టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడిపై హత్యాయత్నం | TRS mandala President Attempt to murder | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడిపై హత్యాయత్నం

Jul 6 2014 1:02 AM | Updated on Sep 2 2017 9:51 AM

టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడిపై హత్యాయత్నం

టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడిపై హత్యాయత్నం

టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిపై కాంగ్రెస్ వర్గీయులు హత్యాయత్నం చేశారు. ఈ ఘటన మునగాల మండల కేం ద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు

 మునగాల :టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిపై కాంగ్రెస్ వర్గీయులు హత్యాయత్నం చేశారు. ఈ ఘటన మునగాల మండల కేం ద్రంలో  శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షు డు కందిబండ సత్యనారాయణ రాత్రి పది గంటలకు ఇంట్లో ఉండగా, అతడి సోదరుడు ప్రభాకర్, తన మిత్రులు వారణాసి ప్రసాద్, దేవరం రామిరెడ్డిలతో ఇంటి ఎదుట మాట్లాడుతున్నా డు. ఈ క్రమంలో  కాంగ్రెస్ మునగాల మండల అధ్యక్షుడు నల్లపాటి శ్రీనివాస్, తన అనుచరులు 50 మందితో కలిసి కర్రలు, రాళ్లతో వచ్చి దాడి చేశారు. ఒక్కసారిగా జరుగుతున్న దాడితో హతాశులైన ప్రభాకర్ అతడి స్నేహితులు అక్కడి నుంచి పరుగుతీశారు. కాంగ్రెస్ వర్గీయులు వారిని వెంబడించి మరీ దాడిచేశా రు. మరికొందరు సత్యనారాయణ ఇంటిపై రాళ్ల వర్షం కురి పిం చారు. తలుపులు పెట్టుకుని ఇంట్లో ఉన్న సత్యనారాయణ మేడపైకి వెళ్లి ఫోన్ ద్వార కోదాడ సీఐ, మునగాల ఎస్‌ఐలకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి రావడంతో కాంగ్రెస్ వర్గీయులు పరారయ్యా రు. ఈ దాడిలో ప్రభాకర్, అతడి స్నేహితుడు వారణాసి ప్రసాద్‌కు గాయాలయ్యాయి.
 
 కోర్టులో ఫిర్యాదు చేసినందుకే..
 ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నల్లపాటి శ్రీనివాస్, ఆయ న భార్య ప్రమీల తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోటీచేసి విజయం సాధించారని కోర్టులో ఫిర్యాదు చేసినందుకే తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని కందిబండ సత్యనారాయ ణ ఆరోపించారు. కోర్టులో వారు అధికారులను తప్పుదోవ పట్టించారని నిరూపణ కావడంతో జీర్ణించుకోలేక తనను మట్టుబెట్టాలని చూస్తున్నారని తెలిపారు.
 
 పోలీస్‌స్టేషన్‌లో నల్లపాటి శ్రీనివాస్‌పై ఫిర్యాదు
 నల్లపాటి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి తమపై హత్యాయత్నం చేశాడని బాధితులు కందిబండ సత్యనారాయణ, చిల్లంచర్ల ప్రభాకర్, వారణాసి ప్రసాద్ శనివారం మునగాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి తమ ప్రా ణాలకు రక్షణ కల్పించాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల     ఎస్‌ఐ డి.రామృష్ణారెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement