
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రెండు కార్లు ఢీకొని.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడిరోడ్డు మీద జరిగిన ఈ ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని పక్క రోడ్డుమీద వెళ్తున్న కారుపై పడింది. దీంతో.. రెండు కార్లలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి కారులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన మునగాల మండలం మాధవరం దగ్గర జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment