Munagala
-
సూర్యాపేట : మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం
-
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
వృద్ధుల కన్నీటి గాథ: ఒక్కగానొక్క కొడుకు మృతి.. కిడ్నీలు ఫెయిల్.. పింఛనే ఆధారం
మునగాల: రెండు కిడ్నీలు చెడిపోవడంతో పాటు వయస్సు మీదపడడంతో కేవలం వృద్ధాప్య పింఛన్‌తోనే బతుకు వెళ్లదీస్తున్న వృద్ధ దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన జిల్లేపల్లి లచ్చయ్య (80), ఎల్లమ్మ (70) దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రెండేళ్ల కిందట లచ్చయ్యకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం మందులు కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో తమను దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఈ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. మా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని భార్య ఎల్లమ్మ తెలిపింది. పింఛన్ పైసలతో పూట గడవడమే కష్టంగానే ఉందని వాపోయింది. ఆపన్నహస్తం అందించి ఆదుకుంటే రుణపడి ఉంటామని ఎల్లమ్మ చెబుతోంది. -
మునగాల టు ఆంధ్రప్రదేశ్
కోదాడ: మునగాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వారిని కోదాడ పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మికదాడి చేసి పట్టుకున్నారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.1.34లక్షలు ఉంటుందని సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. వివరాలు.. పట్టణ పరిధిలోని సాలార్జంగ్పేటకు చెందిన డ్రైవర్ నారగాని వెంకన్న, క్లీనర్ గుండు సతీష్ తమ యజమాని ఇష్టం చెట్ల శ్రీనివాసరావు సాయంతో మునగాలలోని వైన్స్‌లో మద్యం కొనుగోలు చేశారు. ఆ మద్యాన్ని డీసీఎం వ్యాన్‌లో తవుడు బస్తాల మధ్యలో ఉంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. అక్కడ ఎక్కువ ధర ఉండడంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పోలీసులకు పక్కా సమాచారం రావడం దాడి చేసి పట్టుకున్నారు. మద్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒప్పందం కుదరక ..? మద్యం అక్రమంగా తరలిస్తున్న మాఫియా వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు న్నాయి. మంగళవారం రాత్రి మద్యం అక్రమ రవా ణా చేస్తున్న విషయాన్ని కొందరు పసిగట్టి కొమరబండ వద్ద అడ్డగించి బొబ్బలమ్మగుట్ట వద్ద బేరసారాలకు దిగినట్లు సమాచారం. ఒప్పందం కుదరకపోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ విషయం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన కొందరు రాత్రి సమయంలో అక్రమంగా మద్యం, గుట్కాలను తరలిస్తున్న వారిని టార్గెట్ చేసి కార్లలో వెంబడించడం, వారితో బేరసారాలకు దిగడం కుదరకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వడం పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
బీమా సొమ్ము కోసం సొంత అన్న కొడుకే..
సాక్షి, మునగాల(కోదాడ) : గత నెల 24న జాతీయ రహదారిపై మండలంలోని ఇందిరానగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందిన మండలంలోని తాడువాయికి చెందిన ముంజల సైదులు (30) కేసు మిస్టరీని మునగాల పోలీసులు ఛేదించారు. మునగాల సీఐ శివశంకర్ గౌడ్ శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాడువాయి గ్రామానికి చెందిన ముంజల సైదులు గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుడి అన్న ముంజల వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో అసలు విష యం వెలుగులోకి వచ్చింది. మృతుడి అన్న కొడుకు రమేష్ ఒంటిరిగా ఉంటే తన బాబాయి సైదులు పేరుమీద కొన్ని రోజులు క్రితం రెండు లారీలు ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. దీంతో పాటు రూ.50 లక్షల ఇన్సూ్రెన్స్ కూడా చేయించాడు. కొన్ని రోజుల తర్వాత లారీలు నడవకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించడం కష్టంగా మారింది. దాంతో వారు లారీలను తీసుకెళ్లారు. దాంతో తన బాబాయి ప్రమాదంలో మృతి చెందినట్లు నమ్మిస్తే ఇన్సూరెన్స్ వస్తుందని పథకం వేశాడు. తన స్నేహితులైన గంధం మహేష్, మాతంగి శోభన్‌బాబును సంప్రదించి చెరో రూ.ఐదు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. గతనెల 24న సైదులును గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి తీసుకొవచ్చి మార్గమధ్యలో మద్యం తాగించారు. అనంతరం జాతీయ రహదారిపై ఇందిరానగర్ శివారులో గల పార్కింగ్ స్థలం (ట్రక్ లే అవుట్) వద్ద బొలోరో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. అదే రోజు మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. కాగా గతంలో కూడా ఒకసారి సైదులును హతమార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెలుగులోకి వచ్చింది ఇలా.... ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒంటరిగా ఉండే సైదులు పేరు మీద రూ.50 లక్షల బీమా ఎందుకు చేయించారని ఆరా తీశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద సంఘటన వెనుక మృతుడి అన్న కొడుకు రమేష్ హస్తం ఉంటుందని అనుమానించి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం చెప్పాడు. బీమా సొమ్ము కోసమే రమేష్ హత్య చేసినట్లు సీఐ వివరించారు. దీంతో రమేష్‌తో పాటు స్నేహితులు మహేష్, శోభన్‌బాబులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి శుక్రవారం కోదాడ కోర్డులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మునగాల ఎస్ఐ కె.సత్యనారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రెండు కార్లు ఢీ..చెలరేగిన మంటలు
-
రెండు కార్లు ఢీకొని.. మంటల్లో దగ్ధమయ్యాయి!
