మునగాల: హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. దీంతో ఆ మార్గంలో గంటకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన తాళ్లపాక పుల్లమ్మ(65) ఉదయం 6.30 గంటల సమయంలోరోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో పుల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంతో గ్రామస్తుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. గ్రామస్తుల రాకపోకల కోసం ప్రత్యేకంగా సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వెయ్యి మంది వరకు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.