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నిలిచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోల్‌ప్లాజాలో పోలీసులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 5200 వాహనాలు ఈ టోల్‌ప్లాజా ద్వారా వెళ్లినట్లు టోల్ గేటు సిబ్బంది వెల్లడించారు. సాయంత్రానికి 15000 వేలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. -
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్
మునగాల: హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. దీంతో ఆ మార్గంలో గంటకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన తాళ్లపాక పుల్లమ్మ(65) ఉదయం 6.30 గంటల సమయంలోరోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో పుల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంతో గ్రామస్తుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. గ్రామస్తుల రాకపోకల కోసం ప్రత్యేకంగా సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వెయ్యి మంది వరకు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఘర్ వాపసీ...
సంక్రాంతికి ఊరెళ్లి, తిరుగుప్రయాణమైన నగరవాసులు టోల్‌ప్లాజాల వద్ద భారీగా రద్దీ.. ట్రాఫిక్‌జామ్‌తో ఇక్కట్లు చౌటుప్పల్: సంక్రాంతి పర్వదినానికి హైదరాబాద్ మహానగరం విడిచి వెళ్లిన వారంతా మళ్లీ నగరబాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ బాగా పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు 20 వేల వాహనాలు తిరుగుతుండగా, ఆదివారం 30 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సంక్రాంతి పండగ ముందు తమ స్వగ్రామాలకు వెళ్లారు. పండుగ ముగియడం.. సోమవారం పనిదినం కావడంతో అంతా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి విజయవాడ వైపు నుంచి వాహనాల రద్దీ పెరిగింది. హైవేపై నున్న టోల్‌ప్లాజాలకు వాహనాల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ట్రాఫిక్‌జామ్ కాకుండా జీఎంఆర్ అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ దాటేందుకు దాదాపు 15 నిమిషాల నుంచి అరగంట పట్టడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పైగా ఆదివారం సంతదినం కావడం, సంస్థాన్ నారాయణపురం వైపు వెళ్లే వాహనాలు కూడా అధికంగా రావడం, ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.