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రెండు కార్లు ఢీకొని.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడిరోడ్డు మీద జరిగిన ఈ ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని పక్క రోడ్డుమీద వెళ్తున్న కారుపై పడింది. దీంతో.. రెండు కార్లలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి కారులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన మునగాల మండలం మాధవరం దగ్గర జరిగింది. -
రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రావెల్స్ బస్సు
-
మునగాల వద్ద బస్సు బోల్తా
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని మునగాల వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టి.. రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయినట్టు సమాచారం. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. బస్సు పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
మునగాల(సూర్యాపేట జిల్లా): ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కోదాడ మండలం కోమరబండ గ్రామానికి చెందిన ముగ్గురు కార్మికులు ద్విచక్రవాహనంపై మునగాల మండలం ఆముపాముల గ్రామానికి వెళుతుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొంది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంపై వెళుతున్న మాదాసు లక్ష్మణరావు, కారపాటి ఉపేందర్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి క్షతగాత్రుణ్ణి ఆస్పత్రికి తరలించారు. -
‘పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుంటే చంపేశా’
మునగాల(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా మునగాల అలుగుల వద్ద జరిగిన మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. స్థానికంగా నివాసముంటున్న వేట ఉపేంద్ర(38) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో బండరాళ్లతో మోది దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరపగా.. గ్రామానికి చెందిన వల్లోజు సతీష్(24)తో ఉపేంద్రకు వివాహేతర సంబంధం ఉందని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ తరహాలో ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. ఈ మధ్య కాలంలో ఉపేంద్ర పెళ్లి చేసుకోమని బలవంత పెడుతుండటంతో.. బండరాళ్లతో మోది హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు కోదాడ సీఐ రజితారెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ముకుందాపురం (మునగాల) : ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రంగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని ముకుందాపురం బస్టాండ్ సమీపంలో జాతీయ రహాదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ఓ లోడు లారీ ముకుందాపురం వద్ద మరమ్మతుకు గురికావడంతో రోడ్డు మధ్యలో నిలిపివేశారు. అదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ శనివారం తెల్లవారుజామున వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్యాబిన్లో ఉన్న రెండో డ్రైవర్ కరీముల్లా (తాడేపల్లిగూడెం)తో పాటు తనుకుకు చెందిన అబ్దుల్‌రహీంకు తీవ్రంగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జాతీయ రహదారి వాహనం 1033లో చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో దాదాపు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ ప్రమాద విషయమై ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని మునగాల పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
నేలమర్రి(మునగాల): మండలంలోని నేలమర్రి గ్రామపంచాయతీ శివారు గ్రామమైన మొరసకుంట తండలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మూడు బాలాజీ(33) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. వృత్తిలో భాగంగా సోమవారం గ్రామంలో పొలం దున్నేందుకు వెళుతుండగా మార్గమధ్యలో ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తిరగల పడడంతో బాలాజీ ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు,కుమారుడు ఉన్నారు. -
చెప్పు, డప్పు వృత్తిదారులకు పింఛన్ ఇవ్వాలి
మునగాల : తెలంగాణలో చెప్పు, డప్పును నమ్ముకునే వృత్తిదారులకు నెలకు రూ.రెండు వేల పింఛన్ ఇవ్వాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఏబీసీడీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని టీఎమ్మారీయస్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఆదివారం రాత్రి మునగాలకు చేరుకొని స్థానిక గ్రంథాలయ శాఖ భవనంలో బసచేసింది. కాగా సోమవారం ఉదయం మునగాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మండల శాఖ అధ్యక్షుడు ఎల్.శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెల 18న జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం కొలనుపాక నుంచి ప్రారంభమైన పాదయాత్ర నవంబర్ 18న హైదరాబాద్‌లో ముగుస్తుందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే టీఎమ్మార్పీయస్ సన్నాహక సదస్సుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్.మోహన్‌రావు, టీఎమ్మార్పీయస్ జిల్లా ఇన్చార్జి చింతా బాబు మాదిగ, నియోజక వర్గ ఇన్చార్జి అమరారపు శ్రీను, మండల పార్టీ కార్యదర్శి ఎల్.నాగబాబు పాల్గొన్నారు. -
ఎంబీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలి
మునగాల : సాగర్ ఎడమకాల్వ అనుబంధమైన ముక్త్యాల బ్రాంచ్ (ఎంబీ కెనాల్)కు పూర్తిస్థాయిలో 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని చిలుకూరు మండల అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు మునగాల ఎడమకాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద ఉన్న ఎన్ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇందుకు స్పందించిన సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలులేవని తేల్చి చెప్పారు. దీంతో అఖిలపక్ష నేతలు నేరుగా సాగర్ ఉన్నతాధికారులతో ఫోన్ మాట్లాడారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులు అంగీకరించడంతో ముక్త్యాల బ్రాంచ్ కాల్వ గేట్లను ఎత్తి 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తరలించుకుపోయారు. ఈ కార్య క్రమంలో చిలుకూరు ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, జడ్పీటీసీ భట్టు శివాజీనాయిక్, సీపీఐ ఎంఎల్ నాయకులు వక్కంతుల కోటేశ్వరరావు, ఇతర నాయకులు గూడెపు శ్రీను, కంబాల శ్రీను, శేఖర్, సూర్యానారాయణ, అజయ్‌కుమార్, శంకర్, పాలకూరి బాబు తదితరులన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ముకుందాపురం (మునగాల): జాతీయ రహదారిపై మండలంలోని ముకుందాపురం గ్రామశివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మునగాల పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి అహ్మద్‌జానీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా మిలయపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన కిల్లీ జగదీశ్(30) కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ రంగారెడ్డి జిల్లా బాలానగర్‌లో స్థిరపడ్డాడు. కాగా బుధవారం రాత్రి తన సొంతకారులో కుటుంబసభ్యులతో కలిసి పుష్కరాల్లో పాల్గొనేందుకు బాలానగర్ నుంచి విజయవాడకు బయలు దేరారు. బాలానగర్ నుంచి సూర్యాపేట వరకు ౖడ్రైవర్ సమీర్ కారును నడుపగా సూర్యాపేట నుంచి జగదీశ్ నడుపుతూ ముకుందాపురం శివారులోకి వచ్చారు. ఈ క్రమంలో జగదీశ్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడుపుతూ రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో జగదీశ్ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు సీటులో కూర్చున్న డ్రైవర్ సమీర్‌కు తీవ్రగాయాలు కాగా మృతుడి భార్య స్వాతి, కూమారుడు చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జగదీశ్ మృతదేహానికి కోదాడ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ముకుందాపురం (మునగాల): జాతీయ రహదారిపై మండలంలోని ముకుందాపురం గ్రామశివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మునగాల పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి అహ్మద్‌జానీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా మిలయపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన కిల్లీ జగదీశ్(30) కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ రంగారెడ్డి జిల్లా బాలానగర్‌లో స్థిరపడ్డాడు. కాగా బుధవారం రాత్రి తన సొంతకారులో కుటుంబసభ్యులతో కలిసి పుష్కరాల్లో పాల్గొనేందుకు బాలానగర్ నుంచి విజయవాడకు బయలు దేరారు. బాలానగర్ నుంచి సూర్యాపేట వరకు ౖడ్రైవర్ సమీర్ కారును నడుపగా సూర్యాపేట నుంచి జగదీశ్ నడుపుతూ ముకుందాపురం శివారులోకి వచ్చారు. ఈ క్రమంలో జగదీశ్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడుపుతూ రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో జగదీశ్ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు సీటులో కూర్చున్న డ్రైవర్ సమీర్‌కు తీవ్రగాయాలు కాగా మృతుడి భార్య స్వాతి, కూమారుడు చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జగదీశ్ మృతదేహానికి కోదాడ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
కారు బోల్తా : ఒకరి మృతి
-
కారు బోల్తా : ఒకరి మృతి
నల్లగొండ : కృష్ణా పుష్కరాలకు వెళ్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు తిరుపతమ్మ గుడి సమీపంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి... అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
బరాఖత్‌గూడెం(మునగాల): మండంలోని బరాఖత్‌గూడెం గ్రామపంచాయతీలోని ఒకటవ వార్డులో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిధలు నుంచి రూ.ఐదు లక్షలతో నిర్మించే సీసీరోడ్డు నిర్మాణపు పనులకు శనివారం జెడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే నిధులు నుంచి ఇప్పటికే లక్షల రూపాయల నిధులతో మండలంలోని పలు గ్రామాలలో సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. జిల్లా పరిషత్ సమవేశాల్లో ఎప్పటికప్పుడు మండల సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారానికి తన వంతు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాలే జయమ్మ, ఎంపీటీసీ సభ్యులు అమరబోయిన మట్టయ్య యాదవ్, జిల్లా వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ వేనేపల్లి రమేష్, మాజీ సర్పంచ్ గడ్డం చంద్రారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలే సామియేలు, షేక్ హాబీబ్, గ్రామపెద్దలు ఎనుగుల నాగేశ్వరరావు, కాలే సామియేలు, మొలుగూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
శుభకార్యానికి వస్తూ.. పరలోకాలకు..
► తెల్లారిన కూలీల బతుకులు ► మునగాల మండల పరిధిలో లారీబోల్తా ► ముగ్గురి దుర్మరణం.. మరో ఇద్దరికి గాయాలు ► డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం వారంతా 35ఏళ్ల లోపు యువకులే.. కరువు పరిస్థితుల దృష్ట్యా జీవనోపాధి కోసం మెదక్ జిల్లాకు ఇటీవల వలసెల్లారు..రోజు వారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.. వివాహ వేడుకలో పాల్గొనేందుకు స్వగ్రామానికి లారీలో తిరిగివస్తున్నారు.. మరో గంట సమయం గడిస్తే ఇంటికి చేరుకుంటామనుకునేలోగానే మార్గమధ్యలోనే వారి బతుకులు తెల్లారిపోయాయి.. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా లారీ బోల్తా పడడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. - మునగాల మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన నార్ల కొండస్వామి(35),షేక్ సైదా(31), గెనుకొండ కొండలరాజు(30), బాణో తు వెంకటరామదాసు వృత్తిరీత్యా కూలీ లుగా జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 11న జీవనోపాధి నిమిత్తం మెదక్ జిల్లాకు వలసెల్లారు. అక్కడ 20 రోజుల పాటు ఇళ్ల పైకప్పులు కప్పేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీరితో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు కూడా వెళ్లారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు వస్తూ.. నార్ల కొండస్వామి అన్న కూతురు వివాహం ఆదివారం రేవూరులో జరుగనున్నది. ఈ వివాహా వేడుకలలో పాల్గొనేందుకు నలుగురు వ్యక్తులు స్వగ్రామానికి రావాలని నిర్ణయించుకున్నారు. శనివారం తెల్లవారుజామున మెద క్ నుంచి విజయవాడకు టైల్స్ లోడుతో వెళ్తు న్న లారీలో బయలుదేరారు. కొంపముంచిన డ్రైవర్ నిద్రమత్తు మరో గంట గడిస్తే కూలీలంతా స్వగ్రామానికి చేరుకునేవారే. మార్గమధ్యలో మునగాల మం డలం ఆకుపాముల శివారులోకి రాగానే డ్రైవర్ మరియాదాసుకు నిద్రమత్తు ముంచుకురావడంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో టైల్స్ లోడుపై ఉన్న నార్ల కొండస్వామి(35),షేక్ సైదా(31), గెనుకొండ కొండలరాజు(30), అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా బాణోతు వెంకటరామదా సు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకుని పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను, క్షతగాత్రులను లారీకింద నుంచి వెలికి తీయించారు. లారీడ్రైవర్ మరియాదాసుది నందిగామ నియోజకవర్గం చందర్లపాడుగా గుర్తిం చారు. గాయపడిన మరియదాసు, వెంకటరామదాసును కోదాడకు తరలించారు. ఈ ప్రమాదానికి లారీక్లీనర్ కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ నిద్రిస్తుం డగా క్లీనర్ లారీని నడుపుతున్నటు ప్రమాదం నుంచి బయటపడిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. క్లీనర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాలకు కోదాడ ప్ర భుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కు టుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నగేష్ తెలిపారు. -
ఇన్నోవా బోల్తా: ఒకరు మృతి
నల్లగొండ: ఇన్నోవా కారు బోల్తా పడి ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం నల్లగొండ జిల్లాలోని మునగాల మండలం ఆగుపాముల సమీపంలో చోటుచేసుకుంది. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మునగాలలో విషాదం
మునగాల: కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానం చేసేందుకు నాగార్జున సాగర్ కాలువలోకి దిగిన ఇద్దరు నీటమునిగి మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లా మునగాలలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చనిపోయిన ఇద్దరూ సూర్యాపేట వాసులుగా గుర్తించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మేకరాజు ప్రశాంత్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అతని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రశాంత్‌కు వారం కిందటే వివాహం అయింది. కార్తీకపౌర్ణమి సందర్భంగా ప్రశాంత్ కుటుంబసభ్యులు దాదాపు 11 మంది బుధవారం ఉదయం మునగాలకు చేరుకున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన కాల్వలో స్నానాలు చేసి, సమీపంలోని అయ్యప్ప ఆలయంలో పూజలు చేయాలని భావించారు. స్నానాలు చేసేందుకు సాగర్ కాలువలోకి దిగిన ప్రశాంత్, అతని మేనమామ కనపర్తి మహేష్(50) నీటి ఉధృతికి కొంతదూరం కొట్టుకుపోయారు. కేకలు వేయటంతో అక్కడే స్నానాలు చేస్తున్న అయ్యప్ప మాలధారులు వారిని రక్షించేందుకు యత్నించారు. కొద్దిసేపటికి ప్రశాంత్‌ను ఒడ్డుకు చేర్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. మహేష్ జాడ దొరకలేదు. అతని కోసం గాలిస్తున్నారు. వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. -
కర్మకాండకు వెళ్తొస్తూ.. కానరాని లోకాలకు
► మునగాల మండలంలో కల్వర్టును ఢీకొట్టిన కారు ► అక్కడికక్కడే ముగ్గురి మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం ► అతివేగం,నిద్రమత్తే ప్రమాదానికి కారణం మృతులు హైదరాబాద్ వాసులు మితిమీరిన వేగం.. ఆపై నిద్రమత్తు... కళ్లు మూసి తెరిచేలోపల.. కారు కల్వర్టును ఢీకొట్టింది.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరగా, మరో ఇద్దరి ప్రాణాలు గాలిలో ఊగిసలాడుతున్నాయి.. ఇదీ.. శుక్రవారం తెల్లవారుజామున 65వ నంబర్ జాతీయ రహదారిపై మునగాల మండలం మాదవరం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీరుతెన్ను. - మునగాల హైదరాబాద్‌కు చెందిన పది మంది మిత్రులు తమ మిత్రుడి తండ్రి కర్మకాండకు హాజరయ్యేందుకు ఈ నెల 23వ తేదీన రెండు కార్లలో విశా ఖపట్టణం బయలుదేరి వెళ్లారు. 24వ తేదీన కర్మకాండలు పూర్తయ్యాక అదే రోజు రాత్రి మిత్రబృందం స్కొడా ర్యాపిడ్ కారులో ఐదుగురు, ఇన్నోవా వాహనంలో మరో ఐదుగురు హైదరబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ రెండు వాహనాలు కృష్ణాజిల్లా చిల్లకల్లు వద్ద టోల్గేట్ వరకు కలిసి ప్రయాణించాయి. కొంపముంచిన నిద్రమత్తు రెండు రాత్రులుగా మిత్రబృందం ప్రయాణిస్తోంది. ముందుగా వెళ్తున్న స్కోడా ర్యాపిడ్ కారు శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5.30గంటల సమయ ంలో మండలంలోని మాధవరం గ్రామశివారులో అతివేగంగా వచ్చి కల్వర్టును ఢీకొట్టి గుంతలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన బుద్దరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి(18), బంజారహిల్స్‌కు చెందిన షేక్ మొబిన్(19), మాదాపూర్‌కు చెందిన ఆశికంటి మంజునాథ్(17) అక్కడికక్కడే దుర్మర ణం పాలయ్యారు. శ్రీనగర్ కాలనీకి చెం దిన తాటికొండ లక్ష్మారెడ్డి, ఖైరాతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన రమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన అరగంట తర్వాత అటుగా వచ్చి న మాధవరం వాసులు గుర్రం సుధాకర్‌రెడ్డి, చెన్నగాని దుర్గయ్యలు ప్రమాద సంఘటన తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. కారులో ప్రాణాలతో ఉన్న ఇద్దరిని బయటకు తీశారు. ఈలోగా మునగాల ఎస్ఐ రాహుల్‌దేవ్ తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీస్ వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి, మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమం ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన రమ్య, లక్ష్మారెడ్డిలను తొలుత చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి త రలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరిని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు ఎస్ఐ తెలిపారు. ఎంతకీ రాకపోవడంతో.. ఇన్నోవా కారులో ముందుగా వె ళ్లిన ఐదుగురు మిత్రులు హైదరాబాద్ శివారుకు చేరుకున్న తర్వాత మిగిలిన ఐదుగురు సంబంధించిన కారు ఎంతకూ రాకపోవడంతో మిత్రబృందానికి ఫోన్ చేశారు. ప్రమాదస్థలిలో ఉన్న గ్రామస్తులు ఫోన్ ఎత్తి ప్రమాదం జరిగిన తీరును వివరించడంతో వారు తిరిగి 12గంటలకు కోదాడ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విగతజీవులుగా మారిన తమ మిత్రుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. మిన్నంటిన రోదనలు మాధవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకుల కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులతో ఆస్పత్రి కిటకిటలాడింది. తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో వారి రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
తాగునీటి కోసం నిరసన
మునగాల: నల్లగొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామస్తులు తాగునీటి కోసం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు 50 మంది గ్రామస్తులు ఖాళీ బిందెలతో కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయం తలపులు మూసివేసి, అధికారులు సమస్య పరిష్కరించేవరకు వెళ్లేది లేదని అక్కడే ఆందోళన చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు తమ సమస్యను పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. -
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్
మునగాల: హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. దీంతో ఆ మార్గంలో గంటకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన తాళ్లపాక పుల్లమ్మ(65) ఉదయం 6.30 గంటల సమయంలోరోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో పుల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంతో గ్రామస్తుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. గ్రామస్తుల రాకపోకల కోసం ప్రత్యేకంగా సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వెయ్యి మంది వరకు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిపై హత్యాయత్నం
మునగాల :టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై కాంగ్రెస్ వర్గీయులు హత్యాయత్నం చేశారు. ఈ ఘటన మునగాల మండల కేం ద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు కందిబండ సత్యనారాయణ రాత్రి పది గంటలకు ఇంట్లో ఉండగా, అతడి సోదరుడు ప్రభాకర్, తన మిత్రులు వారణాసి ప్రసాద్, దేవరం రామిరెడ్డిలతో ఇంటి ఎదుట మాట్లాడుతున్నా డు. ఈ క్రమంలో కాంగ్రెస్ మునగాల మండల అధ్యక్షుడు నల్లపాటి శ్రీనివాస్, తన అనుచరులు 50 మందితో కలిసి కర్రలు, రాళ్లతో వచ్చి దాడి చేశారు. ఒక్కసారిగా జరుగుతున్న దాడితో హతాశులైన ప్రభాకర్ అతడి స్నేహితులు అక్కడి నుంచి పరుగుతీశారు. కాంగ్రెస్ వర్గీయులు వారిని వెంబడించి మరీ దాడిచేశా రు. మరికొందరు సత్యనారాయణ ఇంటిపై రాళ్ల వర్షం కురి పిం చారు. తలుపులు పెట్టుకుని ఇంట్లో ఉన్న సత్యనారాయణ మేడపైకి వెళ్లి ఫోన్ ద్వార కోదాడ సీఐ, మునగాల ఎస్ఐలకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి రావడంతో కాంగ్రెస్ వర్గీయులు పరారయ్యా రు. ఈ దాడిలో ప్రభాకర్, అతడి స్నేహితుడు వారణాసి ప్రసాద్‌కు గాయాలయ్యాయి. కోర్టులో ఫిర్యాదు చేసినందుకే.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నల్లపాటి శ్రీనివాస్, ఆయ న భార్య ప్రమీల తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోటీచేసి విజయం సాధించారని కోర్టులో ఫిర్యాదు చేసినందుకే తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని కందిబండ సత్యనారాయ ణ ఆరోపించారు. కోర్టులో వారు అధికారులను తప్పుదోవ పట్టించారని నిరూపణ కావడంతో జీర్ణించుకోలేక తనను మట్టుబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో నల్లపాటి శ్రీనివాస్‌పై ఫిర్యాదు నల్లపాటి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి తమపై హత్యాయత్నం చేశాడని బాధితులు కందిబండ సత్యనారాయణ, చిల్లంచర్ల ప్రభాకర్, వారణాసి ప్రసాద్ శనివారం మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి తమ ప్రా ణాలకు రక్షణ కల్పించాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్ఐ డి.రామృష్ణారెడ్డి తెలిపారు. -
గేదెలు తెచ్చిన ముప్పు
