సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన | Foundation for cc road construction | Sakshi
Sakshi News home page

సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

Published Sat, Aug 13 2016 5:54 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

బరాఖత్‌గూడెం(మునగాల):  మండంలోని బరాఖత్‌గూడెం గ్రామపంచాయతీలోని ఒకటవ వార్డులో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిధలు నుంచి రూ.ఐదు లక్షలతో నిర్మించే సీసీరోడ్డు నిర్మాణపు పనులకు శనివారం జెడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే నిధులు నుంచి ఇప్పటికే లక్షల రూపాయల నిధులతో మండలంలోని పలు గ్రామాలలో సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. జిల్లా పరిషత్‌ సమవేశాల్లో ఎప్పటికప్పుడు మండల సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారానికి తన వంతు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  వైస్‌ ఎంపీపీ కాలే జయమ్మ, ఎంపీటీసీ సభ్యులు అమరబోయిన మట్టయ్య యాదవ్, జిల్లా వెంకటేశ్వర్లు,  ఉపసర్పంచ్‌ వేనేపల్లి రమేష్, మాజీ సర్పంచ్‌ గడ్డం చంద్రారెడ్డి,  మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కాలే సామియేలు, షేక్‌ హాబీబ్, గ్రామపెద్దలు ఎనుగుల నాగేశ్వరరావు, కాలే సామియేలు, మొలుగూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement