ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
Published Mon, Oct 3 2016 10:21 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
నేలమర్రి(మునగాల): మండలంలోని నేలమర్రి గ్రామపంచాయతీ శివారు గ్రామమైన మొరసకుంట తండలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మూడు బాలాజీ(33) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. వృత్తిలో భాగంగా సోమవారం గ్రామంలో పొలం దున్నేందుకు వెళుతుండగా మార్గమధ్యలో ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తిరగల పడడంతో బాలాజీ ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు,కుమారుడు ఉన్నారు.
Advertisement
Advertisement