మునగాల, న్యూస్‌లైన్ :బస్సులో హాయిగా నిద్రిస్తున్న ప్రయాణికులకు రెప్పపాటులో గేదెలు పెనుముప్పు తెచ్చిపెట్టాయి. గేదెల కాపరి నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను బలిగొనగా, మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మునగాల మండలం తాడువాయి స్టేజిసమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన గరుడ బస్సు ప్రమాదానికి గేదెలే కారణమని తేలింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ డిపోకు చెందిన గరుడ బస్సు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సోమవారం అర్ధరాత్రి 12గంటలకు 47 మంది ప్రయాణికులతో విజయవాడకు బయలుదేరింది. మార్గమధ్యలో మండలంలోని తాడువాయి స్టేజీ వద్దకు రాగానే వీరి ముందు ఉన్న లారీ గేదెలను తప్పించుకుని ముందుకు వెళ్లింది. అయితే ఆ వెనకే ఉన్న గరుడబస్సు ఎదురుగా ఒక్కసారిగా గేదెలు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఏడుపులు.. పెడబొబ్బలు తెల్లవారుజామున 3.30 గంటలకు గరుడబస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు అనుకోని ప్రమాదానికి ఒక్కసారిగా హతాశులయ్యారు. ఏంజరిగిందో తెలుసుకునే లోపే బస్సులో పెడబొబ్బలు, ఏడుపులు వినిపించాయి. ప్రమాదం జరిగినట్లు గుర్తించిన పలువురు ప్రయాణికులు బస్సు ముందు వెనుక ఉన్న అద్దాలను పగులగొట్టుకొని ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. అప్పటికే అందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. గుర్తింపుకార్డు చూపిస్తూ.. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి తన గుర్తింపు కార్డును చూపిస్తూ వచ్చిపోయే వాహనాలను ఆపసాగాడు. కొద్ది సేపటికి ఓ కారు యజమాని తన వాహనాన్ని ఆపడంతో తన పేరు హరిప్రసాద్ అని, విజయవాడ రీజియన్‌లో కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నాడు. తనను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ప్రాదేయపడ్డాడు. వెంటనే కారు యజమాని అతడిని 17 కి.మీ దూరంలో ఉన్న కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. అప్పటి వరకు మాట్లాడిన హరిప్రసాద్ అరగంటలోపే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు నంద్యాల హరిప్రసాద్(57)ది స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పన పాడు గ్రామం. ఈయనకు భార్య కూతురు, కుమారుడు ఉన్నాడు. గాయపడింది వీరే.. బస్సు బోల్తా ప్రమాదంలో హైదరాబద్‌కు చెందిన మెడక వెంకటేశ్వర్లు, సిరిపూరి ఫృథ్వీవర్మ, వడెపర్తి హేమంతకుమార్,డి.శేషుకుమారి, విజయవాడకు చెందిన కొత్తూరి గాయత్రిదేవి, కొత్తూరి రాజగోపాల్, అడ్డేపల్లి సాయిదాసు ఉన్నారు. కాగా బస్సు ైడ్రైవర్ బాబురావు, క్లీనర్‌కు గాయాలు కాలేదు. క్షతగాత్రులను 108, 1033హైవే అంబులెన్స్ వాహనాలలో కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్లే ఓ కారు యజమాని తుంగ బుచ్చిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఈ మేరకు మునగాల ఏఎస్ఐ ఎంఏ.గఫూర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హరిప్రసాద్ మృతదేహానికి కోదా డ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఇదిలా ఉండగా బస్సు ప్రమాదంలో రెండు గేదెలు కూడా మృతిచెందాయి. వాటి యజమాని ఆచూకీ లభ్యం కాలేదు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ మునగాల వద్ద ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ ప్రభాకర్‌రావు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును బస్సుడ్రైవర్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై గేదెలు తిరగకుండా చర్యలు చేపడతామన్నారు.ఇందుకోసం స్థానిక పోలీసులు, జీఎమ్మార్సంస్థ ప్రతినిధుల తో చర్చించనున్నట్లు తెలిపారు. తరచు జాతీయ రహదారిపై గేదెలు సంచరిస్తుండడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు. ఆయన వెంట సూర్యాపేట డీఎస్పీ శ్రావణ్‌కుమార్, కోదాడ రూరల్, టౌన్, సూర్యాపేట రూరల్ సీఐ లు వై.మొగిలయ్య, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు. -
మునగాలలో నకిలీ నోట్ల చెలామణి
మునగాల, న్యూస్‌లైన్ : ఇటీవల కాలంలో మునగాలలో నకిలీ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో నకిలీ నోట్లు ప్రత్యక్షమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునగాల మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బెల్టు దుకాణాలు, మాంసం మార్కెట్లలో ఎక్కువగా ఈ నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. సోమవారం మునగాలలో ఓ బార్బర్ దుకాణంలో షేవింగ్ చేయించుకున్న వ్యక్తి దుకాణ యజమానికి రూ. 500నోటు ఇచ్చి మిగిలిన చిల్లర తీసుకొని వె ళ్లాడు. ఆ తర్వాత బార్బర్ దుకాణం యజమాని నోటును నిశితంగా పరిశీలించగా నకిలీదని తేలింది. దీంతో బాధితుడు బిక్కమొహం వేశాడు. విషయం బయట ఎక్కడైనా తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో నకిలీనోటును ఎలా మార్చుకోవాలనే ఆలోచనతో సతమతమవుతున్నాడు. కాగా వారం రోజుల క్రితం ఓ వ్యక్తి రూ.50వేలు అప్పుగా తీసుకొని ఆకుపాముల ఎస్బీఐలో రుణం చెల్లించేందుకు వెళ్లగా అందులో రెండు రూ. 500నోట్లు నకిలీవి ఉన్నట్లు బ్యాంక్ సిబ్బంది గుర్తించి అవి చెలామణి కాకుండా అడ్డుకట్ట వేశారు. ఇదిలా ఉండగా త్వరలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోటీ చేసే అభ్యర్థులు భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు ప్రయిత్నాలు ప్రారంభించడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. కొంత కాలంగా మునగాలలో ఓ నకిలీ నోట్ల ముఠా సంచరిస్తుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పోలీస్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి నకిలీనోట్ల చెలామణిని అరికట్టాలని పలువురు కోరుతున్నారు. -
ప్రేమజంట బలవన్మరణం
మేళ్లచెర్వు, మండలంలోని కీర్తి సిమెంట్ పరిశ్రమ పరిధిలో ఉరి వేసుకొని ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వుకు చెందిన చిన్నపంగు శౌరి కూతురు మౌనిక (18) రెండేళ్లుగా కీర్తి పరిశ్రమ గేటు ఎదురుగా డబ్బాకొట్టు నిర్వహిస్తున్నది. మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన గుణకుంట వీరస్వామి (30) కీర్తి పరిశ్రమలో లోడింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరస్వామికి పెళ్లయింది. భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, మౌనిక, వీరస్వామి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం రాత్రి వీరి ఇరువురి కలిసి సిమెంట్ పరిశ్రమ పక్కన గల వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం పరిశ్రమలో డ్యూటీ దిగి అటుగా వెళ్తున్న కొంతమంది కార్మికులు చూసి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను కిందికి దించి చూడగా వీరస్వామి షర్ట్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది. అందులో మా చావుకి ఎవరూ కారకులు కారని తమ వాళ్లను ఎటువంటి ఇబ్బందులకూ గురిచేయవద్దని, ఇద్దరికీ ఒకేచోట దహనసంస్కారాలు చేయాలని రాసి ఉంది. విషయం తెలుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటనస్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను పోసుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. అయ్యో..పాపం వీరస్వామి మృతదేహం వద్ద అతని భార్య, పిల్లలు ఏడుస్తున్న తీరు గ్రామస్తులను కలిచివేసింది. మృతుడికి నాలుగేళ్ల, నాలుగు నెలల వయస్సుగల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియక ఆ పిల్లలు ఆమెవైపు దీనంగా చూస్తుండడంతో స్థానికులు అయ్యో.. పాపం అంటూ కంటతడి పెట్టుకున్నారు. -
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ........
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ........ మునగాల మండలం మాధవరం, రేపాల, కలకోవ, కోదాడ మండలం తొగర్రాయిలోని పాఠశాలల్లో శనివారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మాధవరం ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మేడం కాశయ్య, ప్రధానోపాయధ్యాయుడు ఎలక మాధవరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ షేక్ సైదా, ఉపాధ్యాయులు తొగరు శ్రీనివాస్, దేవయాని, రేపాల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సీహెచ్.లింగారెడ్డి, వై.శ్రీని వాసరావు, ఎస్ఎంసీ చైర్మన్ పానుగోటి రంగా, ఉపాధ్యాయులు ఎన్.కల్పన, ఎస్.స్వరూప పాల్గొన్నారు. కలకోవలో డీఈఓగా ఎం.శ్రీలత, విద్యాశాఖ మంత్రిగా పనస మమత, ఎస్ఎంసీ చైర్మన్‌గా యమున, ప్రధానోపాధ్యాయురాలిగా జి.సుమతి వ్యవహరించారుఉ. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోటు సీతారామయ్య, ఉపాధ్యాయులు డి.శ్రీను, జ్యోతి, కె.ఉమామహేశ్వరరావు, ఎల్.ఆనంద్‌కిశోర్, ఎం.రవికుమార్, ఎల్.వెంకటేశ్వర్లు, శంకర్, శ్రీధర్, సత్యనారాయణలు పాల్గొన్నారు. తొగర్రాయిలో నాగరాణి, సాంబశివరావు, నరసింహారావు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, సుధాకర్‌రావు, నాగమణి, అండాళమ్మ, దశరథ, గంగా పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, మునగాల/కోదాడ రూరల్ -
భద్రాచలం, మునగాల తెలంగాణలో అంతర్భాగమే
నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ డిసెంబర్ 1న ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు. భద్రాచలం, మునగాల.... తెలంగాణలో అంతర్బాగమేనని దేవీప్రసాద్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
మునగాల ముమ్మాటికీ మాదే..
మునగాల, న్యూస్‌లైన్ : ‘భద్రాచలం మనదిరా.. మునగాల పరగణా మనదిరా’ అనే నినాదం తో తెలంగాణవాదులు పోరాటం చేయాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌తోపాటు, భద్రాచలం, మునగాల పరగణా ప్రాంతాలు, వనరులపై పూర్తి అధికారాలున్న సంపూర్ణ తెలంగాణే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా మునగాలలో గురువారం ‘ మునగాల పరగణా.. తెలంగాణ అంతర్భాగమే’ అనే అంశంపై జరిగిన సమావేశంలో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణపై ఆంటోనీ కమిటీ, జీవోఎం అని యూపీఏ కిరికిరీలు పెడుతూ తాత్సారం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని, ఖమ్మం జిల్లాలోని భద్రాచలంను తూర్పు గోదావరి జిల్లాలో, నల్లగొండ జిల్లాలోని మునగాల పరగణా పరిధిలోని 23 రెవెన్యూ గ్రామాలను కృష్ణాజిల్లాలో కలిపేలా సీమాంధ్ర నేతలు పావులు కదుపుతున్నారన్నారు. 1956కు పూర్వం మునగాల పరగణా ఆంధ్రా ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, భాష తెలంగాణలోనే మమేకమయ్యాయన్నారు. కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటుకు ఎన్నో అడ్డంకులు కల్పిస్తున్నారని, ఆయనను సాగనంపేందుకు తెలంగాణవాదులు నడుం బిగించాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటులో టీడీపీ దొంగాట ఆడుతోందని విమర్శించారు. కాగా, తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నల్లగొండ టు మునగాల’ పాదయాత్రను నల్లగొండలో కోదండరాం ప్రారంభించారు. జీవోఎం వాయిదాపై అనుమానాలు మహబూబాబాద్ : కేంద్ర ప్రభుత్వం జీవోఎంను ఈనెల 27కు వాయిదా వేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని కోదండరాం అన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో గురువారం తెలంగాణ మాలమహానాడు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. నదీ జలాలు, ఇతర వనరులు సీమాంధ్ర పాలకుల గుత్తాధిపత్యంలో తెలంగాణ నలిగిపోయిందన్నారు. 30న ముంబైలో తెలంగాణ సభ హైదరాబాద్ : తెలంగాణ గడ్డపై పుట్టిన మమకారంతో ముంబైలో ఈనెల 30న ‘తెలంగాణ బిల్లు సాధన సభ’ను నిర్వహించడం అభినందనీయమని కోదండరాం అన్నారు. గురువారం సభకు సంబంధించిన కరపత్రాన్ని దళిత సంఘర్షణ సమితి రాష్ర్ట అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, కోదండరాం ఆవిష్కరించారు. -
‘రియల్’ మోసం..!
కోదాడటౌన్, న్యూస్‌లైన్ :కోదాడ-మునగాల మండలాల సరిహద్దులోని ద్వారకానగర్ రియల్ ఎస్టేట్ వెంచర్లో భారీ కుంభకోణం జరిగింది. రియల్టర్ ఒకే భూమిని డెవలపర్స్‌కు ఇళ్ల నిర్మాణానికి ఇచ్చి, అదే భూమిని మరొకరికి సేల్ కమ్ జీపీఏ (విక్రయంతో కూడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేశాడు. దీంతో ఇక్కడ డెవలపర్స్ కట్టిన ఇళ్లను కొన్న వారు లబోదిబోమంటున్నారు. జరిగిన మోసంపై డెవలపర్ మామిడి రామారావు కోర్టులో ఫిర్యాదు చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు రియల్టర్ పి. రామాంజనేయులగౌడ్, డెవలపర్లో ఒకరైన పందిరి రాజశేఖర్‌పై కేసు నమోదైంది. కోదాడ మండలం కొమరబండ సమీపంలో ద్వారకానగర్ పేరుతో బీబీనగర్‌కు చెందిన రామాంజనేయులుగౌడ్ 30ఎకరాలలో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారు. దానిలో 24వేల చదరపు గజాలను(120 ప్లాట్లు) కోదాడకు చెందిన రాజశేఖర్, రామారావు, జనార్దన్, రాజవర్ధన్రెడ్డిలకు డెవలప్మెంట్ కోసం విక్రయ అగ్రిమెంట్ చేశాడు. వీరు దీని కోసం భారీ ఎత్తున డబ్బు చెల్లించారు. ఈ భూమిలో శ్రీ కృష్ణా హోమ్స్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చేస్తూ ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ డెవలప్మెం ట్లో పై నలుగురితో పాటు రియల్టర్ రామాం జనేయులుగౌడ్ 50 శాతం భాగస్వామిగా ఉన్నాడు. దీంతో డెవలపర్స్ ఇళ్లను నిర్మిస్తున్నామని పలువురు ఉద్యోగులకు, చిరువ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొని ప్లాట్లను అమ్మడంతో పాటు వాటిలో ఇళ్లు కూడా కట్టిస్తున్నారు. ఇప్పటికే అక్కడ దాదాపు 30కి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. వీటికి కోదాడకు చెందిన బ్యాంక్ రుణాలూ ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఇపుడే మొదలైంది. డెవలప్మెంట్కు ఇచ్చిన స్థలం మరొకరికి అమ్మకం ద్వారకానగర్‌లో శ్రీ కృష్ణా హోమ్స్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చెసేందుకు రియల్టర్ ఇచ్చిన 24వేల గజాలలో(120 ప్లాట్లు) విక్రయ అగ్రిమెంట్‌కు ముందుగానే 4వేల గజాలను (డాక్యుమెంట్ నెంబర్ 5953/2011 ద్వారా) ఒకరికి, అగ్రిమెంట్ తర్వాత మరొకరికి (డాక్యుమెంట్ నెంబర్ 10397/2012 నుండి 10402/12 వరకు), మరో 10వేల గజాలను ఆరుగురు వ్యక్తులకు అమ్మాడు. అయితే, ఈ అమ్మకం వ్యవహారం తెలియని డెవలపర్లు వాటిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. అవి వివిధ దశలలో ఉన్నాయి. కొన్నింటిని విక్రయించి కొన్న వారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయమని రియల్టర్‌ను కొంతకాలంగా కోరుతున్నారు. కానీ, రియల్టర్ ఆ భూమిని అప్పటికే ఇతరులకు విక్రయించి ఉండడంతో తన బండారం బయటపడుతుందని వారిని తిప్పుతున్నారు. డెవలపర్లలో ఒకరైన పందిరి రాజశేఖర్ ఈ మోసంలో భాగస్వామిగా మారాడని అనుమానం వచ్చిన ఇతర భాగస్వాములు ఈసీలు తీయించారు. దీంతో అప్పటికే ఆ భూమిని ఏడు డాక్యుమెంట్ల ద్వారా అమ్మినట్లు తేలింది. దీంతో డెవలపర్స్‌తో పాటు ప్లాట్లు కొన్న వారు రియల్టర్‌ను నిలదీయగా తనకేమీ తెలియదని అంతా తన అనుచరునిపై నెట్టి తప్పించుకుంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టును ఆశ్రయించిన బాధితులు మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితులు కోదాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వారు కోదాడ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు కోర్టు ఆదేశించింది. దీంతో కోదాడ పట్టణ పోలీసులు రియల్టర్ రామాంజనేయులుగౌడ్, అతని అనుచరుడు రాజశేఖర్‌పై కేసు నమోదు చేశారు.